ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర బడ్జెట్ 2019-20 కీలక ప్రధానాంశాలు

Posted On: 05 JUL 2019 1:59PM by PIB Hyderabad

కేంద్ర ఆర్ధిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తమ తొలి బడ్జెట్ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించారు.  2019 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు

వచ్చే దశాబ్దానికి 10 అంశాల దార్శనికత :

·         జన బాగీదారీ ద్వారా టీం ఇండియా నిర్మాణం :  కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన

·         కాలుష్య రహిత బారత్ నిర్మాణం ద్వారా హరిత పృథ్వి మరియు నీలి ఆకాశం సాధన లక్ష్యం

·         ఆర్ధిక వ్యవస్థలోని అన్ని రంగాలకు డిజిటల్ ఇండియా ప్రభావం విస్తరించేలా చర్యలు

·         గగన్ యాన్, చంద్రయాన్ ఇతర రోదసీ మైర్యు ఉపగ్రహ కార్యక్రమాలు ప్రారంభించడం

·         భౌతిక , సామాజిక మౌలిక సదుపాయాల నిర్మాణం

·         నీరు, జలనిర్వహణ, పరిశుబ్రమైన నదులు

·         నీలి ఆర్ధికవ్యవస్థ

·         ఆహార ధాన్యాల ఎగుమతి, పప్పుధాన్యాలు , నూనె గింజలు , పళ్ళు మరియు కూరగాయల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి  మరియు ఎగుమతి

·         ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు కృషి, మహిళలు, పిల్లలకు మంచి  పౌష్టిక ఆహారం పంపిణీ,  పౌరుల భద్రత

·         చిన్న మధ్య తరహా సంస్థలు,  అంకుర సంస్థల అభివృద్ధి, రక్షణ ఉత్పత్తుల తయారీ, ఆటోమొబైల్స్,  ఎలక్ట్రానిక్స్,  ఫాబ్స్ మరియు బ్యాటరీలు మరియు మేక్ ఇన్ ఇండియా  ద్వారా తయారైన వైద్య ఉపకరణాలపై  ప్రత్యేక శ్రద్ధ

5 వేల లక్షల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ దిశగా...

దేశ ప్రజల హృదయాలన్నీ ఆశ, విశ్వాసం, ఆకాంక్షలతో నిండి ఉన్నాయని ఆర్ధిక మంత్రి అన్నారు.

·         ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ ౩ వేల లక్షల డాలర్ల స్థాయికి చేరుతుంది

·         దేశ ఆర్ధిక వ్యవస్థను 5 వేల లక్షల ఆర్ధిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది

·         “ఇండియాలో ఉద్యోగాలు కల్పించేది, సంపదను సృష్టించేది ఇండియా ఇంక్ “ అని ఆర్ధిక మంత్రి అన్నారు.

·         పెట్టుబడులు అవసరమైన రంగాలు:

మౌలిక సదుపాయాలు

డిజిటల్ ఆర్ధికవ్యవస్థ

చిన్న మరియు మధ్యతరహా సంస్థలలో ఉద్యోగాల కల్పన

పెట్టుబడుల శృంఖల వేగం పుంజుకునేందుకు అవసరమైన ఉపక్రమణ చర్యలకు ప్రతిపాదన

వ్యాపార నిర్వహణను సులభతరం చేసే ముద్ర రుణాల వల్ల సామాన్యుల జీవనంలో మార్పు వచ్చింది

చిన్న మధ్యతరహా సంస్థల కోసం చేపట్టే చర్యలు:  

o    ప్రధానమంత్రి కరం యోగి మానధాన్ స్కీమ్

§  ఏడాదికి కోటిన్నర రూపాయల టర్నోవర్ దాటని మూడుకోట్ల మంది చిన్న రిటైల్ వ్యాపారులు మరియు చిన్న దుకాణదారులకు పెన్షన్ ప్రయోజనాలు

§  ఇందుకు నమోదు చేసుకోవడం చాల సులభం కేవలం ఆధార్, బ్యాంకు ఖాతా మరియు స్వయం ప్రకటన (డిక్లరేషన్) ఇవ్వవలసి ఉంటుంది.

§  జి ఎస్ టి లో నమోదైన చిన్న మధ్యతరహా సంస్థలు అన్నింటి  కోసం వడ్డీ రాయితీ పథకానికి 2019-20 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించారు.  ఈ పథకం కింద కొత్త లేక ఆవృత్త రుణాలకు ప్రభుత్వం 2% ఆర్ధిక సహాయం అందజేస్తుంది.

§  ఎమ్ ఎస్ ఎం ఇ లకు ప్రభుత్వ చెల్లింపులలో జాప్యాన్ని నివారించడానికి ఒక ప్రత్యేక వేదిక (ప్లాట్ ఫాం) ఏర్పాటు చేస్తారు. సంస్థలు తమ బిల్లులను ఆ వేదిక ద్వారా సమర్పించవచ్చు.  వారి చెల్లింపులు కూడా దాని ద్వారానే జరుగుతాయి.

§  నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎం సి ఎం సి) ఆధారంగా రవాణా రంగం కోసం ఇండియాలో దేశీయంగా అభివృద్ధి చేసి 2019 మార్చిలో చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించడం జరిగింది.

 

§  రూపే కార్డు ద్వారా చలామణి అయ్యే అన్ని రవాణా వ్యవస్థలకు పనికి వచ్చే కార్డు ద్వారా బస్సు ప్రయాణం, టోల్ పన్ను, పార్కింగ్ చార్జీలు, చిల్లర దుకాణాలలో కొనుగోళ్ళు చేయవచ్చు

 

§  వివిధ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలను, వసతులను  పెంచేదుకు అవసరమైన అన్నిరకాల భౌతిక వసతుల అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది .

ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన

పారిశ్రామిక కారిడార్లు , వివిధ వాహనాలలో సరుకులు నింపడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కారిడార్

భారత్ మాల  మరియు సాగర మాల ప్రాజెక్టులు , జల మార్గ వికాస్ మరియు ఉడాన్ పథకాలు

భారత్ మాల ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా రాష్ట్ర రోడ్డు వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

జలమార్గ వికాస ప్రాజెక్టు చేపట్టి  2019-20లో సాహిబ్ గంజ్ మరియు హాల్దియాలలో మల్టీ మోడల్ టర్మినల్స్ ఏర్పాటు, ఫరాక్కా వద్ద లాకులు ఏర్పాటు ద్వారా గంగా నదిలో జలమార్గ రవాణా సామర్ధ్యాన్ని పెంచాలని సంకల్పం.

వచ్చే నాలుగేళ్ళలో గంగా నదిలో సరుకుల రవాణా నాలుగింతలు పెరగగలదని అంచనా. దానివల్ల మరింత చౌకలో సరుకుల రవాణా, ప్రయాణ సౌకర్యం కలుగుతుంది మరియు దిగుమతి వ్యయం తగ్గుతుంది.

2018-2030 మధ్య కాలంలో రైల్వేలలో మౌలిక సదుపాయాలు పెంచడానికి రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం.

ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంలో రైలు మార్గాల అభివృద్ధి మరియు పూర్తి, రోలింగ్ స్టాకు తయారీ, ప్రయాణీకుల సరుకుల బట్వాడాకు ప్రతిపాదన.

