ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సర్వేక్షణ 2018-19 ముఖ్యాంశాలు

Posted On: 04 JUL 2019 12:37PM by PIB Hyderabad

   ర్థిక సర్వేక్షణ 2018-19 ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారమణ్ నేడు పార్లమెంటు లో ప్రవేశపెట్టారు. ఈ సర్వేక్షణ లో ముఖ్యాంశాలు కింది విధం గా ఉన్నాయి:

పుంజుకుంటున్న వేగం: ప్రైవేటు పెట్టుబడులు కీలక వృద్ధిచోదితం గా ఉద్యోగాలు, ఎగుమతులు-గిరాకీ

·         అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వారికి చేరే మార్గాలు గడచిన ఐదేళ్లుగా తెరుచుకున్నాయని ఆర్థిక సర్వేక్షణ పేర్కొంది; దీంతో వృద్ధి, స్థూల ఆర్థిక సుస్థిరతల ద్వారా ఒనగూడిన లబ్ధి దేశంలో చిట్టచివరి వ్యక్తి కి కూడా చేరినట్లు తెలిపింది.

·         దేశం 2024-25నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సుస్థిర వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 8 శాతం గా ఉండటం అవసరం.

·        సుస్థిర వృద్ధి కి తగిన సానుకూల జనశక్తి దశ తో పొదుపు, పెట్టుబడి-ఎగుమతుల ‘‘అత్యుత్తమ చంక్రమణాని కి’’ మద్దతు, ప్రేరణ లభించాయి.

·         ప్రైవేటు పెట్టుబడి- గిరాకీ, సామర్థ్యం, కార్మిక ఉత్పాదకత, కొత్త సాంకేతికత, సృజనాత్మక విధ్వంసం, ఉద్యోగ సృష్టి కి కీలక చోదకం గా నిలచింది.

·         ఎన్నడూ సమతౌల్యం లేని వాస్తవిక లేదా విషమ ఆర్థిక వ్యవస్థ గా పరిగణించే సంప్రదాయ ఆంగ్లో-శాక్సన్ దృక్పథాని కి వ్యతిరేక విధానం లో ఈ సారి సర్వేక్షణ నిర్వహించబడింది.

·         స్వావలంబనయుత-వాస్తవిక చంక్రమణం లో ప్రధాన అంతర్భాగాలు:

o    ప్రజోపయోగం లక్ష్యం గా గణాంకాల సమర్పణ

o   చట్టబద్ధ సంస్కరణల కు ప్రాధాన్యం

o    నిలకడ కలిగిన విధానాల కు భరోసా

o    ప్రవర్తనాత్మక ఆర్థిక సూత్రాల తో ప్రవర్తన రూపాంతరీకరణ కు ప్రోత్సాహం

o    మరిన్ని ఉద్యోగాల సృష్టి ద్వారా మరింత ఉత్పాదకత సాధించే దిశ గా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని పెంచి పోషించడం.

o    పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం.

o    పెట్టుబడుల కు సంబంధించి ప్రతిఫల ముప్పు రహిత వాణిజ్య లావాదేవీ ల హేతుబద్ధీకరణ

ప్రవర్తనాత్మక ఆర్థిక సూత్రం ‘‘అప్రమత్తత’’ ప్రయోగం ద్వారా రోబోల కోసం కాకుండా వాస్తవంగా ప్రజల కోసం విధానాలు

·         ఆధునిక ఆర్థిక సూత్రాల ఆచరణ సాధ్యం కానటువంటి రోబో ఆధారిత సిద్ధాంతాల ద్వారా నిర్ణయాల నుండి వ్యక్తుల వాస్తవ సమాలోచన ద్వారా నిర్ణయాలు.

·         ప్రజలు ఆశించిన విధం గా వ్యవహరించే విధం గా ప్రవర్తనాత్మక ఆర్థిక సూత్రాలు వారి కి ‘‘అప్రమత్త’’ దృష్టి ని ఇస్తాయి.

·         ప్రధానమైన ప్రవర్తనాత్మక ఆర్థిక సూత్రాలు:

o    ఉపయోగకర సామాజిక ప్రమాణాల కు ప్రాధాన్యం

o    యాంత్రిక ఎంపిక ను మార్చడం.

o    అవసరమైన బలాన్ని పలు మార్లు సమకూర్చడం.

·         సామాజిక మార్పు కోసం ఆకాంక్షభరిత కార్యాచరణ సృష్టి కి ప్రవర్తనాత్మక ఆర్థిక సూత్రాల అంతర్దృష్టి వినియోగం:

o    ‘‘బేటీ బచావో-బేటీ పఢావో’’ నుండి ‘‘కుమార్తె మీ ధనలక్ష్మి, మీ విజయలక్ష్మి’’ (BADLAV-బద్లావ్) వరకూ..

o    ‘‘స్వచ్ఛ భారతం’’ నుండి ‘‘సుందర భారతం’’దాకా..

o    వంటగ్యాస్ ‘‘రాయితీ వదులుకోవడం’’ నుండి రాయితీలపై ఆలోచించే దాకా.’’

o    ‘‘పన్ను ఎగవేత’’ నుండి ‘‘పన్ను చెల్లింపు’’దాకా...

అతి చిన్న సంస్థలు అత్యంత భారీ సంస్థలు గా ఎదిగేలా ప్రోత్సాహం: సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం వృద్ధి కి విధానాల పున:సంస్కరణ

·         సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం మరిన్ని లాభాలు, ఉద్యోగాల సృష్టి, ఉత్పాదకత పెంపును సాధించడం పై సర్వేక్షణ దృష్టి ని సారించింది.

·         అతిచిన్న సంస్థలు (100 మంది కన్నా తక్కువ మంది ఉద్యోగులు గలవి) పది సంవత్సరాల కు పైగా పనిచేస్తున్నప్పటికీ తయారీ రంగం లో సంఘటిత సంస్థల తో పోలిస్తే 50 శాతం కన్నా ఎక్కువ సంఖ్య లో ఉన్నాయి.

·         అతిచిన్న సంస్థల ద్వారా ఉద్యోగాల సృష్టి 14 శాతం కాగా, ఉత్పాదకత 8 శాతమే.

·         దేశం లో భారీ సంస్థలు (100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నవి) 15 శాతమే అయినప్పటికీ, 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ దాదాపు 90 శాతం ఉత్పాదకత ను సాధిస్తున్నాయి.

·         సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంకెళ్లు తొలగించి, అవి ఎదగడానికి కిందివిధంగా చర్యలు తీసుకోవాలి:

o    అన్ని పరిమాణాల్లోని సంస్థల కూ ప్రోత్సాహకాలు వర్తించేలా చట్టం పదేళ్ల అమలు పరిమితి కి భిన్నం గా అవసరమైన కొత్త మార్గదర్శకాల రూపకల్పన.

o    గణనీయ స్థాయి లో మరిన్ని ఉద్యోగాల సృష్టి కి రాజస్థాన్ తరహాలో కార్మిక చట్టాల్లోని ఆంక్షల పై నియంత్రణ తొలగింపు.

o    అత్యధిక ఉపాధి సృష్టి అవకాశాలు ఉన్న తరుణ సంస్థలకు ప్రత్యక్ష రుణ లభ్యత కోసం ప్రాధాన్య రంగాల కు రుణాలు ఇచ్చే మార్గదర్శకాల పున:రూపకల్పన.

