మంత్రిమండలి

భార‌త‌దేశాని కి, ఆస్ట్రియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 07 MAR 2019 2:20PM by PIB Hyderabad

ర‌హ‌దారి సంబంధిత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగం లో సాంకేతిక విజ్ఞాన స‌హ‌కారం అంశం పై భార‌త ప్ర‌భుత్వ రోడ్ ట్రాన్స్ పోర్ట్ &  హైవేస్ మంత్రిత్వ శాఖ కు, ఆస్ట్రియా ప్ర‌భుత్వ ర‌వాణా, నూత‌న ఆవిష్క‌ర‌ణ మ‌రియు సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) పై సంత‌కాల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌భావం:

ఈ ఎంఒయు రెండు దేశాల మ‌ధ్య ర‌హ‌దారి ర‌వాణా, ర‌హ‌దారులు/ హైవేస్ సంబంధిత మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, నిర్వ‌హ‌ణ మ‌రియు ప‌రిపాల‌న, ర‌హ‌దారి భ‌ద్ర‌త‌, ఇంకా ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్స్ రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారం కోసం ద‌క్ష‌త క‌లిగిన నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించింది.
 
ఈ ఎంఒయు రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా కు, రిప‌బ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా కు మ‌ధ్య సంబంధాల ను మ‌రింత ప‌టిష్టం చేయ‌డ‌మే కాకుండా, ఉభ‌య దేశాల మ‌ధ్య దీర్ఘ‌కాలం గా కొన‌సాగుతున్న ద్వైపాక్షిక సంబంధాల తో పాటు వ్యాపార ప‌ర‌మైన‌టువంటి మ‌రియు ప్రాంతీయ ప‌ర‌మైన‌టువంటి స‌మన్వయాన్ని కూడా పెంపొందించ‌నుంది.
 
ప్ర‌యోజ‌నాలు:

ర‌హ‌దారి ర‌వాణా రంగం లో భార‌త‌-ఆస్ట్రియా ద్వైపాక్షిక స‌హ‌కారం ఇరు ప‌క్షాల కు ప్ర‌యోజ‌నక‌రం గా ఉంటుంది.  రెండు దేశాల మ‌ధ్య ఇప్ప‌టి కే నెల‌కొన్న స‌త్సంబంధాలు  మ‌రింతగా వ‌ర్ధిల్ల‌డానికి ప్ర‌తిపాదిత ఎంఒయుస‌హ‌క‌రిస్తుంది.  
 
పూర్వ‌రంగం:

1949వ సంవ‌త్స‌రం లో రెండు దేశాల కు మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాటైన నాటి నుండి ఆస్ట్రియా తో భార‌త‌దేశాని కి చ‌క్క‌ని దౌత్య సంబంధాలు ఏర్ప‌డ్డాయి.  రెండు దేశాలు కూడాను పరస్పరం స్నేహ పూర్వ‌క‌మైన‌టువంటి ఆర్థిక మ‌రియు దౌత్య సంబంధాల చ‌రిత్ర ను  పంచుకొంటున్నాయి.  ర‌హ‌దారులు మ‌రియు హైవేస్ రంగం లో ఆస్ట్రియా అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాల ను క‌లిగి ఉంది.  వీటిలో ఇలెక్ట్రానిక్ టోల్ సిస్ట‌మ్స్‌, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేశ‌న్ సిస్ట‌మ్స్‌, వాహ‌నాల రాక‌పోక‌ల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ లు, సొరంగ మార్గాల ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ లు, జియో మ్యాపింగ్‌, ఇంకా కొండ చ‌రియ‌ల ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌లు ముఖ్య‌మైన‌వి.


** 



(Release ID: 1568164) Visitor Counter : 109