దేశవ్యాప్తంగా 657 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థ నిర్వహణలోకి వచ్చింది. రాకపోకలు జరుగుతున్నాయి.

విమానయాన రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుగా విమానాల నిర్వహణ, మరమ్మతు మరియు సమగ్ర పరిశీలనకు వీలుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

విమాన రంగంలో పెట్టుబడులు మరియు విమానాలను అద్దెకిచ్చే కార్యకలాపాలకు ఇండియాను కేంద్రంగా మర్చాదానికి అవసరమైన నియంత్రణలతో ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తుంది.

విద్యుత్ వాహనాల కొనుగోలు, త్వరితగతిన చార్జింగ్ సదుపాయాల ఏర్పాటును ప్రోత్సహించడానికి వచ్చే మూడేళ్ళలో ఫేం 2 పథకం కింద  రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టె ప్రతిపాదనకు ఆమోదం.  ఈ పథకం      కింద బ్యాటరీతో నడిచే అత్యంత ఆధునాతణ ఇ-వాహనాలకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇస్తారు.

జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటునకు దోహదం చేసే విధంగా జాతీయ రహదారుల కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. ఇందుకోసం పెట్టుబడులకు అవకాశం ఉన్న నమూనాను ఉపయోగిస్తారు. 

‘ఒక దేశం , ఒకే గ్రిద్’ అనే నినాదంతో రాష్ట్రాలకు చౌక ధరల్లో విద్యుత్ సరఫరా

గ్యాస్ గ్రిడ్, నీటి గ్రిడ్, ఐ-వేస్ మరియు ప్రాంతీయ విమానాశ్రయాల నమూనా చిత్రాల లభ్యత.

ఉన్నత స్థాయి సాధికార కమిటీ సిఫార్సుల అమలు :

పాత మరియు అసమర్ధ ప్లాంటుల విరమణ

సహజ వాయువు కొరత వల్ల గ్యాస్ ప్లాంట్లు పూర్తి సామర్ధ్యంతో పనిచేయకపోవడంపై దృష్టి

పారిశ్రామిక వినియోగం, భారీగా విద్యుత్ వినియోగించే సంస్థలకోసం బహిరంగ విపణిలో గానీ , సంస్థ లోపల ఉత్పత్తి చేసి గానీ  అమ్మే కంపెనీలకు  ఉజ్వల డిస్కాం హామీ యోజన (ఉదయ్) కింద క్రాస్  సబ్సిడీ సర్చార్జీలు,  అనుచిత సుంకాలు చెల్లింపు నుంచి మినహాయింపు      ఇస్తారు.

విద్యుత్ రంగం టారిఫ్ మరియు నిర్మాణాత్మక సంస్కరణలను త్వరలో ప్రకటిస్తారు.

అద్దె ఇళ్ళను ప్రోత్సహించడానికి సంస్కరణలు

నమూనా కౌలు చట్టానికి తుదిరూపమిచ్చి రాష్ట్రాలకు పమపడం జరుగుతుంది.

ఉమ్మడి అభివృద్ధి మరియు రాయితీ యంత్రాంగాల ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల అధీనంలో ఉన్న భూములలో చౌకలో ఇళ్ళు మరియు సార్వజనీన  మౌలిక సదుపాయాల ఏర్పాటునకు చర్యలు

 మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి వనరులు పెంచేందుకు చర్యలు

 

o    2019-2020 ఆర్ధిక సంవత్సరంలో క్రెడిట్ గ్యారంటీ ఎన్హాన్స్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు

 

o    మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టితో మార్కెట్ నుంచి నిధుల సేకరణ కోసం దీర్ఘకాలిక బాండ్ల జారీకి కార్యాచరణ రూపకల్పన .

 

o    విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు / విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడులను (డెబిట్ సేక్యురిటీలు) నిర్ణేత కాలంలో ఎవరైనా దేశీయ ఇన్వెస్టర్లకు బదిలీ చేసుకునే / అమ్ముకునే వీలు కల్పించే ప్రతిపాదన.

 

బాండ్ మార్కెట్ల వృద్ధికి చర్యలు :

 

 

 

ఏఏ గ్రేడు గుర్తింపు పొందిన బాండ్లను స్టాకు ఎక్సేంజీలు అదనపు సేక్యురిటీగా పరిగణించే వీలు కల్పిస్తారు

కార్పొరేట్ బాండ్ల ట్రేడింగ్ వేదికలు వినియోగహితమా కాదా సమీక్షించడం జరుగుతుంది

సామాజిక స్టాకు ఎక్సేంజీ:

 

సెబి పరిధిలోకి ఎలక్ట్రానిక్ నిధుల సేకరణ వేదికలు

 

సామాజిక సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు

 

పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్ వలె వాటాలుగా, అప్పుగా లేక యునిట్లుగా సేకరణ

 

లిస్టయిన కంపెనీలలో ప్రజల వాటాల మొత్తం 25% నుంచి  35% పెంచే ప్రతిపాదనను పరిశీలించనున్న సెబి

 

విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ ఫై ఐ) కోసం కే వై సి నిబంధనలు మదుపరులహితంగా మారనున్నాయి.

 

స్టాకు ఎక్సేంజీలను ఉపయోగించి సంస్థాగత అభివృద్ధి ద్వారా ప్రభుత్వ సేక్యురిటీలలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు రిజర్వు బ్యాంకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం చేయూతనిస్తుంది.

 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్ డి ఐ) అనువైన గమ్యస్థానంగా ఇండియాను మార్చేందుకు చర్యలు :

 

బహుళ భాగస్వామ్య పరిశీలన తరువాత విమానయానం, మీడియా ( యానిమేషన్, ఏ వి జి సి ) మరియు బీమా రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు  మరింత వెసులుబాటు .

ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇండియాలో  ప్రపంచ మదుపరుల సమావేశం ఏర్పాటు చేస్తుంది.

ఎఫ్ పి ఐ లు లిస్టయిన  డెబిట్ సెక్యురిటీలలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తారు.

ప్రవాసుల పోర్టుఫోలియో పెట్టుబడుల పథకాన్ని మార్గాన్ని   విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల మార్గంతో విలీనం చేస్తారు.

వివిధ ఆర్ధిక సాధనాలు (ఇన్స్ట్రుమెంట్) ఆర్ ఇ ఐ టి , టి ఓ టి మొదలైన వాటి ద్వారా  సేకరించే మొత్తం  రూ. . 24,000  కోట్లు దాటుతుంది. 

·         అంతరిక్ష మంత్రిత్వ శాఖకు అనుబంధంగా కొత్తగా ఒక వాణిజ్య హస్తం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ ఎస్ ఐ ఎల్) అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తారు.

 

·         భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  ఉపగ్రహ వాహక నౌకల అమ్మకం,  సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, రోదసీ ఉత్పత్తుల మార్కెటింగ్, అమ్మకం వంటి  వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ సంస్థ తోడ్పడుతుంది. 