·        ఉద్యోగాల సృష్టి దిశ గా- హోటల్-ఆహార సరఫరా (కేటరింగ్), రవాణా, స్థిరాస్తి, వినోదం తదితర రంగాల కు విస్తరించగల పర్యాటకం వంటి రంగం పైనా సర్వేక్షణ దృష్టి సారించింది.

‘‘ప్రజల నుండి,  ప్రజలద్వారా, ప్రజల కోసం’’ సమాచారం

·         సమాచార సేకరణ, నిల్వ లకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కన్నా సామాజికం గా సమాచార గరిష్ఠ వినియోగం అధికం గా ఉంది.

·         సామాజిక ప్రాధాన్యం సమాచారాన్ని ప్రజలు సృష్టిస్తున్న నేపథ్యం లో ప్రజా శ్రేయస్సు కోసం సమాచార గోప్యత చట్రం పరిధి లో సమాచార సృష్టి చేయవచ్చు.

·         ప్రజా శ్రేయస్సు దిశ గా ప్రత్యేకించి... పేదల తో పాటు ఇతర సామాజిక రంగాల లో గణాంక నిధి సృష్టి కి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.

·         ప్రభుత్వ అధీనం గల విభిన్న విశిష్ఠ సమాచార నిధుల ను విలీనం చేస్తే బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

మత్స్య న్యాయాని కి స్వస్తి: కింది స్థాయి న్యాయవ్యవస్థ లో సామర్థం పెంపు ఎలా ?

·         ఒప్పందాల అమలు, వివాద పరిష్కారం లో ఆలస్యమే దేశం లో స్థూల దేశీయోత్పత్తి అధిక వృద్ధి కి, వాణిజ్య సౌలభ్యాని కి ప్రధాన అడ్డంకి అన్నది నిర్వివాదాంశం.

·         దేశంలో కేవలం జిల్లా, దిగువస్థాయి కోర్టుల లో దాదాపు 87.5శాతం కేసులు అపరిష్కృతం గా ఉన్నాయి.

·         ఉన్నత న్యాయస్థానాల లో 93, దిగువ స్థాయి న్యాయస్థానాల లో 2,279 ఖాళీల ను భర్తీ చేస్తే 100 శాతం కేసుల పరిష్కారం సాధించవచ్చు.

·         ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లపై ప్రత్యేకం గా శ్రద్ధ తీసుకోవలసి ఉంది.

·         దిగువ స్థాయి  న్యాయస్థానాల లో 25 శాతం, ఉన్నత న్యాయస్థానాల లలో 4 శాతం, సర్వోన్నత న్యాయస్థానం లో 18 శాతం వంతున ఉత్పాదకత మెరుగుపడిన ఫలితం గా అపరిష్కృత కేసులు త్వరగా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంది.

ఆర్థిక విధాన అనిశ్చితి పెట్టుబడుల పై ఎలాంటి ప్రభావం చూపింది ?

·         గడచిన పదేళ్లు గా భారతదేశం ఆర్థిక విధాన అనిశ్చితి ని గణనీయం గా తగ్గించినప్పటికీ కొన్ని దేశాల లో... ప్రత్యేకించి అమెరికా లో ఆర్థిక విధాన అనిశ్చితి పెరిగింది.

·         భారతదేశం లో పెట్టుబడుల వృద్ధి ని అనిశ్చితి ఐదు త్రైమాసికాల పాటు మందగింపజేసింది.

·         ఆర్థిక విధానాల లో అనిశ్చితి అదుపు ద్వారా ఆరోగ్యకర పెట్టుబడుల వాతావరణాని కి ప్రోత్సాహం.

·         ఆర్థిక అనిశ్చితి తగ్గింపు దిశ గా అధ్యయనం ప్రతిపాదన లు:

o    ముందంజ కు మార్గనిర్దేశం తో వాస్తవ విధానాల లో నిలకడ.

o    ప్రభుత్వ విభాగాల లో ప్రక్రియల కు నాణ్యత హామీ ధ్రువీకరణ.

భారతదేశం లో 2040 నాటి కి జనశక్తి: 21వ శతాబ్దం కోసం ప్రజా శ్రేయో విధానాని కి ప్రణాళిక

·         రాబోయే రెండు దశాబ్దాల లో జనాభా వృద్ధి లో తీవ్ర మందగమనం చోటు చేసుకోవచ్చునని అంచనా. ఆ మేరకు 2030 కల్లా దేశం లో అధిక శాతం జనశక్తి లబ్ధి ని అనుభవించనుండగా కొన్ని రాష్ట్రాలు వృద్ధతరం వైపు మళ్లే అవకాశాలు అధికం.

·         దేశం లో 2021 కల్లా  జాతీయ సంపూర్ణ సంతాన సాఫల్య శాతం జనసంఖ్య పూరక శాతం కన్నా తగ్గే అవకాశాలు.

·         దేశం లో ఉద్యోగ వయోసామర్థ్యం గల జనాభా పెరుగుదల 2021-31 దశాబ్దం లో ఏటా దాదాపు 9.7 మిలియన్లు, 2031-41 దశాబ్దంలో సుమారు 4.2 మిలియన్ల వంతున పెరిగే అవకాశాలు ఉన్నాయి.

·          ప్రాథమిక విద్యను అభ్యసించే (5-14వయో సమూహంలో) పిల్లల సంఖ్య రాబోయే రెండు దశాబ్దాల లో గణనీయం గా తగ్గే ప్రమాదం.

·         కొత్త పాఠశాలల ను నిర్మించడం కన్నా ఉన్న వాటిని సమీకృతం/విలీనం చేయడం ద్వారా సద్వినియోగం చేయడం పై రాష్ట్రాలు దృష్టి సారించాలి.

·        ఉద్యోగ విరమణ వయసు పెంపు తో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో దశల వారీ గా పెట్టుబడుల ద్వారా వృద్ధతరం కోసం విధానకర్తలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

స్వచ్ఛ భారత్ నుండి ఆరోగ్య భారతం మార్గం లో సుందర భారతం వైపు: స్వచ్ఛభారత్ కార్యక్రమం పై విశ్లేషణ.

·         స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా సిద్ధించిన ప్రత్యక్ష ఆరోగ్య ప్రయోజనాలు.

·        దేశం లోని కుటుంబాల్లో 93.1 శాతానికి మరుగుదొడ్డి సదుపాయం అందుబాటు లోకి వచ్చింది.

