ప్రధాన మంత్రి కార్యాలయం
గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు ను స్వీకరించిన సందర్భం గా ప్రధాన మంత్రి ఉపన్యాసం
Posted On:
25 SEP 2019 7:12AM by PIB Hyderabad
శ్రీ గేట్స్ మరియు శ్రీమతి గేట్స్,
ఎక్స్‌లెన్సీస్,
మిత్రులారా,
ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఈ సత్కారం నాకు ఒక్కడికే కాదు, స్వచ్ఛ్ భారత్ సంకల్పాన్ని తీసుకొని, వారి దైనందిన జీవనం లో ఆచరణ లో పెట్టినటువంటి కోట్లాది భారతీయులందరికీ చెందుతుంది. బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ నుండి ఈ అవార్డు ను స్వీకరించడం మరో రెండు కారణాల రీత్యా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఒకటో కారణం ఏమిటంటే, ఈ ఫౌండేశన్ భారతదేశం లోని మారుమూల ప్రాంతాల లో స్వచ్ఛ్ భారత్ అబియాన్ లో ఒక ముఖ్యమైన భాగస్వామి గా ఉంది. రెండో కారణం ఏమిటంటే, శ్రీ బిల్ గేట్స్ మరియు శ్రీమతి మెలిండా గేట్స్ వారి స్వీయ జీవనం లో అనేక సాఫల్యాల ను సాధించిన అనంతరం, సామాజిక జీవనాని కి తోడ్పాటును అందిస్తూ ఉండటాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను.
మిత్రులారా,
మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భం గా ఈ అవార్డు ను అందుకోవడం కూడా స్వయం గా నాకు ఎంతో ముఖ్యమైనటువంటిది. 130 కోట్ల మంది ఏ సంకల్పాన్నయినా సాధించాలని నిశ్చయించుకొన్నప్పుడు, ఎవరైనా ఏ సవాలునైనా అధిగమించవచ్చనే దాని కి ఇది ఒక రుజువు గా ఉంది. అయిదు సంవత్సరాల క్రిందట స్వచ్ఛ్ భారత్ ను గురించి నేను చెప్పినప్పుడు నాకు లభించిన ప్రతిస్పందన ఏ విధం గా ఉందో నేను గుర్తు కు తెచ్చుకుంటున్నాను. ఈ రోజు కు కూడాను ప్రజలు తరచు గా నన్ను ఆక్షేపిస్తున్నారు. అయితే, ఏదైనా పని ని ఒక లక్ష్యం కోసం, ఒక ప్రయోజనం కోసం, ఒక నిబద్ధత తో చేసినట్లయితే అటువంటి అంశాలు పట్టించుకోనక్కరలేదు. నాకు పట్టేదల్లా 130 కోట్ల మంది భారతీయులు మా దేశాన్ని పరిశుభ్రమైంది గా తీర్చిదిద్దడం కోసం కలసి ముందంజవేయడం అనేదే. నాకు కావలసిందల్లా 130 కోట్ల మంది భారతీయుల లో పరిశుభ్రత ను పరిరక్షించుకోవాలనే ఒక దార్శనికత ను పురికొల్పడమే. భారతదేశాన్ని నిర్మలం గా ఉంచడం కోసం ఆ 130 కోట్ల మంది భారతీయులు నడుం కట్టే ప్రతి ఒక్క ప్రయత్నం.. ఇదే నేను లెక్క లోకి తీసుకొనేది. మరి ఈ కారణం గా ఈ సత్కారాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్ ను ఒక ప్రజా ఆందోళన గా మార్చివేసినటువంటి, అలాగే వారి నిత్య జీవనం లో పరిశుభ్రత కు అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి వారికి నేను సమర్పణం చేస్తున్నాను. గ్రామం లో టాయిలెట్ల ను నిర్మించడం కోసం తన మేకల ను విక్రయించిన ఒక వృద్ధురాని గురించి ఈ రోజున నేను ప్రస్తావించ దలచాను. టాయిలెట్ల నిర్మాణం కోసం విశ్రాంత ఉపాధ్యాయుడు ఎవరయితే వారి పూర్తి పింఛను ను విరాళం గా ఇచ్చారో, వారిని గురించి ఈ రోజున నేను ప్రస్తావించ దలచాను. ఇంటి కి ఒక టాయిలెట్ ను నిర్మించడం కోసమని ఒక మహిళ ఎవరయితే ఆఖరుకు తన మంగళసూత్రాన్ని సైతం అమ్మివేసిందో ఆమె ను గురించి ఈ రోజు నేను ప్రస్తావించ దలచుకొన్నాను.