ప్రత్యక్ష పన్నులు

రూ. 400 కోట్ల కన్నా తక్కువ వార్షిక  టర్నోవర్ ఉన్న కంపెనీల పన్ను రేటు 25 శాతానికి తగ్గింపు

పన్ను విధించగల ఆదాయం రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు  మరియు రూ.5 కోట్లకు మించి ఉన్న వ్యక్తులు చెల్లించవలసిన సర్చార్జీ పెంపు

పన్ను చెల్లింపులు పెరిగాయి.  ప్రత్యక్ష పన్ను చెల్లింపులు గత అయిదేళ్ళలో 78% పెరిగి రూ. 11.37 లక్షల కోట్లకు చేరాయి.

టెక్నాలజీ వినియోగం ద్వారా పన్ను సులభతరం మరియు జీవన సౌలభ్యం

·         పాన్ మరియు ఆధార్ మార్పు (పరివర్తన)

·         పాన్ లేనివారు తమ ఆదాయపు పన్ను రిటర్నులను ఆధార్ ఉపయోగించి ఫైలు చేయవచ్చు

·         పాన్ అవసరమైన చోట్లలో ఆధార్ వాడవచ్చు .

 

ముందుగా పూర్తిచేసిన ఆదాయపు పన్ను రిటర్నులు అందుబాటులోకి రానున్నాయి.

 

·         వీటిలో వివిధ రకాల ఆదాయాలు మరియు కోతల గురించిన వివరాలు ఉంటాయి.  బ్యాంకులు , స్టాకు ఎక్సేంజీలు, మ్యూచువల్ ఫండ్స్ మొదలగు వాటినుంచి సమాచారం సేకరిస్తారు.

         పేస్ లెస్ ఇ – అసెస్మెంట్

    మనుష్య వినిమయసీమ లేకుండా పన్ను మదించే  ఇ- అసెస్మెంట్ పద్ధతిని ప్రవేశపెడతారు.

కొన్ని ప్రత్యేక లావాదేవీలకు సంబంధించి, పరస్పర విరుద్ధమైన సమాచారం ఉన్న కేసుల్లో ఈ పద్దతిని ఉపయోగిస్తారు.

అందుబాటు లో గృహాలు :

 

-- 45 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ వ‌ర‌కు గ‌ల గృహాల కొనుగోలు కు 2020 మార్చి 31 వ‌ర‌కు తీసుకున్న గృహ‌ రుణాల‌ కు చెల్లించిన వ‌డ్డీ పై  1.5 ల‌క్ష‌ల రూపాయ‌ల అద‌న‌పు మిన‌హాయింపు

--దీనితో 15 సంవ‌త్స‌రాల మొత్తం రుణ కాలం లో రూ 7 ల‌క్ష‌ల వ‌ర‌కు మొత్తం ప్ర‌యోజ‌నం

 

విద్యుత్ వాహ‌నాల‌ కు ప్రోత్సాహం:

 

--విద్యుత్ వాహ‌నాల రుణాల‌ పై చెల్లించిన వ‌డ్డీ పై రూ 1.5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు అద‌నం గా ఆదాయ‌పు ప‌న్ను  మిన‌హాయింపు

-- విద్యుత్ వాహ‌నాల‌ కు సంబంధించి కొన్ని ర‌కాల విడి భాగాల‌ పై క‌స్టమ్స్ సుంకం మిన‌హాయింపు

 

ఇత‌ర ప్ర‌త్య‌క్ష ప‌న్ను చ‌ర్య‌లు:

 

--ప‌న్ను చెల్లింపుదారుల వాస్త‌వ క‌ష్టాల‌ ను త‌గ్గించేందుకు ప‌న్ను చ‌ట్టాలు స‌ర‌ళ‌త‌రం:

-రిటర్నులు దాఖ‌లు చేయ‌నందుకు ప్రాసిక్యూష‌న్ ప్రారంభించ‌డానికి అధిక ప‌న్ను ప‌రిమితి

--ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం లోని సెక్ష‌న్ 50 సిఎ, సెక్ష‌న్ 56 లోని  కొన్ని ప్రొవిజ‌న్ల నుంచి  సంబంధిత త‌ర‌గ‌తి వ్య‌క్తుల‌కు మిన‌హాయింపు.

 

స్టార్ట‌ప్‌ల‌కు ఉప‌శ‌మ‌నం:

 

--స్టార్ట‌ప్‌ల‌ లో పెట్టుబ‌డి  కోసం నివాస భ‌వ‌నం అమ్మ‌కంపై మూల‌ధ‌న రాబ‌డిని 2021 ఆర్ధిక‌సంవ‌త్స‌రం వ‌ర‌కు కొన‌సాగింపు

--ఏంజెల్ టాక్స్ అంశం ప‌రిష్క‌రింప‌బ‌డింది.  స్టార్ట‌ప్‌ లు, ఇన్వెస్ట‌ర్లు దాఖ‌లు చేసే సంబందిత రిట‌ర్నులు, వాటిలో అందించే స‌మాచారం విష‌యం లో షేర్ ప్రీమియం విలువ‌ల‌ కు సంబంధించి ఎలాంటి ప‌రిశీల‌న ఉండ‌దు.

--స్టార్ట‌ప్‌ ల ఏర్పాటు కు సేక‌రించే నిధుల విష‌యం లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప‌రిశీల‌న అవ‌సరం ఉండ‌దు.

--ఇన్వెస్ట‌ర్ల గుర్తింపు, నిధుల మూలాల‌ కు సంబంధించి ఇ- వెరిఫికేష‌న్ ఏర్పాటు ఉంటుంది.

--పెండింగ్ అసెస్‌మెంట్‌ లు, సంబంధిత వివాదాల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక పాల‌నాప‌ర‌మైన  ఏర్పాటు

--సూప‌ర్‌వైజరీ అధికారి నుంచి అనుమ‌తి పొంద‌కుండా ఇలాంటి సంద‌ర్భాల‌ లో అసెసింగ్ అధికారి  విచార‌ణ చేప‌ట్ట‌డానికి లేదు.

--కేట‌గిరీ 2 ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి నిధుల‌ కు సంబంధించిన షేర్ల విలువ విష‌యం లో ఎలాంటి ప‌రిశీల‌న ఉండ‌దు.

-- క్యారీ ఫార్వ‌ర్డ్‌, సెట్ ఆఫ్ లాసెస్‌ కు సంబంధించిన నిబంధ‌న‌ల స‌డ‌లింపు.

 

ఎన్‌.బి.ఎఫ్‌.సి.లు:

 

 డిపాజిట్‌ లు సేక‌రించే ఎన్‌.బి.ఎఫ్‌.సి లు, డిపాజిట్లు స్వీక‌రించ‌ని వ్య‌వ‌స్థ‌ ప‌రం గా ప్ర‌ధాన‌మైన ఎన్‌.బి.ఎఫ్‌సిల విష‌యం లో కొన్ని రాని లేదా అప‌న‌మ్మ‌కం క‌లిగిన రుణాల‌ పై వ‌డ్డీ కి సంబందించి ఆ సంవ‌త్స‌రం లో తీసుకున్న వాస్త‌వ వ‌డ్డీ పై ప‌న్ను విధించ‌డం జ‌రుగుతుంది.