·         గ్రామీణ భారతం లో మరుగుదొడ్డి అందుబాటులో గల కుటుంబాల్లో 96.5 శాతం వాటిని వినియోగిస్తున్నారు.

·         దేశం లోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లో ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణం 100 శాతం పూర్తి.

·         ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణం లో భాగం గా అత్యంత పేద కుటుంబాలకు నిర్మాణ వ్యయం లో సగటున 1.7 రెట్ల నుండి 2.4 రెట్ల మేర పెరిగిన ఆర్థిక పొదుపు.

·         దీర్ఘ కాలం లో మెరుగుదల దిశ గా పర్యావరణ, నీటి నిర్వహణ అంశాల ను స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో చేర్చాల్సిన అవసరం ఉంది.

 

 

 

 

తక్కువ ఖర్చు తో కూడినవిశ్వసనీయమైనమరియు నిరంతర ప్రాతిపదిక కలిగివుండే శక్తి ద్వారా సమ్మిళిత వృద్ధి కి పూచీ పడటం

 

•             భారతదేశం యొక్క తలసరి జిడిపి ని 2010 సంవత్సరం నాటి ధరల ప్రకారం 5000 డాలర్లకు పెంచడానికి మరియు  ఉన్నత మధ్యాదాయ వర్గం లో ప్రవేశించడానికి తలసరి శక్తి వినియోగం 2.5 రెట్లు

పెరగవలసిన అవసరం ఉంది.

•             మానవ అభివృద్ధి సూచీ లో భారతదేశం 0.8 స్కోరు సాధించడానికి తలసరి శక్తి వినియోగం నాలుగు రెట్లు

పెరగాల్సిన అవసరం ఉంది.

•             భారతదేశం ప్రస్తుతం నవీకరణ యోగ్య శక్తి స్థాపిత సామర్థ్యం లో 5

స్థానం లోపవన విద్యుత్తు లో 4వ స్థానం లోసౌర విద్యుత్తు లో 5వ స్థానం లో నిలచివుంది.

•             భారతదేశం లో చేపట్టిన శక్తి దక్షత కార్యక్రమాల ద్వారా రూ. 50,000 కోట్లు ఆదా అయ్యాయిఅలాగేకార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 108.28 మిలియన్ టన్నుల మేరకు తగ్గాయి.

•             దేశం లో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తు లో 2014-15లో 6 శాతం గా ఉన్న నవీకరణ యోగ్య శక్తి వాటా (25 మెగావాట్లకు

మించిన జలవిద్యుత్తు ను మినహాయిస్తే) 2018-19 లో 10 శాతాని కి పెరిగింది.

•             థర్మల్ విద్యుత్తు 60 శాతం వాటా తో ఇప్పటికీ ఆధిపత్య భూమిక ను పోషిస్తోంది. 

•             భారతదేశం లో ఇలెక్ట్రిక్ కార్ ల విపణి వాటా కేవలం 0.06 శాతం గా ఉంది.  చైనా లో ఇది 2 శాతం గా మరియు నార్వే లో 39 శాతం గా ఉంది.

•             ఇలెక్ట్రిక్  వాహనాల విపణి వాటా ను పెంచడానికి బ్యాటరీలను త్వరగా మార్చే సౌకర్యాలను కల్పించడం అవసరం.

 

సంక్షేమ పథకాల అమలు లో సాంకేతిక విజ్ఞానాన్ని ప్రభావశీలమైన రీతి లో వినియోగించడం -  ఎమ్ జి ఎన్ ఆర్ఇజిఎస్ కేసు

 

•             ఎమ్ జి ఎన్ ఆర్ఇజిఎస్ క్రమబద్దీకరణ కు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఆ పథకం యొక్క సామర్ధ్యం బాగా పెరిగిందని సర్వే తెలిపింది.

•             ఎమ్ జి ఎన్ ఆర్ఇజిఎస్ చెల్లింపుల లో జాతీయ ఇలెక్ట్రానిక్ నిధి నిర్వహణ వ్యవస్థ,  లబ్ధిదారుల కు నేరుగా నగదు బదిలీ పద్దతి ని అమలు చేయడం వల్ల చెల్లింపుల లో జాప్యం బాగా తగ్గింది.

•             ఎమ్ జి ఎన్ ఆర్ఇజిఎస్ పనులు ముఖ్యం గా దు:స్థితి లో ఉన్నక్షామపీడిత జిల్లాల లో డిమాండు కు తగినంతగా పెరిగాయి.

•             ఆర్ధికం గా ఇబ్బంది పడుతున్న వారిని ఎమ్ జి ఎన్ ఆర్ఇజిఎస్ బాగా ఆదుకొంది.  సమాజం లోని దుర్బల వర్గాలైన స్త్రీలుఎస్ సిలు మరియు ఎస్ టిల కు ఎమ్ జి ఎన్ ఆర్ఇజిఎస్ లో పని దొరికింది.

సమీకృత ప్రగతి కోసం భారతదేశం లో కనీస వేతన వ్యవస్థ కు కొత్త రూపు

    •  కార్మికుల భద్రత తో పాటు పేదరిక నిర్మూలన కు సమర్ధవంతమైన సాధనం గా ఉపయోగించేందుకు సునిశిత యోచన తో నవ్యాకృతి లో కనీస వేతన వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని సర్వేక్షణ ప్రతిపాదించింది.

•             భారతదేశం లో ప్రస్తుతం అమలు లో ఉన్న కనీస వేతన వ్యవస్థ ప్రకారం వివిధ రాష్ట్రాల లో పలు కేటగిరీ ల కొలువులకు

1,915 కనీస వేతనాలను చెల్లిస్తున్నారు.

•             భారతదేశం లో వేతనం పై పని చేస్తున్న ప్రతి ముగ్గురు కార్మికుల లో ఒక కార్మికుని కి కనీస వేతన చట్టం ప్రకారం

భద్రత లభించడం లేదు.

•             వేతనాల బిల్లు సంహిత లో పొందుపరచిన విధంగా కనీస వేతనాల ను హేతుబద్ధం చేయడాన్ని సర్వే బలపరుస్తోంది.

•             అన్ని ఉద్యోగాలు / కార్మికుల కు కనీస వేతనాలు ఇవ్వాలని సర్వేక్షణ ప్రతిపాదిస్తోంది.

•             దేశం లో ఐదు భిన్నమైన భౌగోళిక ప్రాంతాల కు పనికి వచ్చే విధం గా కేంద్ర ప్రభుత్వం నేశనల్ ఫ్లోర్ మినిమం వేజ్ను నోటిఫై చేయాలి.

•               రాష్ట్రాలు కనీస వేతనాల ను ఫ్లోర్ వేజ్’ కన్నా తక్కువ గా ఉండనటువంటి స్థాయిల లోఖరారు చేయాలి.

•             కనీస వేతనాల ను నైపుణ్యాల ఆధారం గా గాని లేక భౌగోళిక ప్రాంతం ఆధారం గా గాని లేక  ఈ రెండింటి ఆధారం గా గాని  నోటిఫై చేయవచ్చు. 