సోదరీమణులు మరియు సోదరులారా,
మరే దేశం లో కూడా ఆ తరహా ప్రచార ఉద్యమాన్ని ఈ మధ్య కాలం లో కని విని ఉండరు. ఈ ప్రచార ఉద్యమాన్ని మా ప్రభుత్వం ద్వారా ప్రారంభించినప్పటి కీ, దీని తాలూకు ఆదేశాన్ని ప్రజలు వారంతట వారు శిరోధార్యం గా తీసుకొన్నారు. ఫలితం గా గడచిన అయిదు సంవత్సరాల కాలం లో దేశం లో 11 కోట్ల కు పైగా టాయిలెట్లు నిర్మాణం అయ్యాయి. ఇది ఒక రికార్డు గా ఉంది. తత్ పర్యవసానం గా 2014వ సంవత్సరం కన్నా ముందు గ్రామీణ పారిశుధ్య స్థాయి 40 శాతం కన్నా తక్కువ గా ఉన్నది కాస్తా, ప్రస్తుతం దాదాపుగా 100 శాతాని కి చేరుకొంటోంది. ఒక విషయాన్ని ఊహించండి, స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 70 సంవత్సరాల కాలం లో 40 శాతం కన్నా తక్కువ గా ఉన్నది కాస్తా, 5 సంవత్సరాల కాలంలో దాదాపు 100 శాతం స్థాయి కి చేరుకోవడం అంటే ఏమిటో? అయితే, స్వచ్ఛ్ భారత్ అభియాన్ యొక్క సాఫల్యం ఏ సంఖ్య కన్నా మిన్న అయినటువంటిదని నేను నమ్ముతున్నాను. ఈ ఉద్యమం సమాజం లోని ఏ వర్గానికైనా మహా లబ్ధి ని ప్రసాదించింది అంటే, ఆ వర్గం దేశం లోని పేదలు, మరియు మహిళలే. ఏ కాస్త కలిమి గలవారు అయినా వారి యొక్క ఇళ్ళ లో రెండు లేక మూడు టాయిలెట్లను కట్టుకోవడం పరిపాటి. కానీ, ఈ సౌకర్యం లోపించిన వారి కి ఒక టాయిలెట్ అనేది లేకపోతే ఎంత బాధాకరమో తెలుసు ను. మరీ ముఖ్యం గా మహిళల కు, సోదరీమణుల కు మరియు కుమార్తెల కు టాయిలెట్ లు లేకుండా మనుగడ సాగించడం అత్యంత ఇబ్బందికర పరిస్థితుల లో ఒకటి గా ఉంటుంది. అది వారి కి గౌరవ సమస్య ను కొని తెస్తుంది. నీ స్వీయ అనుభవం లో ఈ పరిస్థితి ని అంతటినీ తెలుసుకొన్నప్పటి కీ, ఇంటికి టాయిలెట్ల ను నిర్మించే విషయం లో ఎటువంటి ఆందోళన వ్యక్తం కాలేదని నేను చెప్పగలను. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా, అని పగటి పూట అంతా వేచి ఉండేటటువంటి మహిళల ను గురించి మీరు ఒక సారి ఊహించండి! ఆరుబయలు ప్రదేశాల లో మలమూత్రాదుల విసర్జన వల్ల రోగాల బారిన పడటమే కాకుండా, వారి కాలకృత్యాల ను తీర్చుకోవడం కోసం ఎదురు చూడటమనేది మరిన్ని రోగాల వైపునకు వారిని నెట్టివేసింది.