 

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫినాన్షియ‌ల్ స‌ర్వీసెస్ సెంట‌ర్ (ఐఎఫ్ ఎస్ సి)

 

--ఐఎఫ్ఎస్ సి ల‌కు ప్ర‌త్య‌క్ష ప‌న్ను ప్రోత్సాహ‌కాల ను ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది.

--15 సంవ‌త్స‌రాల కాలావ‌ధి లో ఏదైనా ప‌దేళ్ల బ్లాక్‌ లో నూరు శాతం లాభం తో ముడిప‌డిన త‌గ్గింపు

--కంపెనీలు, మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌ కు ప్ర‌స్తుతం , ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన రాబ‌డి లకు డివిడెండ్ పంపిణీ పన్ను నుంచి మిన‌హాయింపు

--ప్ర‌వాసుల‌ నుంచి తీసుకున్న రుణాల‌ పై వ‌డ్డీ చెల్లింపు న‌కు ప‌న్ను మిన‌హాయింపు

 

సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్ష‌న్ టాక్స్‌ (ఎస్ టి టి )

 

--ఆప్ష‌న్ లను ఎంచుకున్న సంద‌ర్భంలో కుదుర్చుకున్న ధ‌ర‌కు, సెటిల్‌మెంట్ ధ‌ర‌కు మ‌ధ్య తేడా కు మాత్ర‌మే ఎస్ టిటి పరిమితం.

 

ప‌రోక్ష‌ ప‌న్నులు:

 

 మేక్ ఇన్ ఇండియా

 

--జీడిప‌ప్పు, పివిసి, టైల్స్‌, ఆటో విడిభాగాలు, మార్బుల్ శ్లాబ్‌లు, ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్‌, సిసిటివి కెమెరాలు త‌దిత‌రాల‌పై బేసిక్ క‌స్ట‌మ్స్ సుంకాన్ని పెంచారు.

--ప్ర‌స్తుతం దేశం లో త‌యారౌతున్న కొన్ని ర‌కాల ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌కు సంబంధించి క‌స్ట‌మ్స్ సుంకం మిన‌హాయింపుల‌ ను ఉపసంహ‌రించుకున్నారు.

- పామ్ స్టెరిన్‌, ఫాటి ఆయిల్స్ పై ఎండ్ యూజ్ ఆధారిత‌ మిన‌హాయింపు ల ఉప‌సంహ‌ర‌ణ‌

-వివిధ‌ ర‌కాల పేప‌ర్ల‌ పై మిన‌హాయింపుల ఉప‌సంహ‌ర‌ణ‌

- దిగుమ‌తి చేసుకొనే పుస్త‌కాల‌ పై 5 శాతం బేసిక్ క‌స్ట‌మ్స్ సుంకం విధింపు

-కొన్ని ర‌కాల ముడిస‌ర‌కుల‌ పై కస్ట‌మ్స్ సుంకం త‌గ్గింపు అవి. :-

--కృత్రిమ మూత్ర‌పిండాలు, డిస్పోజ‌బుల్ స్టెరిలైజ్‌డ్ డ‌య‌లైజ‌ర్‌కు అవ‌స‌ర‌మైన ఇన్‌పుట్‌ లు, అణు విద్యుత్ కేంద్రాల‌ కు అవ‌స‌ర‌మైన ఇంధ‌నాలు, త‌దిత‌రాలు

-కొన్ని ప్ర‌త్యేక ఎల‌క్ట్రానిక్ వ‌స్తువు ల త‌యారీ కి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకు

 

రక్షణ:

 

భార‌త‌దేశం లో త‌యారు కాని డిఫెన్స్ ప‌రిక‌రాల‌ కు బేసిక్ క‌స్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు

 

ఇత‌ర ప‌రోక్ష ప‌న్ను ప్ర‌తిపాద‌న‌లు

 

--ముడి, పాక్షికం గా శుద్ధి చేసిన తోలు కు సంబంధించి ఎగుమ‌తి సుంకం హేతుబ‌ద్ధం.

--పెట్రోలు, డీజిల్‌ లపై  ప్ర‌త్యేక అద‌న‌పు ఎక్సైజ్ సుంకం, రోడ్‌, మౌలిక స‌దుపాయాల సెస్సు లీట‌రు కు 1 రూపాయి వంతున పెంపు

--బంగారం, ఇత‌ర విలువైన లోహాల‌ పై క‌స్ట‌మ్స్ సుంకం పెంపు

--జిఎస్‌ టి అమ‌లు లోకి రాక‌ ముందు సెంట్ర్ ఎక్సైజ్‌, స‌ర్వీస్ టాక్స్‌ కు సంబంధించి పెండింగ్‌ లో ఉన్న వివాదాల స‌త్వ‌ర ప‌రిష్కారాని కి వార‌స‌త్వం గా వ‌చ్చిన వివాదాల ప‌రిష్కార ప‌థ‌కం (లెగ‌సీ డిస్ ప్యూట్ రెజ‌ల్యూష‌న్ స్కీమ్)

 

గ్రామీణ్ భార‌త్‌:

 

--ఉజ్వ‌ల యోజ‌న‌, సౌభాగ్య యోజ‌న ల వంటి ప‌థ‌కాలు ప్ర‌తి గ్రామీణ కుటుంబ జీవ‌నం లో మార్పు తీసుకు వ‌చ్చి, వారి సుల‌భ‌త‌ర జీవ‌నాన్ని మెరుగు ప‌రిచాయి

--2022 నాటికి గ్రామీణ ప్రాంతాల‌ లో కోరుకున్న అంద‌రికీ విద్యుత్  స‌దుపాయం, ప‌రిశుభ్ర‌మైన‌ వంట‌ స‌దుపాయం .

--ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌- గ్రామీణ్ (పిఎంఎవై-జి) ప‌థ‌కం లో భాగం గా 2022 కల్లా అంద‌రికీ ఇళ్లు నిర్మించాల‌న్న‌ది ల‌క్ష్యం.

--అర్హులైన ల‌బ్ధిదారుల‌ కు  రెండో ద‌శ‌ లో (2019-2020 నుంచి 2021-22) 1.95 కోట్ల గృహాల‌ ను టాయిలెట్‌, విద్యుత్‌, ఎల్‌పిజి క‌నెక్ష‌న్ వంటి స‌దుపాయాల‌ తో అందిస్తారు.

 

-ప్ర‌ధాన‌ మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న (పిఎంఎంఎస్‌వై)

 

- డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిష‌రీస్ ఆధ్వ‌ర్యం లో పిఎంఎంఎస్‌వై ద్వారా బ‌ల‌మైన మ‌త్స్య యాజ‌మాన్య వ్య‌వ‌స్థ ఏర్పాటు

--ఇందుకు సంబంధించి మౌలిక స‌దుపాయాలు, ఆధునికీక‌ర‌ణ‌, ఉత్ప‌త్తి, ఉత్పాద‌క‌త‌, పంట అనంతర నిర్వ‌హ‌ణ‌, నాణ్య‌త ప్ర‌మాణాల‌ తో పాటు వాల్యూ చెయిన్‌ లో గ‌ల కీల‌క అంత‌రాల‌ ను గుర్తించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం

 

ప్ర‌ధాన‌ మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌( పిఎంజిఎస్‌వై):

 

--త‌గిన అర్హ‌త క‌లిగిన‌, సాధ్య‌మైన ఆవాసాల‌ను అనుసంధానం చేసే ల‌క్ష్యాన్ని 2022 నుంచి 2019కి ముందుకు జ‌ర‌ప‌డం జ‌రిగింది. ఇలాంటి 97 శాతం ఆవాసాల‌కు ఇప్ప‌టికే అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుక‌నే అనుసంధాన‌త‌ను క‌ల్పించ‌డం జ‌రిగింది.

