ఆర్థిక మంత్రిత్వ శాఖ
2020-21 ఆర్థిక సంవత్సరపు కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యపరిరక్షణ రంగానికి రూ 69,000 కోట్లు కేటాయింపు
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేసే ఆస్పత్రులకోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విండో ఏర్పాటుకు ప్రతిపాదన
2024 నాటికి జన్ ఔషధి కేంద్ర పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరణ
Posted On:
01 FEB 2020 2:28PM by PIB Hyderabad
సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన దార్శనిక లక్ష్యాన్ని సాధించేందుకు 2020-21 కేంద్ర బడ్జెట్‌లో రూ 69,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.ఇందులో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎంజెఎవై) కింద రూ 6,400 కోట్లు కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెడుతూ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రస్తుతం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(పిఎంజెఎవై) కింద సుమారు 20,000కు పైగా నమోదిత ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఈ పథకం కింద టైర్ -2, టైర్ -3 నగరాలలో పేదలకోసం మరిన్ని ఆస్పత్రులు ఆవసరమని ఆమె అన్నారు. పిపిపి పద్ధతిలో ఆస్పత్రులు నెలకొల్పేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను ప్రతిపాదించినట్టు చెప్పారు. తొలిదశలో ఆకాంక్షిత జిల్లాలలో ప్రస్తుతం ఆయుష్మాన్ కింద్ ఎంపానల్ అయిన ఆస్పత్రులు లేనిచోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వీటివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. వైద్య పరికరాలపై పన్ను రూపంలో వచ్చే సొమ్మును ఈ కీలక ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేథ వంటి వాటిని ఉపయోగించి వైద్య సిబ్బంది, వైద్య అధికారులు ముందస్తు చర్యల ద్వారా వ్యాధులను అరికట్టడానికి వీలు కలుగుతుంది. 2025 నాటికి టిబిని అంతం చేసే చర్యలను మరింత బలోపేతం చేయనున్నట్టు మంత్రి చెప్పారు.
2024 నాటికి జన్ ఔషధి కేంద్రాలను దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించి వాటి ద్వారా 2000 మందులు, 300 సర్జికల్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి ప్రకటించారు.
--------- --------------------------
(Release ID: 1601616)
Visitor Counter : 197