టాయిలెట్లు లేని కారణం గా ఎంతో మంది బాలికలు బడి కి వెళ్ళడాన్ని మధ్యలోనే మానివేయవలసి వచ్చింది. మా కుమార్తెలు చదువుకోవాలని అనుకున్నా, టాయిలెట్ల లోపం వారిని బడి మానేసి ఇంట్లో కూర్చోక తప్పని పరిస్థితి ని కల్పించింది. ఈ పరిస్థితి నుండి దేశం లోని పేద మహిళలు మరియు పుత్రికల ను బయటకు తీసుకు రావడం నా ప్రభుత్వ బాధ్యత. మరి మేము మా యొక్క మొత్తం యావత్తు చిత్తశుద్ధి మరియు శక్తి ని కూడదీసుకొని పూర్తి చేశాం. ప్రస్తుతం స్వచ్ఛ్ భారత్ అభియాన్ లక్షలాది మంది ప్రజల మనుగడ కు ఒక మాధ్యమం గా మారిందన్న సంగతి మాకు ఎనలేని సంతృప్తి ని ఇస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్వచ్ఛ భారత్ కారణం గా 3 లక్షల మంది ప్రాణాల ను రక్షించేందుకు ఒక అవకాశం ఉంది. అదే విధం గా వారి ఇళ్ళ లో టాయిలెట్ లను నిర్మించుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబం కనీసం 50 వేల రూపాయల ను మిగుల్చుకొంటోందని యూనిసెఫ్ అంచనా వేసింది. బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ రూపొందించిన ఒక కొత్త నివేదిక ను బట్టి చూస్తే భారతదేశం లో గ్రామీణ ప్రాంత పారిశుధ్యం మెరుగైన కారణం గా చిన్నారుల లో గుండె సంబంధిత సమస్య తగ్గడమే కాకుండా, మహిళల లో బాడీ మాస్ ఇండెక్స్ కూడా మెరుగయినట్లు నా దృష్టి కి వచ్చింది. స్వచ్ఛత తాలూకు ఈ లాభాలన్నింటినీ గమనించినప్పుడు మహాత్మ గాంధీ తాను స్వచ్ఛత ను స్వాతంత్య్రాని కన్నా మరింత ముఖ్యం గా భావిస్తున్నట్లు చెప్పిన విషయం జ్ఞప్తి కి వస్తుంది. మహాత్మ గాంధీ కన్నా పరిశుభ్రత తాలూకు స్వప్నం ప్రస్తుతం వాస్తవ రూపం దాల్చుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గాంధీజీ అనే వారు ఏమని అంటే, ఒక ఆదర్శవంతమైన గ్రామాన్ని అది పూర్తి గా పరిశుభ్రత తో నిండి ఉన్నప్పుడు మాత్రమే నిర్మించడం సాధ్యం అవుతుంది అని. ఈ రోజున మనం యావత్తు దేశం పరిశుభ్రత పరం గా ఆదర్శవంతమైన దేశం గా రూపొందే దిశ గా ముందుకు సాగుతున్నాము.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఐక్య రాజ్య సమితి ప్రారంభమైనప్పటి నుండి ప్రజల జీవితాల ను మెరుగు పరచడమే దాని ప్రధాన లక్ష్యం గా ఉంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కోట్లాది ప్రజల జీవితాల ను ఉత్తమం గా తీర్చిదిద్దడం ఒక్కటే కాకుండా, వారి గౌరవాన్ని పరిరక్షించడం తో పాటు, ఐక్య రాజ్య సమితి లక్ష్యాల ను సాధించడం లో ఒక ముఖ్య పాత్ర ను సైతం పోషించింది.
