ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశీయ సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం (పాదరక్షలు, ఫర్నీచర్‘పై దిగుమతి సుంకం పెంపు)
प्रविष्टि तिथि:
01 FEB 2020 2:37PM by PIB Hyderabad
దేశీయ సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించే దిశగా పాదరక్షలు, ఫర్నీచర్ తదితరాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రి బడ్జెట్‘లో ప్రతిపాదించారు. ఈ మేరకు పాదరక్షలపై 25 శాతం నుంచి 35 శాతానికి, వాటి తయారీలో వాడే భాగాలపై 15 శాతం నుంచి 20 శాతానికి, ఫర్నీచర్ మీద 20 శాతం నుంచి 25 శాతానికి సుంకం పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశంలోని వైద్య పరికరాల తయారీ పరిశ్రమలకు ఊతమివ్వడం కోసం దిగుమతి చేసుకునే పరికరాలపై 5 శాతం ఆరోగ్య సుంకం విధించాలని ప్రతిపాదించారు. అలాగే సిగరెట్లు, తదితర పొగాకు ఉత్పత్తులపై జాతీయ విపత్తుల ఆగంతుక సుంకం విధించాలని ప్రతిపాదన చేశారు.
**********
(रिलीज़ आईडी: 1601620)
आगंतुक पटल : 158