•             సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ ఒక సులువైనటువంటి మరియు అమలుచేయగలిగినటువంటి కనీస వేతన వ్యవస్థ ను సర్వేక్షణ ప్రతిపాదించింది

•             కనీస వేతనాల అమలు కు సంబంధించిన ప్రకటన జారీ కి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధి లో

జాతీయ స్థాయి డాష్ బోర్డు’ ను ఏర్పాటు చేయాలని సర్వేక్షణ ప్రతిపాదించింది. 

•             చట్టబద్ధం గా నిర్ణయించిన కనీస వేతనాలు చెల్లించనప్పుడు పిర్యాదుల ను నమోదు చేయడానికి టోల్- ఫ్రీ నంబర్ ఉండాలి.

•             మరింత స్థితిస్థాపకత నిరంతర ప్రాతిపదిక కలిగిన ఆర్ధిక అభివృద్ధి కోసం ఒక సమ్మిళిత యంత్రాంగం వలె సమర్ధమైన కనీస వేతన విధానమంటూ ఉండాలి. 

 

2018-19 లో దేశ ఆర్ధిక వ్యవస్థ స్థితి :  స్థూల వీక్షణ

 

•             2018-19లో భారతదేశం ఇప్పటికీ వేగం గా వృద్ధి చెందుతున్న భారీ ఆర్ధికవ్యవస్థ గా ఉంది.

•             2017-18లో 7.2 శాతం గా ఉన్న స్థూలదేశీయోత్పత్తి (జిడిపి) 2018-19లో 6.8 శాతాని కి తగ్గింది.

•             2018-19లో ద్రవ్యోల్బణాన్ని 3.4 శాతాని కి నియంత్రించ గలిగారు.

•             మొత్తం రుణాల లో 2018 మార్చి నాటికి 11.5 శాతం ఉన్న నిరర్ధక ఆస్తులు (ఎన్ పిఎస్) 2018 డిసెంబర్ నాటికి 10.1 శాతానికి తగ్గిపోయాయి.

•             2017-18 నుంచి స్థిర పెట్టుబడుల లో వృద్ధి క్రమం గా పెరుగుతూ వచ్చింది.

2016-17లో 8.3 శాతం ఉన్న స్థిర పెట్టుబడులు జోరందుకొని తరువాత సంవత్సరం లో 9.3 శాతానికి,

2018-19 సంవత్సరం లో మరింతగా 10.0 శాతాని కి పెరిగాయి. 

•             కరెంట్ ఖాతా లోటు జిడిపి లో 2.1 శాతం స్థాయి లో అదుపు చేయగలిగిన విధం గా ఉంది.

•             కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక లోటు 2017-18లో జిడిపి లో 3.5 శాతం స్థాయి లో ఉండగా 2018-19 సంవత్సరం లో 3.4 శాతానికి తగ్గింది.

•             ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగడం తో పాటు వినియోగం పెరుగుతుండటం తో 2019-20 లో వృద్ధి

వేగాన్ని అందుకోగలిగే  అవకాశాలు మెండు.

 

ఆర్ధిక పరిణామాలు

 

•             జిడిపి లో 3.4 శాతం ఆర్ధిక లోటు తో 2018-19 ఆర్ధిక సంవత్సరం ముగిసింది.  డెట్ టు జిడిపి రేశియో 44.5 శాతం ఉంది. (తాత్కాలికం).

•             జిడిపి లో శాతం గా చూస్తేకేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం 2017-18 తో పోల్చినప్పుడు 2018-19 లో  0.3 పర్సంటేజీ పాయింట్లు తగ్గింది.

•             రెవిన్యూ సంబంధ వ్యయం 0.4 పర్సంటేజీ పాయింట్ మేర తగ్గగా మూలధన సంబంధ వ్యయం 0.1 పర్సంటేజీ పాయింట్ మేర పెరిగింది.

•             రాష్ట్రాల సొంత పన్నులు పన్నేతర రెవిన్యూ వసూళ్లు  2017-18 ఆర్ ఇ (సవరించిన అంచనాలు) లో బాగా

 పెరిగాయి.  2018-19 బిఇ (బడ్జెటు అంచనాలు)లో అదే తీరు కొనసాగగలదని భావిస్తున్నారు.

•             మొత్తం మీద చూసినట్లయితే (కేంద్రంరాష్ట్రాలతో కలుపుకొని) ప్రభుత్వం ఆర్ధిక స్థిరీకరణ మరియు ఆర్ధిక క్రమశిక్షణ

దిశ గా సాగుతోంది.

•             సవరించిన ఆర్ధిక గణాంకాలు లోటు తగ్గుదల ను సూచిస్తూ 2020-21 ఆర్ధిక సంవత్సరం కల్లా ఆర్ధిక లోటు

 జిడిపి లో 3 శాతం లక్షాన్ని, 2024-25 కల్లా కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపి లో 40 శాతం లక్షాన్ని చేరాలని అంచనాలు ఉన్నాయి.  

 

ద్రవ్య నిర్వహణ మరియు ఆర్ధిక మధ్యవర్తిత్వం

 

•             బ్యాంకింగ్ వ్యవస్థ బాగా మెరుగుపడింది.  నిరర్ధక ఆస్తుల (ఎన్ పిఎ) నిష్పత్తులు తగ్గాయి.  రుణాలు త్వరిత గతి న వృద్ది చెందాయి.

•             ఇన్ సాల్వన్సి ఎండ్ బ్యాంక్ రప్టసి కోడ్ వల్ల రుణాలు రాబట్టడంసంక్షోభ ఆస్తుల నుండిభారీ గా సొమ్ము ను రాబట్టడం జరిగాయి. వ్యాపార సంస్కృతి మెరుగుపడింది.

•             సిఐఆర్ పి మార్చి నెల 31, 2019 నాటికి 1, 73,359 కోట్ల విలువైన క్లెయిముల తాలూకు 94 కేసు ల పరిష్కారానికి తోడ్పడింది.

•             ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి రూ. 2.84లక్షల కోట్ల విలువైన 6079 కేసుల ను ఉపసంహరించుకోవడం జరిగింది.

•             గతం లో నిరర్ధకం గా ఉన్న ఖాతాల నుండి బ్యాంకులు  రూ. 50,000 కోట్ల మేర రాబట్టుకున్నట్టు రిజర్వు బ్యాంకు నివేదికల లో తెలిపారు.

•             అదనంగా రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తుల స్థాయి ని పెంచి ప్రామాణికం కాని వాటిని ప్రామాణికం గా మార్చారు.

•             బెంచ్ మార్క్ పోలిసి రేటు ను మొదట 50 పాయింట్లు పెంచి ఆ తరువాత గత సంవత్సరం లో 75 పాయింట్ల మేర తగ్గించారు

•             2018 సెప్టెంబర్ నుండి ద్రవ్య చలామణి బాగా తగ్గింది.  దీని తో ప్రభుత్వ పత్రాల ప్రతిఫలాలపై ప్రభావం పడింది.