యూనిసెఫ్ యొక్క మరొక అధ్యయనాన్ని మీకు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. గడచిన అయిదు సంవత్సరాల కాలం లో భూగర్భ జలం యొక్క నాణ్యత మెరుగైందని ఈ నివేదిక వెల్లడించింది. మరి నేను నమ్ముతున్న విషయం ఏమిటంటే, స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా ఇదే దిశ గా ఒక ప్రధానమైనటువంటి తోడ్పాటు ను అందించింది అని. స్వచ్ఛ్ భారత్ మిశన్ ప్రసరించినటువంటి మరొక ప్రభావాన్ని అంత లోతు గా చర్చించడం జరగడం లేదని అనిపిస్తోంది. ఈ ప్రచార ఉద్యమ కాలం లో నిర్మాణం జరిగిన 11 కోట్ల కు పైగా టాయిలెట్లు గ్రామాల స్థాయి లో ఆర్థిక కార్యకలాపాల కు ఒక నూతన ద్వారాన్ని కూడా తెరచాయి. టాయిలెట్ ల నిర్మాణం కోసం సమీకరించిన ముడి పదార్థాలు మరి నిర్మాణం లో చాలా భాగం మహిళల కు అప్పగించిన కారణం గా అట్టడుగు స్థాయిన పేదల కు నూతన ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరిగింది.
మిత్రులారా,
ప్రజాస్వామ్యం తాలూకు సరళమైన అర్థం ఏమిటి అంటే, అది పథకాల మరియు వ్యవస్థల కేంద్ర స్థానం లో ప్రజలు ఉండాలనేదే. బలమైన ప్రజాస్వామ్యం ఏది అంటే, దేనిలోనయితే విధానాల ను ప్రజల అవసరాల ను కేంద్రం గా చేసుకొని రూపొందించబడుతాయో అదన్నమాట. మరి ప్రజల అవసరాలు, అపేక్షలు, అలాగే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు మరియు విధానాలు ఒకే ఒక వేదిక పైకి చేరుకొంటే, అటువంటప్పుడు ఆ పథకాల ను ప్రజలే విజయవంతం చేస్తారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో ప్రజాస్వామ్యం యొక్క ఇటువంటి శక్తి కూడా ప్రతిబింబించింది. స్వచ్ఛ్ భారత్ సఫలత సైతం రాజ్యంగ వ్యవస్థ ను సజీవం గా ఉంచేందుకు ఒక ఉదాహరణ గా నిలచింది.
మిత్రులారా,
భారతదేశం దశాబ్దాల తరబడి కేవలం రాజ్యాంగ సమాఖ్య విధానాన్ని మాత్రమే వీక్షించింది. మా ప్రభుత్వం దీని ని సహకారాత్మక సమాఖ్య విధానం గా మార్చేందుకు ప్రయత్నించింది. మరి కాల క్రమం లో మనము స్పర్ధాత్మక, సహకారాత్మక సమాఖ్య తత్వం అనే మార్గం దిశ గా కదులుతున్నాం. ఈ ప్రచార ఉద్యమం లో భారతదేశం లోని వేరు వేరు రాష్ట్రాలు ఏ విధం గా ముందుకు సాగి పాలుపంచుకొన్నాయో అది ప్రజల ను జాగృత పరచింది. టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రజలు కృషి చేసిన తీరు సైతం ప్రశంసనీయం గా ఉంది. ఈ ప్రచార ఉద్యమం లో పరిశుభ్రత కు సంబంధించిన ప్రతి ఒక్క అంశం లో రాష్ట్రాల ను కేంద్ర ప్రభుత్వం భాగస్వాములు గా చేసింది. నిధులు అందించడం దగ్గరి నుండి, శిక్షణ ను ఇచ్చే వరకు, ఏ ప్రయత్నాన్ని వదలి పెట్టలేదు. రాష్ట్రాల కు స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను వాటిదైన శైలి లో వేగవంతం చేయగలిగేందుకు మరియు దానికి సంబంధించిన సంకల్పాల ను నెరవేర్చేందుకు సాధ్యమైన అన్ని రకాలు గాను సహాయం చేయడమైంది. ఈ రోజున స్వచ్ఛత సర్వేక్షణ్ ద్వారా పరిశుభ్రత స్థానాల లో అగ్ర స్థానాని కి చేరుకోవడం కోసం రాష్ట్రాల మధ్య ఒక పోటీ నెలకొనడం పట్ల నేను సంతోషిస్తున్నాను.
