మంత్రిమండలి

ప‌ర్యాట‌క రంగంలో భార‌త్- సౌదీ అరేబియాల మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Posted On: 13 FEB 2019 9:08PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్‌, భార‌త ప్ర‌భుత్వ ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ‌, సౌదీ ప‌ర్యాట‌క క‌మిష‌న్‌, నేష‌న‌ల్ హెరిటేజ్ ఆఫ్ కింగ్‌డ‌మ్ ఆఫ్ సౌదీ అరేబియాల మ‌ధ్య ప‌ర్యాట‌క రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన‌  అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలకు ఆమోదం తెలిపింది.

అవ‌గాహ‌నా ఒప్పందంలోని ముఖ్యాంశాలు:

ఎ)ప‌ర్యాట‌క అభివృద్ధి , హోట‌ళ్లు , రిసార్టులు, వ‌స‌తి సౌక‌ర్యాలు, ప‌ర్యాట‌కరంగ స‌మాచారం, గ‌ణాంకాలు, ఎగ్జిబిష‌న్‌, ఈవెంట్ ప‌ర్యాట‌క రంగానికి సంబంధించి ఉభ‌య‌దేశాల‌లో చేప‌ట్టే ఇత‌ర కార్య‌క‌లాపాలు, టూరిజం అభివృద్ధి, ప్ర‌ణాళ‌ఙ‌క‌, పెట్టుబ‌డి, లైసెన్సింగ్‌, టూరిజం స‌దుపాయాల మార్కెటింగ్‌, నిర్వ‌హ‌ణ‌, వ్య‌వ‌సాయ ప‌ర్యాట‌కం, ఎడారి ప‌ర్యాట‌కం వంటి వాటికి సంబంధించి స‌మాచారాన్ని, చ‌ట్టాల త‌యారీలో నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డం.

బి) మీడియా ప్ర‌చుర‌ణ‌లు, ప‌ర్యాట‌క రంగానికి సంబంధించిన ఫిల్మ్‌లను ఇచ్చిపుచ్చుకోవ‌డం,ఉభ‌య‌దేశాల‌కు సంబంధించిన నిపుణుల‌ను , ప‌ర్యాట‌క రంగానికి చెందిన మీడియా ప్ర‌తినిధులను ఒక‌దేశానికి చెందిన వారిని మ‌రో దేశంలో ప‌ర్య‌టించేలా ప్రోత్స‌హించ‌డం

సి) సంబంధిత దేశాల‌లో గ‌ల ప‌ర్యాట‌క పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను తెలియ‌జేయ‌డం, టూరిజం ప్రాజెక్టుల‌లో ప‌ర‌స్ప‌ర ప‌ర్యాట‌క పెట్టుబ‌డులను ప్రోత్స‌హించ‌డం.

డి) సంయుక్త ప‌ర్యాట‌క ఈవెంట్‌ల నిర్వ‌హ‌ణ‌ను ప్రోత్స‌హించ‌డం, ఎగ్జిబిష‌న్ల‌లో పాల్గొన‌డం, స‌ద‌స్సులు, స‌మావేశాల‌ను ఉభ‌య దేశాల‌లో నిర్వ‌హించ‌డం ద్వారా ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌డం, ఉమ్మ‌డి ప‌ర్యాట‌క దార్శ‌నిక‌త‌కు ఒక స్ప‌ష్ట‌మైన రూపు నివ్వ‌డం

ఇ) ఉభ‌య‌దేశాల‌లో ప‌ర్యాట‌క విద్య‌, శిక్ష‌ణ రంగంలో కృషి చేస్తున్న ప్ర‌భుత్వ , ప్ర‌వేటు విద్యాసంస్థ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం.

ఎఫ్‌) ప‌ర్యాట‌క‌రంగం సాంకేతిక ప‌రిజ్ఞానంలో వినూత్న అనుభ‌వాలు, స‌ల‌హా సేవ‌ల‌ను ప‌ర‌స్ప‌రం మార్పిడి చేసుకోవ‌డం

జి) అంత‌ర్జాతీయ వేదికల‌పైన , అంత‌ర్జాతీయ సంస్థ‌లలో ప‌ర్యాట‌క రంగానికి చెందిన అంశాలపై ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డం, స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డం.

నేప‌థ్యం:

ఇండియా, సౌదీ అరేబియాలు ఎంతోకాలంగా బ‌ల‌మైన‌ ఆర్థిక‌, దౌత్య‌ప‌ర‌మైన సంబంధాల‌ను క‌లిగి ఉన్నాయి. ఉభ‌య దేశాలూ త‌మ మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత బ‌ల‌ప‌రుచుకుంటూ , వ్య‌వ‌స్థీకృత సంబంధాల‌ను ప‌ర్యాట‌క రంగంలో మ‌రింత వృద్ధి చేసుకునేందుకు భార‌త ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ‌, సౌదీ క‌మిష‌న్ ఫ‌ర్ టూరిజం, నేష‌న‌ల్ హెరిటేజ్‌, సౌదీ అరేబియాలే ఒక అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేశాయి.

పశ్చిమాసియాకు, ఇండియాకు సౌదీ అరేబియా ఒక ముఖ్య‌మైన ప‌ర్యాట‌క మార్కెట్‌. సౌదీ అరేబియాతో అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాల వ‌ల్ల ఈ మార్కెట్ నుంచి ప‌ర్యాట‌కులు ఎక్కువ‌మంది రావ‌డానికి ఇది  దోహ‌ద‌ప‌డుతుంది.
**



(Release ID: 1564536) Visitor Counter : 91