•             కేపిటల్ మార్కెట్ ల నుండి ఎక్విటీ ఫైనాన్స్ సేకరణ క్షీణించడం తో నిధుల ప్రవాహం మందగించింది.  ముఖ్యం గా బ్యాంకింగేతర

ఫినాన్షియల్ కంపెనీల (ఎన్ బిఎఫ్ సి) రంగం పై ఒత్తిడి బాగా పెరిగింది.

•             ప్రజల కు ఎక్విటీ జారీ ద్వారా సేకరించిన మూలధనం 2018-19లో 81 శాతం మేరకు తగ్గింది.

•             ఎన్ బిఎఫ్ సి రంగం లో రుణాల వృద్ధి రేటు సంవత్సరం వారీ గా చూసినప్పుడు 2018 మార్చి నెల లో 30 శాతం ఉండగా 2019 మార్చి లో 9 శాతాని కి తగ్గిపోయింది.

 

ధరలు మరియు ద్రవ్యోల్బణం

 

•             ఐదు వరుస ఆర్థిక సంవత్సరం కూడాను వరుసగా తగ్గుతూ వస్తున్న వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం- ఉమ్మడి  (సిపిఐ-సి) గత రెండు సంవత్సరాల లో 4.0 శాతం కన్నా తక్కువ స్థాయి లో ఉండిపోయింది.

•             ఆహార ద్రవ్యోల్బణం ఆధారిత వినియోగదారుల ఆహార ధర సూచీ (సిఇపిఐ) కూడా గత అయిదు ఆర్ధిక సంవత్సరాలుగా

తగ్గుముఖంగా పయనిస్తోంది.  వరుసగా రెండో సంవత్సరం లో కూడా ఇది 2.0 శాతం కన్నా తక్కువ గా ఉంది.

•             సిపిఐ-సి ఆధారితమైనటువంటి కోర్ ఇన్ ఫ్లేశన్ (ఆహారం మరియు ఇంధన వర్గాన్ని మినహాయించినటువంటి సిపిఐ) 2017-18 ఆర్థిక సంవత్సరం తో పోల్చినప్పుడు 2018-19 ఆర్థిక సంవత్సరం లో ఎగసిన అనంతరం ప్రస్తుతం 2019 మార్చి నెల మొదలుకొని

తగ్గుముఖం పట్టనారంభించింది.

•             2018-19 ఆర్థిక సంవత్సరం లో ద్రవ్యోల్బణం- ఉమ్మడి  పెరుగుదల కు నానా విధ వస్తువులుగృహనిర్మాణం,

 ఇంధనం తదితర వస్తువుల ధరలలో వృద్ధి ప్రధాన కారణం గా ఉంది.  కాగా హెడ్ లైన్ ఇన్ ఫ్లేశన్ కు ఆకృతి ని ఇవ్వడం లో సేవల ప్రాముఖ్యం  పెరిగింది.

•             సిపిఐ గ్రామీణ ద్రవ్యోల్బణం 2017-18 ఆర్ధిక సంవత్సరం తో పోల్చినప్పుడు  2018-19 లో తగ్గింది.  అయితే సిపిఐ పట్టణ ద్రవ్యోల్బణం

2018-19 ఆర్థిక సంవత్సరం లో కొద్ది గా పెరిగింది.  2018-19 ఆర్ధిక సంవత్సరం లో అనేక రాష్ట్రాల లో సిపిఐ ద్రవ్యోల్బణం లో

తగ్గుదల కనిపించింది.

 

నిలకడైన అభివృద్ధి మరియు జల వాయు పరివర్తన

 

•             నిలకడైన అభివృద్ధి సూచీ (ఎస్ డిజి) లక్ష్యాల సాధన లో భారతదేశం ముందంజ వేసింది.  రాష్ట్రాల లో కేరళహిమాచల్ ప్రదేశ్

అగ్రభాగాన నిలువగాకేంద్రపాలిత ప్రాంతాలలో చండీగఢ్పుదుచ్చేరి లు ముందున్నాయి.

•             ఎస్ డిజి 6 సాధించే దిశ గా 2015-2020 మధ్య కాలం లో రూ. 20వేల కోట్ల బడ్జెట్ వ్యయం తో  నమామి గంగే మిశన్’ ను  ఒక కీలకమైన విధాన ప్రాథమ్యం గా ప్రారంభించడం జరిగింది.  

•             నిలకడైన అభివృద్ధి సూచీ లక్ష్యాల సాధన కోసం వనరుల సామర్ధ్యాన్ని పెంచడానికి జాతీయ విధానాన్ని రూపొందించాలి.

•             వాయు కాలుష్య నివారణ కు దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు  కార్ల పనితీరుఉద్గారాలను అంచనా వేసేందుకు జాతీయ విధానాన్ని 2019 లో ప్రారంభించడం జరిగింది.  వాయు కాలుష్య నియంత్రణ తో పాటు దేశవ్యాప్తం గా గాలి నాణ్యత ను పెంపొందించడం ఈ విధానం లక్ష్యం.  ప్యారిస్ ఒప్పందం ప్రకారం దేశం లో ఉద్గారాల ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వార్షిక బడ్జెటుల తో పాటు అంతర్జాతీయ ఆర్ధిక సహకారంప్రైవేటు రంగం వనరుల ను పొందవలసివుంటుంది.

విదేశీ రంగం

 

 

•      ప్ర‌పంచ వాణ‌ిజ్య‌ సంస్థ (డ‌బ్ల్యుటిఒ) ప్ర‌కారంప్ర‌పంచ వాణిజ్యం 2017లో 4.6 శాతం గా ఉండ‌గా అది 2018లో 3 శాతాని కి మంద‌గించింది. ఇందుకు కార‌ణాలు......

-- కొత్త‌ప్ర‌తీకారపూర్వక సుంకాల విధింపు

-- అమెరికాచైనా ల మ‌ధ్య తీవ్ర‌స్థాయి కి చేరిన వాణిజ్య ఉద్రిక్త‌త‌ లు

-- బ‌ల‌హీన‌మైన ప్ర‌పంచ ఆర్థిక వృద్ధి

-- ఫైనాన్షియ‌ల్ మార్కెట్ల‌ లో ఒడుదొడుకులు (డ‌బ్ల్యు.టి.ఒ)

 ...  రూపాయి విలువ‌ లో చూసిన‌పుడు ఎగుమ‌తుల వృద్ధి రేటు పెరిగింది. దీనికి కార‌ణం రూపాయి విలువ త‌గ్గ‌డం. అలాగే 2018-2019 లో దిగుమ‌తులు త‌గ్గాయి.

... దేశం లోకి పెద్ద ఎత్తున విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు (ఎఫ్‌ డిఐ) వ‌చ్చిన‌ప్ప‌టికీ,  పోర్టుఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌భావం తో 2019  ఏప్రిల్ -డిసెంబ‌ర్‌ ల మ‌ధ్య‌ నిక‌ర పెట్టుబడుల రాక  ఒక మోస్త‌రు గా ఉంది.

