ప్రధాన మంత్రి కార్యాలయం

హిందుస్తాన్ టైమ్స్ లీడ‌ర్‌శిప్ స‌మిట్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 06 DEC 2019 12:13PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో జరిగిన హిందుస్తాన్ టైమ్స్ 17వ లీడ‌ర్‌శిప్ సమిట్ లో ప్రారంభోప‌న్యాసం చేశారు.

 

ఏ దేశ‌మైనా గానీ  లేదా ఏ స‌మాజ‌మైనా గానీ పురోగ‌మించాలంటే సంభాష‌ణ‌ లు ముఖ్యం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  సంవాదాలు ఒక ఉత్త‌మ‌మైన‌టువంటి భ‌విష్య‌త్తు కు పునాది ని వేస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.  ప్ర‌భుత్వం ప్ర‌స్తుత స‌మ‌స్య‌ లు మ‌రియు స‌వాళ్ళ విష‌యం లో స‌బ్‌ కా సాథ్‌, స‌బ్‌ కా వికాస్‌, స‌బ్‌ కా విశ్వాస్ మంత్రం అండ‌ తో కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/LKM_7616BNLA.JPG

 

 

ప్ర‌భుత్వం తీసుకొన్న అనేక నిర్ణ‌యాల ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, 370వ అధిక‌రణం ర‌ద్దు జ‌మ్ము- క‌శ్మీర్ మ‌రియు ల‌ద్దాఖ్ ల ప్ర‌జ‌ల కు ఒక నూత‌న ఆశాకిర‌ణం గా నిల‌చింద‌న్నారు.  ముస్లిమ్ మ‌హిళ‌ లు ముమ్మారు త‌లాక్ బారి నుండి ప్ర‌స్తుతం విముక్తులు అయ్యార‌ని ఆయ‌న తెలిపారు.  40 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల కు లాభాన్ని చేకూర్చినటువంటి ఢిల్లీ లోని అన‌ధీకృత కాల‌నీల కు సంబంధించిన నిర్ణ‌యాన్ని గురించి కూడాను ఆయ‌న ప్ర‌స్తావించారు.  ఆ త‌ర‌హా ప‌లు నిర్ణ‌యాల ను ఒక ఉత్త‌మ‌మైన రేప‌టి రోజు ను దృష్టి లో పెట్టుకొని, న్యూ ఇండియా ను దృష్టి లో పెట్టుకొని, తీసుకోవ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

మౌలిక స‌దుపాయాలు, పారిశుధ్యం మ‌రియు ఆరోగ్యం ల వంటి అభివృద్ధి సూచిక‌ లు ఎన్నిటిలోనో వెనుక‌ప‌ట్టు ప‌ట్టిన జిల్లాల పై ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం శ్ర‌ద్ధ తీసుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  112 జిల్లాల ను ఆకాంక్ష‌భ‌రిత జిల్లాలు గా అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని, దీనిలో భాగం గా పాల‌న‌ మ‌రియు వికాసం యొక్క ప్ర‌తి ఒక్క ప‌రామితి పై శ్ర‌ద్ధ వహిస్తున్నామ‌న్నారు.  ఈ జిల్లాల లో పోష‌కాహార లోపం, బ్యాంకింగ్ సౌక‌ర్యాల ల‌భ్య‌త‌, బీమా, విద్యుత్తు త‌దిత‌ర స‌దుపాయాల ను వాస్త‌వ కాల ప్రాతిప‌దిక‌ న ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.  112 జిల్లాల యొక్క ఉత్త‌మ భ‌విష్య‌త్తు దేశాని కి మెరుగైన భ‌విత కు పూచీ ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.

 

జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్ర‌భుత్వం 15 కోట్ల కుటుంబాల కు గొట్ట‌పు మార్గాల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా ను స‌మ‌కూర్చుతోంద‌న్నారు.  5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ క‌లిగిన ఆర్థిక వ్య‌వ‌స్థ గా భార‌త‌దేశాన్ని తీర్చిదిద్ద‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఈ ల‌క్ష్య సాధ‌న‌ కై ప్ర‌భుత్వం ఒక ప్ర‌మోట‌ర్ గాను, ఎనేబులర్ గాను మరియు ఫెసిలిటేటర్ గాను ప‌ని చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

 

చ‌రిత్రాత్మ‌క‌మైన‌టువంటి బ్యాంకుల విలీనం, శ్రామిక చ‌ట్టాల క్రోడీక‌ర‌ణ‌, బ్యాంకుల కు మ‌ళ్లీ మూల‌ధ‌న నిధుల ను అంద‌జేయ‌డం, కార్పొరేట్ టాక్స్ లో త‌గ్గింపు ల వంటి ప‌లు ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ను తీసుకోవ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యాన్ని మెరుగు ప‌ర‌చడానికి సంబంధించిన ర్యాంకింగు లో స‌ర్వోత్త‌మ‌మైన‌ ప‌నితీరు ను ప్ర‌ద‌ర్శించిన దేశాల లో ఒక దేశం గా భార‌త‌దేశం ఉంద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.  గ‌డ‌చిన 5 సంవ‌త్స‌రాల కాలం లో భార‌త‌దేశం 79 స్థానాల మేర‌కు మెరుగుప‌డిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ప‌నులు నిల‌చిపోయిన గృహనిర్మాణ ప‌థ‌కాల కు ఆర్థిక స‌హాయాన్ని అందించడం కోసం ప్ర‌త్యేకం గా 25,000 కోట్ల రూపాయ‌ల నిధి ని ఏర్పాటు చేసిన సంగ‌తి ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.  ప్ర‌భుత్వం 100 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంబంధిత ప‌థ‌కాల ను సైతం మొద‌లు పెడుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

 

 

ట్రావెల్ ఎండ్ టూరిజ‌మ్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఇండెక్స్ లో భార‌త‌దేశం 34వ స్థానం లో ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ప‌ర్య‌ట‌న రంగ కార్య‌క‌లాపాలు పెరిగితే ఉద్యోగ అవ‌కాశాల కు దారి తీస్తాయ‌ని, దీనివ‌ల్ల మ‌రీ ముఖ్యం గా పేద‌ల కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆయ‌న అన్నారు.  మాన‌వ వ‌న‌రుల లో ప‌రివ‌ర్త‌న కై వివిధ కార్య‌క్ర‌మాల ను న‌డుపుతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.  ప్ర‌భుత్వం ఫ‌లితాల‌ పై ఆధారప‌డిన విధానం తో ప‌ని చేస్తూ, కాలబ‌ద్ధ సేవ‌ల అంద‌జేత పై దృష్టి పెట్టింద‌ని ఆయ‌న చెప్పారు.  ‘‘స‌రైన ఉద్దేశ్యం, స‌ర్వోత్త‌మ సాంకేతిక ప‌రిజ్ఞానం ల‌తో పాటు 130 కోట్ల మంది భార‌తీయు ల‌కు చ‌క్కని భ‌విష్య‌త్తు కోసం ప్ర‌భావ‌శీలమైన‌టువంటి ఆచ‌ర‌ణ అనేవి ప్ర‌భుత్వాని కి మార్గ‌సూచీ వలె ఉన్నాయి’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

 

 

 

**



(Release ID: 1595367) Visitor Counter : 96