--హ‌రిత సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి , ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, కోల్డ్ మిక్స్ టెక్నాల‌జీ తో 30 వేల కిలోమీట‌ర్ల పిఎంజిఎస్ వై రోడ్ల నిర్మాణం. దీనివ‌ల్ల కార్బ‌న్ ఫుట్‌ప్రింట్ త‌గ్గుతుంది.

--రాగ‌ల ఐదు సంవ‌త్స‌రాల‌ లో పిఎంజిఎస్‌వై -3 కింద 80,250 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో 1,25,000 కిలోమీట‌ర్ల పొడ‌వున‌ రోడ్ల స్థాయి ని పెంచ‌డం జ‌రుగుతుంది.

సంప్ర‌దాయ ప‌రిశ్ర‌మ‌ ల స్థాయి పెంపు, పున‌రుత్పాద‌క‌త‌ కు  నిధుల‌ కు సంబంధించిన ప‌థ‌కం (ఎస్‌.ఎఫ్‌.యు.ఆర్‌.టి.ఐ):

--సంప్ర‌దాయ ప‌రిశ్ర‌మ‌లు మ‌రింత ఉత్పాద‌క‌త సాధించ‌డానికి , లాభ‌దాయ‌కం గా ఉండడానికి, సుస్థిర ఉపాధి అవ‌కాశాల ను క‌ల్పించేందుకు కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్లు (సి.ఎఫ్‌.సి లు) ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.

--2019-20 సంవ‌త్స‌రం లో వెదురు, తేనె, ఖాదీ ల వంటి వాటి పై ప్ర‌త్యేక దృష్టి పెడుతూ 50 వేల మంది చేతివృత్తుల‌ వారు ఆర్థిక విలువ ప్ర‌క్రియ‌ లో భాగం పంచుకునేలా 100 కొత్త క్ల‌స్ట‌ర్లు ఏర్పాటు :

--నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌లు, నవ పారిశ్రామికత్వాన్ని ప్రోత్స‌హించేందుకు ఉద్దేశించిన ఎ.ఎస్‌.పి.ఐ.ఆర్‌.ఇ ప‌థ‌కాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తారు.

--89 లైవ్‌లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేట‌ర్లు (ఎల్‌బిఐ లు), 20 టెక్నాల‌జీ బిజినెస్ ఇంక్యుబేట‌ర్ లను 2019-20 లో ఏర్పాటు చేస్తారు.

--వ్య‌వ‌సాయ‌, గ్రామీణ‌ ప‌రిశ్ర‌మ రంగాల‌ లో 75,000 మంది నవ పారిశ్రామికుల కు శిక్ష‌ణ‌..

-- పొలాల నుంచి సేక‌రించే రైతుల ఉత్ప‌త్తుల‌కు విలువ జోడింపు , అలాగే అనుబంధ కార్య‌క‌లాపాల ద్వారా విలువ జోడింపున‌కు సంబంధించి ప్రైవేటు ఆంట్రప్రిన్యువర్ షిప్‌ కు మ‌ద్ద‌తు ..

--ప‌శుదాణా త‌యారీ, పాల సేక‌ర‌ణ‌, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్ లకు అవ‌స‌ర‌మైన మౌలిక సదుపాయాలు క‌ల్పించి, స‌హ‌కార సంఘాల ద్వారా పాడి ప‌రిశ్ర‌మ‌ ను ప్రోత్స‌హించ‌డం

--10,000 కొత్త ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌ ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.  రైతుల రాబ‌డి ఆర్థిక  స్థితి మెరుగుప‌డే దిశ‌ గా వీటిని ఏర్పాటు చేస్తారు.

--ఇ-ఎన్ఎఎమ్ ద్వారా రైతులు ప్ర‌యోజ‌నం పొందే విధంగా రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌ తో కేంద్ర ప్ర‌భుత్వం క‌లసి ప‌నిచేస్తుంది.

--జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయాని కి  సంబంధించి కొన్ని రాష్ట్రాల‌ లో రైతులు ఇప్ప‌టికే శిక్ష‌ణ పొందారు.  దీనిని ఇత‌ర రాష్ట్రాల‌ కు విస్త‌రింపచేయ‌డం జ‌రుగుతుంది.

 

భార‌త దేశ జ‌ల‌ భ‌ద్ర‌త‌:

 

--దేశం లో జ‌ల వ‌న‌రుల, స‌మ‌గ్ర‌, స‌మీకృత‌ నీటిస‌ర‌ఫ‌రా, యాజ‌మాన్యానికి సంబంధించిన అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు కొత్త జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ‌శాఖ ఏర్పాటైంది.

--2024 సంవ‌త్స‌రం నాటికి దేశం లోని అన్ని గ్రామీణ కుటుంబాల‌కు  హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ (పైపు ద్వారా నీటి సర‌ఫ‌రా) ప‌థ‌కాన్ని జ‌ల్ జీవ‌న్ మిష‌న్ సాధించ‌నుంది.

--స్థానిక స్థాయి లోనే నీటికి సంబంధించిన డిమాండ్‌, స‌ర‌ఫ‌రా యాజ‌మాన్యం పై స‌మ‌గ్ర దృష్టి పెట్ట‌డం జ‌రుగుతుంది.

--ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఇత‌ర ప‌థ‌కాల‌ తో క‌లుపుకొని ముంద‌ంజ వేయ‌డంం

--దేశ‌వ్యాప్తం గా భూగ‌ర్భ‌ జ‌లాల‌ ను విప‌రీతం గా వాడిన 256 జిల్లాల‌ లోని 1592 బ్లాకుల‌ ను జ‌ల‌శ‌క్తి అభియాన్ కోసం గుర్తించడం జ‌రిగింది.

---ఇందుకోసం కాంపెన్సేట‌రీ అఫారెస్టేష‌న్ ఫండ్ మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్ అథారిటీ (సిఎఎంపిఎ) నిధుల‌ ను నినియోగిస్తారు.

 

స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్ :

 

--2014, అక్టోబ‌ర్ 2 నుంచి 9.6 కోట్ల టాయిలెట్‌ల నిర్మించ‌డం జ‌రిగింది.

--దేశంలోని 5.6 ల‌క్ష‌లకు పైగా  గ్రామాలు బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హిత( ఒడిఎఫ్‌) గ్రామాలు గా మారాయి.

--ప్ర‌తి గ్రామం లో సుస్థిర ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌ ను చేప‌ట్టేందుకు స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ ను మ‌రింత విస్త‌రింప‌చేయ‌నున్నారు.

 

ప్ర‌ధాన‌ మంత్రి గ్రామీణ్ డిజిట‌ల్ సాక్ష‌ర‌త అభియాన్‌:

 

--దేశం లో రెండు కోట్ల‌కు పైగా గ్రామీణ భార‌తీయుల‌ ను డిజిట‌ల్ అక్షరాస్యులు గా చేయ‌డం జ‌రిగింది.