....ఇండియా విదేశీ రుణం 2018 డిసెంబ‌ర్ చివ‌రి నాటికి 521.1 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు గా ఉంది. ఇది 2018 మార్చి చివ‌రి నాటి స్థాయి కంటే 1.6 శాతం త‌క్కువ‌.

.... విదేశీ అప్పున‌కు సంబంధించిన కీల‌క సూచిక‌లు భారతదేశం విదేశీ అప్పు భ‌రించ‌లేని స్థితి లో ఏమీ లేద‌ని సూచిస్తున్న‌ాయి.

.....జిడిపి నిష్ప‌త్తి తో పోల్చిన‌పుడు మొత్తం  బాధ్య‌త‌లురుణంరుణేత‌ర లయబిలిటీలు 2015లో 43 శాతం ఉండ‌గా 2018 చివ‌రి నాటికి 38శాతానికి త‌గ్గాయి.

....విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి వాటా పెరిగింది. అలాగే మొత్తం బాధ్య‌త‌ల‌ లో నిక‌ర పోర్టుఫోలియో పెట్టుబ‌డి త‌గ్గింది. దీనితో క‌రెంటు ఖాతా లోటు భ‌ర్తీ కి మ‌రింత సుస్థిర నిధుల లభ్యత కు  వీలు క‌లిగింది.

.....2017-2018 లో భార‌తీయ రూపాయి ఒక అమెరికా డాల‌రు కు 65-68 వ‌ద్ద ట్రేడ్ అయి 2018-2019లో 70-74 రూపాయ‌ల‌ కు ప‌త‌న‌మైంది.

......వాణిజ్య‌ రాబ‌డిఇది దిగుమ‌తుల‌ కు సంబంధించి కొనుగోలు శ‌క్తి ని కొలిచే కొల‌మానం.  ఇది పురోగ‌తి దిశ‌ లో ఉంది. బ‌హుశా భార‌త ఎగుమ‌తుల ధ‌ర‌లలో వృద్ధి కంటే ముడి చ‌మురు ధ‌ర‌ల‌లో వృద్ధి ఎక్కువ‌గా లేకుండా ఉండ‌డ‌మే కార‌ణం కావ‌చ్చు.

..... 2018-19లో మార‌క‌పు రేటు అంత‌కు ముందు సంవ‌త్స‌రం కంటే ఎక్కువ ఒడుదొడుకుల‌ ను చ‌వి చూసింది.  ప్ర‌ధానం గా ఇది ముడి చ‌మురు ధ‌ర‌ల‌ లో ఏర్ప‌డిన హెచ్చుత‌గ్గుల‌ వ‌ల్లే కానినిక‌ర పోర్టుఫోలియో పెట్టుబ‌డుల వ‌ల్ల పెద్ద‌ గా కాదు.

భారతదేశ ఎగుమ‌తులుదిగుమ‌తుల ఖాతా 2018-19 (పి)

--ఎగుమ‌తులు ( తిరిగి ఎగుమ‌తుల‌తో స‌హా) రూ.23, 07,663 కోట్లు

--దిగుమ‌తులు. రూ.35,94,373 కోట్లు

.....ఎగుమ‌తులు ఎక్కువ‌ గా జ‌రిగిన వాటి లో పెట్రోలియం ఉత్ప‌త్తులువిలువైన రాళ్లు,ఔష‌ధ ఫార్ములేష‌న్లుబంగారంఇత‌ర విలువైన లోహాలు ఉన్నాయి.

.....దిగుమ‌తులు ఎక్కువ‌గా జ‌రిగిన వాటి లో ముడి పెట్రోలియమ్ముత్యాలువిలువైన ర‌త్నాలు,బంగారం వంటివి ఉన్నాయి.

....భారతదేశ ప్ర‌ధాన వాణిజ్య భాగ‌స్వామి గా అమెరికాచైనాహాంకాంగ్‌యుఎఇసౌదీ అరేబియా లు ఉన్నాయి.

--- వివిధ దేశాలువివిధ దేశాల కూట‌ముల‌ తో 28 ద్వైపాక్షిక‌బ‌హ‌ళ ప‌క్ష వాణిజ్య ఒప్పందాలపై భారతదేశం సంత‌కాలు చేసింది. 2018-2019లో  ...ఈ దేశాల‌ కు ఎగుమ‌తులు  121.7 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లుగా ఉంది. ఇది భారతదేశం మొత్తం ఎగుమ‌తుల‌ లో 36.9 శాతం.

...ఈ దేశాల నుండి దిగుమ‌తులు 266.9 బిలియ‌న్ డాల‌ర్లు. ఇది దేశ మొత్తం దిగుమ‌తుల‌లో 52.0 శాతం గా ఉన్నాయి.

 

వ్య‌వ‌సాయంఫూడ్ మేనేజ్‌మెంట్  :

 

--భార‌త‌దేశం లో వ్య‌వ‌సాయ రంగం దాని వృద్ధి కి సంబంధించి చ‌క్రీయ క‌ద‌లిక‌కు అనుగుణంగా వెళుతుంది.

...వ్య‌వ‌సాయ‌రంగంలో స్థూల విలువ జోడింపు (జివిఎ) 2014-15లో నెగ‌టివ్ 0.2 శాతం నుండి 2016-17 నాటికి 6.3 శాతానికి మెరుగుప‌డింది. అయితే 2018-19లో 2.9 శాతాని కి క్షీణించింది.

.... వ్య‌వ‌సాయ రంగం లో గ్రాస్ కేపిట‌ల్ ఫార్మేష‌న్ (జిసిఎఫ్‌)జివిఎ లో శాతం గా చూసిన‌పుడు ఒక మాదిరి స్థాయి లో త‌గ్గి 2017-18 నాటికి 15.2 శాతానికి చేరింది. 2016-17లో ఇది 15.6 శాతం.

..... వ్య‌వ‌సాయరంగంలో ప్ర‌భుత్వ రంగ జిసిఎఫ్‌జివిఎ శాతం నుంచి చూసిన‌పుఉ 2013-14లో 2.1 శాతం ఉండ‌గా అది 2016-17లో 2.7 శాతానికి పెరిగింది.

....వ్య‌వ‌సాయ‌రంగంలో మ‌హిళ‌లు పాలుపంచుకోవ‌డం 20015-06లో 11.7 శాతం ఉండ‌గా 2015-16 నాటికి అది 13.9 శాతానికి చేరింది. అందులోనూ చిన్న‌స‌న్న‌కారు రైతుల‌లో వీరి సంఖ్య గ‌రిష్ఠంగా(28 శాతం) ఉంది.