ఫ్రెండ్స్ & ఎక్స్‌లెన్సీస్,
ప్రపంచాని కి భారతదేశం అందించినటువంటి ఈ తోడ్పాటు ను చూసి కూడా నేను సంతోషిస్తున్నాను. దీనికి కారణం ఏమిటంటే, మేము ప్రపంచాన్ని మా కుటుంబం గా భావించాం. వేల సంవత్సరాల తరబడి మాకు ‘ఉదార చరితానం తు వసుధైవ కుటుంబకమ్’ అని నేర్పుతూ వచ్చారు. ఈ మాటల కు ‘యావత్తు పృథ్వి ఒక కుటుంబం’ అని మా భావం. ఈ కారణం గా భారతదేశం ఇంటర్‌నేశనల్ కో ఆపరేశన్ ఫర్ శానిటేశన్ ఎండ్ హైజీన్ లో ఒక బలమైన పాత్ర ను పోషించాలని అభిలషిస్తోంది. మేము మా యొక్క ప్రావీణ్యాన్ని మరియు అనుభవాన్ని ప్రపంచం లోని ఇతర దేశాల తో పంచుకొనేందుకు సిద్ధం గా ఉన్నాం. భారతదేశం పరిశుభ్రత తాలూకు తన లక్ష్యాన్ని సాధించేందుకు చేరువ గా ఉంది. అదే కాలం లో భారతదేశం ఇతర ప్రధాన ఉద్యమాల లో శీఘ్ర గతిన కృషి చేస్తోంది. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ద్వారా దేహ దారుఢ్యాన్ని మరియు ముందు జాగ్రత్తల తో కూడినటువంటి ఆరోగ్య సంరక్షణ ను ప్రోత్సహించడం కోసం ఒక ప్రచార ఉద్యమాన్ని అమలు చేస్తున్నాం. 2025వ సంవత్సరం కల్లా భారతదేశాన్ని క్షయ వ్యాధి కి తావు లేనటువంటి దేశం గా తీర్చిదిద్దాలని, అంతేకాకుండా, అందరి కీ వ్యాధి నిరోధం దిశ గా త్వరిత గతిన పయనించాలని మేము లక్ష్యాల ను నిర్దేశించుకున్నాం. జాతీయ పోషణ అభియాన్ అండ తో భారతదేశం రక్తహీనత, ఇంకా ఎదుగుదల సంబంధిత లోపాల నుండి చాలా వేగం గా బయటకు వస్తోంది. జల్ జీవన్ మిశన్ లో భాగం గా మేము నీటి సంరక్షణ పై శ్రద్ధ వహిస్తున్నాం. దీని ద్వారా భారతదేశం లో ప్రతి ఒక్కరు చాలినంత శుభ్రమైన నీటి ని అందుకొంటారు.
భారతదేశం 2022వ సంవత్సరం కల్లా ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ ను అరికట్టడం కోసం ఒక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ రోజున మీతో నేను మాట్లాడుతూ ఉన్న కాలం లో భారతదేశం లోని చాలా ప్రాంతాల లో ప్లాస్టిక్ వ్యర్థాల ను సేకరించే పని జరుగుతోంది. ప్రస్తుతం భారతదేశం లో ఇటువంటివే చాలా ప్రజా ఆందోళనలు అనేకం కొనసాగుతున్నాయి. 1.3 బిలియన్ భారతీయుల బలం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ మాదిరిగానే, ఇతర ఉద్యమాలు కూడా విజయవంతం అవుతాయన్న నమ్మకం నాలో ఉంది. ఈ ఆశ తో ఈ అవార్డు ను నాకు ఇచ్చిన బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ తాలూకు మిత్రులు అందరి కీ, మరి అలాగే ఇక్కడ కు విచ్చేసిన ఇతర స్నేహితులు అందరి కీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 1586780)
Visitor Counter : 127