ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎన్‌జిఎ 74 సందర్భం గా ఇస్తోనియా అధ్యక్షురాలి తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
26 SEP 2019 6:30AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎన్‌జిఎ 74 సందర్భం గా రిపబ్లిక్ ఆఫ్ ఇస్తోనియా అధ్యక్షురాలు మాననీయురాలు కెర్ స్తీ కల్ జులాయిద్ తో భేటీ అయ్యారు. నేత లు ఇరువురూ ద్వైపాక్షిక సంబంధాల పై విస్తృతం గా చర్చించారు. భారతదేశ ఉప రాష్ట్రపతి 2019వ సంవత్సరం ఆగస్టు లో ఇస్తోనియా పర్యటన ఫలప్రదం అయిందన్న సంగతి వీరి చర్చల లో చోటు చేసుకొంది.
ఇ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా నూతన ఆవిష్కరణ ల వంటి రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడాన్ని గురించి నేతలు ఉభయులూ చర్చించారు. యుఎన్ఎస్‌సి లో శాశ్వతేతర ప్రాతిపదిక న సభ్యత్వం కైసం (2021-2022 మధ్య కాలాని కిగాను) భారతదేశం యొక్క అభ్యర్ధిత్వాని కి మద్ధతు ఇస్తున్నందుకు ఇస్తోనియా కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక సహకారానికి ఆస్కారం ఉన్న అవకాశాల ను మరింత పెంపొందించుకోవడం పట్ల ఇస్తోనియా ఆలోచనల ను గురించి తెలుసుకొనేందుకు ఆ రకం గా ఇరుపక్షాల మధ్య ఇప్పటికే ఉన్న స్నేహపూర్వకమైన బంధాల ను మరింత పటిష్టం చేసుకొనేందుకు ఈ సమావేశం ఒక వేదిక ను సమకూర్చింది.
**
(Release ID: 1586429)
Visitor Counter : 95