...సాగులోని భూక‌మ‌తాల సంఖ్య‌సాగు అవుతున్న భూ క‌మ‌తాల విస్తీర్ణాన్ని గ‌మ‌నించిన‌పుడు ఇవి ఎక్కువ‌గా చిన్న స‌న్న‌కారు రైతుల వైపు మారుతున్న‌ట్టు గ‌మ‌నించ‌డం జ‌రిగింది.

....తోడుతున్న భూగ‌ర్భ జ‌లాల‌లో 89 శాతం సాగుకు వినియోగిస్తున్నారు. అందువ‌ల్ల ప్ర‌ధాన దృష్టిని భూ క‌మ‌తాల ఉత్పాద‌క‌త నుంచి సాగునీటి ఉత్పాద‌క‌త‌వైపు మ‌ళ్లించాల్సి ఉంది. నీటిని స‌మ‌ర్ధంగా వినియోగించుకునేందుకు సూక్ష్మ నీటిపారుద‌ల రంగంపై దృష్టి కేంద్రీక‌రించాలి.

....కొంత‌కాలంగా ఫ‌ర్టిలైజ‌ర్ రెస్పాన్స్ రేశియో త‌గ్గుతూ వస్తోంది. సేంద్రియస‌హజ వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తులుజీరో బ‌డ్జెట్ నాచురల్ ఫార్మింగ్ వంటివి నీటి ని స‌మ‌ర్ధంగా వినియోగించుకోవ‌డ‌మే కాకుండా భూ సారాన్ని కాపాడుతాయి.

....చిన్న స‌న్న‌కారు రైతులు వ‌న‌రుల‌ను మ‌రింత మెరుగుగా వినియోగించేలా  చూసేందుకు ఇన్ఫ‌ర్మేష‌న్‌,క‌మ్యూనికేష‌న్ టెక్నాలజీ (ఐసిటి) అమ‌లు కీల‌క‌మైంది. అలాగే క‌స్ట‌మ్ హైరింగ్ సెంట‌ర్ల ద్వారా వారికి అనువైన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకోవ‌ల‌సి ఉంది.

...వ్య‌వ‌సాయంఅనుంబంధ రంగాల‌ లో నిరంత‌ర అభివృద్దిఅన్ని వ‌ర్గాల‌కు అభివృద్ధి ఫ‌లాలు అందాలంటే జీవ‌నోపాధుల‌లో వైవిధ్యం కీల‌క‌మైంది. ఇందుకు సంబంధించిన విధానాలు కింది వాటి పై దృష్టి పెట్టాలి.

....భార‌త‌దేశం అతిపెద్ద పాల ఉత్ప‌త్తిదారు క‌నుక పాడి రంగం పై దృష్టి పెట్టాలి.

...ప‌శువుల పెంప‌కంప్ర‌త్యేకించి చిన్న జీవాల‌పెంప‌కం పై దృష్టి పెట్టాలి      

....అలాగే మ‌త్స్య‌ రంగం పై దృష్టి సారించాలి.  భార‌త‌దేశం మ‌త్స్య‌రంగం లో రెండో పెద్ద‌దేశంగా ఉంది.

 

పారిశ్రామిక‌మౌలిక‌ స‌దుపాయాలు:

 

....2018-19 సంవ‌త్స‌రం లో ఎనిమిది కీల‌క పారిశ్రామిక‌ రంగాల  సూచీ మొత్తంగా 4.3 శాతం వృద్ధి రేటును సూచించింది.

.....ప్ర‌పంచ‌బ్యాంకు రూపొందించిన డూయింగ్ బిజినెస్ రిపోర్టు 2019 (డిబి) అంచ‌నా వేసిన  190 దేశాల‌ లో ఇండియా ర్యాంకింగ్ 2018 లో  23 స్థానాలు పెరిగి 77 వ స్థానాని కి చేరింది.

.....2014-2015లో రోడ్ల నిర్మాణం రోజు కు 12 కిలోమీట‌ర్ల వంతున ఉండ‌గా 2018-2019లో ఇది రోజుకు 30 కిలోమీట‌ర్లు స్థాయి కి పుంజుకుంది.

....2018-2019 లో రైలు ర‌వాణాప్ర‌యాణికుల చేర‌వేత 2017-2018 కంటే  5.33 శాతం, 0.64 శాతం  వృద్ధి ని సాధించాయి.

....దేశంలో మొత్తం టెలిఫోన్ క‌నెక్ష‌న్‌ల సంఖ్య 2018-2019 నాటికి 118.34 కోట్ల‌కు చేరింది.

......విద్యుత్ స్థాపిత సామ‌ర్ధ్యం 2018లో 3,44,002 ఎం.డ‌బ్ల్యులు ఉండ‌గా అది 2019 నాటికి 3,56,100 ఎం.డ‌బ్ల్యుల‌కు పెరిగింది.

.....మౌలిక‌ సదుపాయాల రంగం లోని అంత‌రాన్ని పూడ్చేందుకు ప‌బ్లిక్‌ప్రైవేట్ భాగ‌స్వామ్యం ఎంతో కీల‌కం.

....సౌభాగ్య ప‌థ‌కంపిఎంఎవై వంటి ఆయా రంగాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టే ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మాల‌ కు త‌గిన ప్రాధాన్య‌మివ్వ‌డం ద్వారా సుస్థిర‌ప‌టిష్ఠ‌మైన మౌలిక‌ స‌దుపాయాల నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రిగింది.

....మౌలిక స‌దుపాయాల రంగం లో వివాదాలను నిర్ణీత కాల‌ప‌రిమితి లోగా ప‌రిష్క‌రించేందుకు వ్య‌వ‌స్థాగ‌త యంత్రాంగం అవ‌స‌రం.

 

సేవ‌ల రంగం:

 

....భారతదేశ జివిఎ లో సేవ‌ల రంగం వాటా ( నిర్మాణ‌రంగం మిన‌హా) 54 .3 శాతం గా ఉంది. ఇది 2018-19లో   స‌గానికి పైగా జివిఏ వృద్ధి కి దోహ‌ద‌ప‌డింది.

.......2017-18లో ఐటి- బిపిఎం ప‌రిశ్ర‌మ 8.4 శాతం వృద్ధి సాధించి 167 బిలియ‌న్ అమెరికన్ డాల‌ర్ల‌కు చేరింది. ఇది 2018-19లో 181 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంది.

....సేవ‌ల రంగం వృద్ది 2018-19 సంవ‌త్స‌రంలో మార్జిన‌ల్‌గా 7.5 శాతం త‌గ్గింది. 2017-18లో ఇది 8.1 శాతంగా ఉంది.

వేగ‌వంత‌మైన వృద్ధికార‌క ఉప‌ రంగాలు:  ఫైనాన్షియల్ స‌ర్వీసులురియ‌ల్ ఎస్టేట్‌ప్రొఫెష‌న‌ల్ స‌ర్వీసులు.