--గ్రామీణ‌,పట్ట‌ణ ప్రాంతాల మ‌ధ్య అంత‌రాన్ని తొల‌గించేందుకు భార‌త్ -నెట్ ప‌థ‌కం కింద ప్ర‌తి పంచాయితీకి ఇంట‌ర్నెట్ అనుసంధాన‌త క‌ల్పించ‌డం జ‌రిగింది.

--భార‌త్ నెట్ ప‌థ‌కాన్ని మ‌రింత వేగ‌వంతం చేసేందుకు పిపిపి ఏర్పాటు కింద యూనివ‌ర్స‌ల్ ఆబ్లిగేష‌న్ ఫండ్‌ను వినియోగించ‌డం జ‌రుగుతుంది.

 

--ష‌హ‌రీ భార‌త్‌:

 

 -ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న‌- అర్బ‌న్‌( పిఎంఎవై- అర్బ‌న్‌)

 

-4.83 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో 81 ల‌క్ష‌ల‌ కు పైగా ఇళ్ల‌ను మంజూరు చేయ‌గా అందులో 47 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం ప్రారంభ‌మైంది.

-26 ల‌క్ష‌ల‌కుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ఇందులో 24 ల‌క్ష‌ల ఇళ్లను ల‌బ్ధిదారుల‌ కు కేటాయించ‌డం జ‌రిగింది.

- నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి ఇప్ప‌టివ‌ర‌కూ 13 ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింది.

--న‌గ‌రాల‌ లో 95 శాతం బహిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హిత ప్ర‌దేశాలు గా ప్ర‌క‌టించుకున్నాయి.

---స్వ‌చ్ఛ‌తా యాప్‌ ను సుమారు కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

---2019 అక్టోబ‌ర్ 2 నాటికి భారతదేశాన్ని బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హితంగా తీర్చి దిద్దేందుకు గాంధీజీ క‌ల‌లు క‌న్న స్వ‌చ్ఛ‌భార‌త్‌ను సాకారం చేసే ల‌క్ష్యం

--ఈ సంద‌ర్భానికి గుర్తుగా రాష్ట్రీయ స్వ‌చ్ఛ‌తా కేంద్ర‌ ను 2019 అక్టోబ‌ర్ 2న రాజ్‌ ఘాట్‌ లో గాంధీ ద‌ర్శ‌న్ వ‌ద్ద ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.

--గాంధీ జీ ప్ర‌బోధించిన విలువ‌ల‌కు సంబంధించి యువ‌త‌ ను, స‌మాజాన్ని జాగృతం చేసేందుకు నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ సైన్స్ మ్యూజియ‌మ్స్ ఆధ్వ‌ర్యం లో గాంధీపీడియా ను అభివృద్ధి చేయ‌డం జరుగుతుంది.

--ఢిల్లీ- మేర‌ఠ్ మార్గం లో ప్ర‌తిపాదించిన రాపిడ్ రీజ‌ిన‌ల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఆర్‌.ఆర్‌.టి.ఎస్‌) లాగా స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహికిల్ (ఎస్‌పివి) ద్వారా స‌బ‌ర్బ‌న్ రైల్వేల‌ పై మ‌రింత పెట్టుబ‌డి పెట్టేందుకు రైల్వేల‌ ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంది.

మెట్రో రైల్వే కార్య‌క‌లాపాలను  పెంపొందించేందుకు ప్ర‌తిపాద‌న ఇందుకు:

-మ‌రిన్ని పిపిపి ల‌ను ప్రోత్స‌హిస్తారు.

-- ఇప్ప‌టికే మంజూరైన ప‌నుల‌ు పూర్తి అయ్యేటట్టు చూస్తారు.

---ట్రాన్సిట్ హ‌బ్‌ ల చుట్టూ వాణిజ్య కార్య‌క‌లాపాలు జ‌రిగే విధం గా ర‌వాణా ఆధారిత అభివృద్ధి (టిఒడి)కి అండ‌ గా నిలుస్తారు.

యువతరం

 

•         త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త జాతీయ విద్యా విధానం ప్రతిపాదనలు:

o    పాఠశాల, ఉన్నత విద్య స్థాయులు రెండింటి లోనూ కీలక మార్పులు.

o    మెరుగైన పాలన వ్యవస్థలు.

o    పరిశోధన, ఆవిష్కరణల పై నిశిత దృష్టి.

 

•         జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ ఆర్ఎఫ్) ఏర్పాటు కు ప్రతిపాదన; లక్ష్యాలు

 

o    దేశంలో పరిశోధనలకు సమన్వయం, ప్రోత్సాహం, నిధుల కేటాయింపు.

o     పరిశోధనల కోసం వివిధ మంత్రిత్వ శాఖలు వేర్వేరుగా కేటాయించే నిధుల ఏకీకరణ

o    దేశం లో అన్ని రకాల పరిశోధనల పర్యావరణ వ్యవస్థ బలోపేతం.

o    ఇందుకోసం అదనపు నిధుల కేటాయింపుతో పాటు అనుసంధానం

•     దేశం లోని ‘‘ప్రపంచ స్థాయి సంస్థల’’కు 2019-20 ఆర్థిక సంవత్సరం లో రూ.400 కోట్ల దాకా నిధుల కేటాయింపు.  మునుపటి ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల తో పోలిస్తే మూడు రెట్లకు పైగా పెంపు.

•      ‘‘భారత్‘లో చదవండి’’ పేరిట దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం కోసం విదేశీ విద్యార్థులకు ఆహ్వానం పలికే ప్రతిపాదన.

•      ఉన్నత విద్యా నియంత్రణ వ్యవస్థలలో సమగ్ర సంస్కరణలకు ప్రతిపాదన: లక్ష్యాలు

o    మరింత స్వయంప్రతిపత్తికి ప్రోత్సాహం.

o    విద్యా వ్యవస్థలో మరింత మెరుగైన ఫలితాల సాధనపై దృష్టి

•        భారత ఉన్నత విద్యా కమిషన్ (HECI) ఏర్పాటుపై ముసాయిదా చట్టం సమర్పణ.

•        అన్నివిధాలా అవసరమైన ఆర్థిక మద్దతు కల్పిస్తూ ‘‘ఖేలో ఇండియా పథకం’’ విస్తరణ

•       ఖేలో ఇండియా కింద దేశంలో క్రీడాకారులను తీర్చిదిద్దడానికి, అన్ని స్థాయులలో క్రీడలపట్ల ప్రజాదరణ పెంపునకు వీలుగా జాతీయ క్రీడావిద్య బోర్డు (NSEB) ఏర్పాటు.

•        విదేశాల్లో ఉపాధి పొందడానికి యువతను సిద్ధం చేసేదిశగా కృత్రిమ మేధస్సు (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), బిగ్ డేటా, 3డి ముద్రణ, కాల్పనిక వాస్తవికత (VR), రోబోటిక్స్, భాషా శిక్షణసహా అంతర్జాతీయంగా అవసరమైన నైపుణ్యాంశాలపై మరింత శ్రద్ధ.