మంద‌గ‌మ‌న ఉప‌రంగాలు:  హోట‌ళ్లుట్రాన్స్‌పోర్ట్‌క‌మ్యూనికేష‌న్‌,బ్రాడ్‌కాస్టింగ్ సేవ‌లు

....ఉపాధిక‌ల్ప‌న‌ లో సేవ‌ల రంగం వాటా 2017లో 34 శాతం

ప‌ర్యాట‌క‌ రంగం:

...2018-2019 సంవ‌త్స‌రంలో 10.6 మిలియ‌న్ల మంది విదేశీప‌ర్యాట‌కులు విచ్చేశారు. 2017-18లో వీరి సంఖ్య 10.4 మిలియ‌న్లు.

.....ప‌ర్యాట‌క‌రంగం నుండి ఆర్జించిన విదేశీ మార‌క‌ద్ర‌వ్యం 2018-19లో 27.7 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు కాగా 2017-18లో ఇది 28.7 బిలియ‌న్ డాల‌ర్లు.

 

సామాజిక మౌలిక స‌దుపాయాలుఉపాధిమాన‌వ అభివృద్ధి:

 

...విద్య‌ఆరోగ్యంగృహ‌నిర్మాణంఅనుసంధాన‌ం వంటి రంగాల‌ లో ప్ర‌భుత్వ పెట్టుబ‌డి స‌మ్మిళ‌త అభివృద్ధి కి ఎంతో కీల‌క‌మైంది.

....ప్ర‌భుత్వ వ్య‌యం ( కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిపి) జిడిపి లో శాతం గా చూసిన‌పుడు

....ఆరోగ్యం: 2014-15లో 1.2 శాతం ఉండ‌గా 2018-19లో ఇది 1.5 శాతానికి పెరిగింది.

...విద్య‌: ఇదే కాలంలో 2.8 నుండి 3 శాతాని కి పెరిగింది.

        విద్యారంగాని కి సంబంధించిన‌ ప‌రిమాణాత్మ‌క‌గుణాత్మ‌క సూచిక‌లు చెప్పుకోద‌గిన వృద్ధి ని క‌న‌బ‌రుస్తున్నాయి.  ఇవి పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల చేరిక‌కు సంబంధించిన నిష్ప‌త్తిబాల‌బాలిక‌ల‌కు సంబంధించిన స‌మాన‌త్వ‌ సూచిక‌లుప్రాథ‌మిక‌పాఠ‌శాల స్థాయిలో అభ్య‌స‌న సామ‌ర్ధ్యాల‌కు సంబంధించిన సూచిక‌ల పెరుగుద‌ల లో క‌నిపిస్తున్నాయి.

నైపుణ్యాల అభివృద్ధికి ప్రోత్సాహం:

.....యువ‌త ఏదైనా గుర్తింపు పొందిన శిక్ష‌ణ సంస్థ‌ నుండి శిక్ష‌ణ పొందేందుకు వీలు గా వారికి ఆర్థిక సహాయం గా స్కిల్ వౌచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.

.....పిపిపి ప‌ద్ధ‌తి లో శిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేయ‌డంలో పాఠ్య‌ప్ర‌ణాళిక అభివృద్ధిపరిక‌రాలు స‌మ‌కూర్చ‌డంశిక్ష‌ణ ఇచ్చే వారికి శిక్ష‌ణను ఇవ్వ‌డం వంటి వాటి విష‌యంలో పరిశ్ర‌మ వ‌ర్గాల ను క‌లుపుకు పోవ‌డం ..

....రైల్వే సిబ్బందిపారామిలిట‌రీ సిబ్బంది ని సంక్లిష్ట ప్రాంతాల‌ లో శిక్ష‌ణ ఇచ్చేందుకు వినియోగించుకోవ‌చ్చు..

....శిక్ష‌ణ ఇచ్చే వారి వివ‌రాల‌తో డాటాబేస్ ను రూపొందించ‌డంస్థానిక సంస్థ‌ల స‌హాయం తో గ్రామీణ‌ యువ‌త నైపుణ్యాల‌ను గుర్తించి న‌మోదు చేయ‌డందీని ఆధారం గా డిమాండ్‌స‌ర‌ఫ‌రాల మ‌ధ్య అంత‌రాన్ని గుర్తించ‌డంమ‌రికొన్ని ఇత‌ర చ‌ర్య‌ల‌ ను ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది..

....ఇ.పి.ఎఫ్‌.ఒ గ‌ణాంకాల ప్ర‌కారం 2019 మార్చి నాటికి వ్య‌వ‌స్థీకృత‌ రంగం లో నిక‌ర ఉపాధి క‌ల్ప‌న 8.15 ల‌క్ష‌లు , 2018 ఫిబ్ర‌వ‌రి లో ఇది 4.87 ల‌క్ష‌లు.

.....2014 నుంచి ప్ర‌ధాన‌ మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌ లో భాగం గా (పిఎం జిఎస్‌ వై) సుమారు 1,90,000 కిలోమీట‌ర్ల గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణాన్ని చేప‌ట్ట‌డం జ‌రిగింది.

.....ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న‌ (పిఎమ్ఎ వై) లో భాగం గా 2019 మార్చి 31 నాటికి 1 కోటి ప‌క్కా గృహాల‌ను త‌గిన మౌలిక స‌దుపాయాల‌తో నిర్మించాల‌ని ల‌క్ష్యం గా పెట్టుకోగా సుమారు 1.54 కోట్ల నిర్మాణం పూర్తి అయింది.

.....ఆరోగ్య‌వంత‌మైన భార‌త‌దేశం కోసం  అందుబాటులోనాణ్య‌మైన ఆరోగ్య సేవ‌లను జాతీయ ఆరోగ్య‌ మిష‌న్‌ మరియు ఆయుష్మాన్ భార‌త్ ల ద్వారా అందించ‌డం జ‌రుగుతోంది.

.....ప్ర‌త్యామ్నాయ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌జాతీయ ఆయుష్‌ మిశన్‌ ను ప్రారంభించి త‌క్కువ ఖ‌ర్చు తో ఆయుష్ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ ను దేశ‌వ్యాప్తం గా అందించ‌డం జ‌రుగుతోంది. ఈ సేవ‌ల అందుబాటు ను మెరుగుప‌ర‌చ‌డం ద్వారా వైద్య‌సేవ‌ల లభ్యత లో స‌మ‌స్య లేకుండా చూడ‌డం జ‌రిగింది.

.....ఉపాధిక‌ల్ప‌న ప‌థ‌కంఎం జిఎన్‌ ఆర్‌ఇజిఎ కు ప్రాధాన్య‌మిచ్చిబ‌డ్జెట్ కేటాయింపు  కంటే వాస్త‌వం గా ఖ‌ర్చు చేసే మొత్తాన్ని పెంచ‌డం తో పాటు గ‌త నాలుగు సంవ‌త్స‌రాలు గా బ‌డ్జెట్‌ కేటాయింపుల‌ ను కూడా పెంచుతూ రావ‌డం జ‌రిగింది.

 

 

**

 


(Release ID: 1577290) Visitor Counter : 679