•        బహుళ కార్మిక చట్టాల క్రమబద్ధీకరణ-ప్రామాణీకరణలో భాగంగా రిజిస్ట్రేషన్-రిటర్నుల దాఖలు కోసం నాలుగు కార్మిక స్మృతుల రూపకల్పనకు ప్రతిపాదన.

•        దూరదర్శన్ చానెళ్ల సమూహంలో అంకుర సంస్థల కోసం ప్రత్యేకంగా వాటిద్వారానే ఒక టెలివిజన్ కార్యక్రమం రూపకల్పనకు ప్రతిపాదన.

•       ‘‘స్టాండప్ ఇండియా పథకం’’ 2020-25దాకా కొనసాగింపు. గిరాకీ ఆధారిత వ్యాపారాలకు బ్యాంకులద్వారా ఆర్థిక సహాయం మంజూరు.

 

జీవన సౌలభ్యం

•        ‘‘ప్రధానమంత్రి శ్రమయోగి మంథన్ పథకం’’లో దాదాపు 30 లక్షల మంది అసంఘటిత, అనధికార రంగాల కార్మికుల చేరిక. ఈ పథకంలో సభ్యులైనవారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 వంతున పింఛన్ మంజూరు.

•         ‘‘ఉజాలా యోజన’’ కింద దేశంలో సుమారు 35 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ; దీంతో మొత్తం వ్యయంలో ఏటా రూ.18,341 కోట్లదాకా పొదుపు.

•       ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమ విధానంలో  సౌరశక్తి స్టవ్‘లు, బ్యాటరీ చార్జర్ల వాడకానికి ప్రోత్సాహం.

•      దేశంలో రైల్వే స్టేషన్ల అధునికీకరణ కోసం భారీస్థాయి కార్యక్రమానికి త్వరలో శ్రీకారం.

 నారీ... నీవు నారాయణివి/మహిళ

•    మహిళా కేంద్రక విధాన రూపకల్పన పద్ధతినుంచి మహిళా చోదిత వినూత్న కార్యక్రమాలు, ఉద్యమాలవైపు విధానపరమైన మార్పు.

•     లింగ ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు దిశగా ముందడుగు కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాములతో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన.

•     స్వయం సహాయక సంఘాలు (SHG):

o    మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ పథకాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించే ప్రతిపాదన.

o    స్వయం సహాయక సంఘాల్లో ప్రతి సభ్యత్వ నిర్ధారిత మహిళకూ తన జన్‘ధన్ బ్యాంకు ఖాతానుంచి నిల్వను మించి రూ.5,000దాకా అధికంగా తీసుకునే వెసులుబాటు.

o   ‘ముద్ర’ పథకం కింద ప్రతి స్వయం సహాయక సంఘంలో ఒకరు వంతున మహిళలకు రూ.లక్షదాకా రుణం.

భారత సున్నిత శక్తి (Soft Power)

•        ప్రవాస భారతీయులు స్వదేశం వచ్చాక ఆధార్ కార్డు జారీకోసం 180 రోజులు వేచిచూడాల్సిన పరిస్థితిని తప్పించే ప్రతిపాదనపై పరిశీలన.

•        ప్రతిపాదిత అంతర్జాతీయ విపణులతో అవసరమైన భౌగోళిక సూచీలు, పేటెంట్లుసహా సంప్రదాయ హస్త కళాకారులను అనుసంధానించే కార్యక్రమం.

•        ఆఫ్రికాలో 18 కొత్త భారత దౌత్య కార్యాలయాల ఏర్పాటుకు 2018 మార్చిలో ఆమోదం లభించాక ఇప్పటికే 5 ప్రారంభంకాగా, మరో 4 కొత్త రాయబార కార్యాలయాలు 2019-20లో మొదలు కానున్నాయి.

•      భారత ప్రగతి సహాయ పథకం (IDEAS) నవీకరణకు ప్రతిపాదన.

•      దేశంలోని 17 సారూప్య పర్యాటక ప్రదేశాలను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యాలుగా తీర్చిదిద్దే పనుల పురోగమనం.

•        ప్రస్తుత డిజిటల్ భాండాగారంద్వారా సుసంపన్న గిరిజన సంస్కృతి పరిరక్షణ, బలోపేతానికి నిర్ణయం.

 బ్యాంకింగ్ – ఆర్థిక రంగం

•         నిరుడు రూ.లక్ష కోట్లకుపైగా తగ్గిన వాణిజ్య బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(NPA).

•         గడచిన నాలుగేళ్లలో రికార్డుస్థాయిన రూ.4 లక్షల కోట్లకుపైగా వసూళ్లు.

•         నిరర్ధక ఆస్తుల భర్తీకి ముందస్తు కేటాయింపు శాతం గడచిన ఏడేళ్లకుగాను ఈసారి అత్యధికం.

•         దేశీయ రుణాల్లో వృద్ధి 1.38 శాతానికి చేరిక.

•         ప్రభుత్వరంగ బ్యాంకులకు సంబంధించిన చర్యలు:

o    రుణ మంజూరుకు ఉత్తేజమిచ్చేలా ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు కేటాయించే ప్రతిపాదన.

o    ప్రభుత్వరంగ బ్యాంకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఆన్‘లైన్ ద్వారా వ్యక్తిగత రుణాల మంజూరు, ఇంటిముంగిట బ్యాంకు సేవలు, ఒక బ్యాంకులోని ఖాతాదారుకు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల సేవల లభ్యతవంటి చర్యలు చేపట్టాలని ప్రతిపాదన.

o    ఇతరులు తమ ఖాతాలో జమచేసే నగదుపై ఖాతాదారుకు పూర్తి నియంత్రణతో సాధికారత కల్పనకు చర్యలు తీసుకోవాలి.

o   ప్రభుత్వరంగ బ్యాంకుల పాలన వ్యవహారాల బలోపేతానికి సంస్కరణలను అమలు చేయాలి.

•         బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)లకు సంబంధించిన చర్యలు:

o    బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు నియంత్రణాధికారం బలోపేతం అంశాన్ని ద్రవ్యబిల్లులో చేర్చేందుకు ప్రతిపాదన.

o    బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజలనుంచి నిధుల సమీకరణ కోసం ‘రుణపత్ర విమోచన నిధి’ ఏర్పాటు చేయాలన్న నిబంధన తొలగింపునకు ప్రతిపాదన.

o    ‘‘వాణిజ్య రాయితీ స్వీకరణ వ్యవస్థ’’ (TReDS)  వేదికలో భాగస్వామ్యానికి వీలుగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను అనుమతించేందుకు చర్యలు.

•       గృహ నిర్మాణ ఆర్థికసహాయ రంగంపై జాతీయ గృహనిర్మాణ సంస్థ(NHB)కుగల నియంత్రణాధికారాన్ని తిరిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించే ప్రతిపాదన.

•       రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం. ఈ దిశగా అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక సహాయ సంస్థలద్వారా నిధుల ప్రవాహం స్వరూప-స్వభావాల సిఫారసు కోసం కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన.

•       పెన్షన్ నిధి నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (PFRDA) పరిధి నుంచి జాతీయ పెన్షన్ పథకం(NPS) ట్రస్టును వేరుపరచేందుకు చర్యలు.

•        నికర స్వీయ నిధి పరిమితిని రూ.5,000 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు తగ్గిస్తూ నిబంధన సడలింపునకు ప్రతిపాదన.

o    అంతర్జాతీయ బీమా కంపెనీలు స్వదేశం నుంచే లావాదేవీలు కొనసాగించేందుకు వెసులుబాటు.

o    విదేశీ రీ-ఇన్సూరర్ సంస్థలు భారత్‘లోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంలో శాఖలు ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు.

•        కేంద్ర  ప్రభుత్వరంగ సంస్థ (CPSE)లకు సంబంధించిన చర్యలు:

o    పెట్టుబడుల ఉపసంహరణ వసూళ్ల లక్ష్యం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,000 కోట్లుగా నిర్దేశం.

o    ఎయిరిండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పున:ప్రారంభానికి ప్రభుత్వం తిరిగి చర్యలు తీసుకోవాలని, దీంతోపాటు మరిన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా ప్రైవేటురంగానికి అవకాశమివ్వాలని నిర్ణయం.

o    ప్రభుత్వరంగ సంస్థల వ్యూహాత్మక విక్రయానికి చర్యలు చేపట్టనున్న ప్రభుత్వం; అదే సమయంలో ఆర్థికేతరంగా ప్రభుత్వరంగ సంస్థల సంఘటితానికి చర్యల కొనసాగింపు.

o    ప్రభుత్వరంగ సంస్థలలో తన వాటాను 51 శాతానికన్నా తక్కువస్థాయిలో ఉంచినా వాటిపై ప్రభుత్వ నియంత్రణకు వీలున్న నేపథ్యంలో సంస్థల ప్రాతిపదికగా ఈ అంశంపై పరిశీలన.

o    ప్రభుత్వ వాటా 51 శాతంగా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని సవరించి, దాన్ని ప్రభుత్వ నియంత్రణలోని సంస్థలవాటాలుసహా 51శాతంగా నిర్ణయించే ప్రతిపాదన.

o    కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో చిల్లర భాగస్వామ్యానికి ప్రోత్సాహంపై పరిశీలన.

o    అదనపు పెట్టుబడులకు అవకాశం కల్పన:

  కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా పున:సమలేఖనానికి యోచన.

  బ్యాంకులు తమ విపణిని మరింత లోతుకు తీసుకెళ్లందుకు వీలుగా తమ వాటాలు మరింత అందుబాటులో ఉంచేలా అనుమతి.

o  ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ELSS)లో పెట్టుబడుల తరహాలో ఎక్స్ఛేంజి వాణిజ్య ఫండ్ల (ETF)లో పెట్టుబడులకూ వీలు కల్పించనున్న ప్రభుత్వం.

o   అన్ని లిస్టెడ్ ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా 25 శాతంగా ఉండాలన్న నిబంధన భర్తీకి ప్రభుత్వం సంసిద్ధత. దీంతోపాటు వర్ధమాన మార్కెట్ సూచీలో భాగమైన అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో విదేశీ సంస్థల వాటాపై పరిమితిని పెంచే యోచన.

•    బహిరంగ మార్కెట్లలో విదేశీ ద్రవ్యంద్వారా స్థూల రుణసమీకరణలో కొంతభాగాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలకు గిరాకీపై లబ్ధి చేకూరగల రీతిలో ప్రభావం పడుతుంది.

•    దృష్టి లోపంగలవారు కూడా సులభంగా గుర్తించగలిగేలా రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల కొత్త నాణాలను త్వరలో విడుదల చేయాలని నిర్ణయం.

డిజిటల్ చెల్లింపులు

•   బ్యాంకు ఖాతానుంచి ఏడాది వ్యవధిలో రూ.కోటికి మించి తీసుకుంటే అందులో 2 శాతం మొత్తాన్ని మూలంలో పన్నుకోత ( TDS)కింద తగ్గిస్తారు.

•      వార్షిక వ్యాపార పరిమాణం రూ.50కోట్లదాకా ఉన్న వ్యాపార సంస్థలు తమ ఖాతాదారులకు చౌకైన డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవాలి. సదరు చెల్లింపులపై ఖాతాదారులతోపాటు ఇతర వ్యాపారులపైన కూడా చార్జీలుగానీ, వ్యాపారి తగ్గింపు శాతంగానీ విధించరాదు.

సరికొత్త – ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులు

•   సెమీ కండక్టర్లు, సౌరశక్తి ఉత్పాదక ఘటకాలు, లిథియం స్టోరేజీ బ్యాటరీలు, కంప్యూటర్ సర్వర్లు, ల్యాప్‘టాప్‘లు వంటి వస్తువుల తయారీకి భారీ యంత్రాగారాల ఏర్పాటు కోసం అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించే పథకం.

o   పరోక్ష పన్ను ప్రయోజనాలతోపాటు పెట్టుబడి ఆధారిత ఆదాయపు పన్ను మినహాయింపులు.

2014-19 మధ్య సాధించిన విజయాలు

•    భారత ఆర్థిక వ్యవస్థ తొలి ట్రిలియన్ డాలర్ల విదేశీ మారకం నిల్వల స్థాయిని అందుకునేందుకు 55 ఏళ్లు పట్టగా కేవలం ఐదేళ్లలో మరో ట్రిలియన్ డాలర్లు అదనంగా సమకూడాయి.

•    భారత్ నేడు ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ... ఐదేళ్ల కిందట మనం 11వ స్థానంలో ఉన్నామన్నది ఈ సందర్భంగా గమనార్హం.

•    కొనుగోలు శక్తి సమానత (PPP) పరంగా ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.

•    ద్రవ్య క్రమశిక్షణను కఠినంగా పాటించడంతోపాటు కేంద్ర-రాష్ట్రాల గతిశీలతకు 2014-19 మధ్య పునరుత్తేజం లభించింది.

•    పరోక్ష పన్నుల వ్యవస్థ, దివాలా, స్థిరాస్థి రంగానికి సంబంధించి మూల సంస్కరణలు అమలు చేయబడ్డాయి.

•    దేశంలో ఆహార భద్రతపై 2009-14 మధ్య సగటు వార్షిక వ్యయంతో పోలిస్తే 2014-19 మధ్య ఐదేళ్లలో దాదాపు రెట్టింపుగా నమోదైంది.

•    పేటెంట్ల జారీ 2014నాటి సంఖ్యతో పోలిస్తే ఒక్క 2017-18లోనే మూడురెట్లకుపైగా పెరిగాయి.

•    నవ భారత నిర్మాణం కోసం నీతి ఆయోగ్ ప్రణాళికలు, సహాయంతో కార్యాచరణ ప్రారంభమైంది.

భవిష్యత్ ప్రణాళిక

•       ప్రక్రియల సరళీకరణ.

•       పనితీరుకు ప్రోత్సాహకాలు.

•       కాలయాపన తగ్గింపు.

•       అత్యుత్తమంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం.

•       ఇప్పటిదాకా ప్రారంభించిన, అమలు చేస్తున్న భారీ కార్యక్రమాలు, సేవలను వేగవంతం చేయడం.    



(Release ID: 1577599) Visitor Counter : 621