మంత్రిమండలి
ఎన్ఆర్ ఐ వివాహాల రిజిస్ట్రేషన్ బిల్ 2019ను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
Posted On:
13 FEB 2019 9:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రవాస భారతీయుల వివాహాల రిజిస్ట్రేషన్ (ఎన్.ఆర్.ఐ) బిల్ ,2019ని ప్రవేశపెట్టేందుకు అనుమతి తెలిపింది. భారతీయ పౌరులను ప్రత్యేకించి మహిళలు ఎన్.ఆర్.ఐ జీవిత భాగస్వామి చేతిలో మోసపోకుండా మరింత రక్షణ, జవాబుదారిత్వం కల్పించేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారు.
ముఖ్యాంశాలు.
తప్పు చేసే ఎన్ ఆర్ ఐ జీవిత భాగస్వాముల పట్ల కఠినంగా ఉండేలా ఈ బిల్లు తగిన సవరణలను చట్టానికి ప్రతిపాదిస్తుంది. దీనిద్వారా ఎన్ఆర్ ఐలను వివాహం చేసుకున్న భారతీయ పౌరులు మోసపోకుండా, మరింత జవాబుదారిత్వం కల్పించేందుకు తగిన రక్షణ కల్పిస్తుంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే , ఎన్.ఆర్.ఐలు చేసుకునే వివాహాలను భారత్‌లో రిజిస్టర్ చేస్తారు లేదా విదేశాలలోని ఇండియన్ మిషన్‌లు,పోస్ట్‌లలో నమోదు చేస్తారు. ఇందుకు అవసరమైన సవరణలను పాస్‌పోర్ట్ చట్టం 1967లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో కొత్త సెక్షన్ 86 ఎ ని చేర్చడం ద్వారా మార్పులు తీసుకువస్తారు.
ప్రధాన ప్రభావం:
భారత దేశంలోని కోర్ట్‌ప్రోసీడింగ్స్‌కు సంబంధించి జుడిషియల్ సమన్లు అందజేయడం ప్రధాన సమస్యగా ఉంటూ వస్తోంది. ప్రస్తుత బిల్లు
1973 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్‌కు సవరణలు తీసుకురావడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఈ బిల్లు ఎన్.ఆర్.ఐ లను వివాహం చేసుకునే భారత పౌరులకు గట్టి రక్షణ కల్పించనుంది. అలాగే ఎన్.ఆర్.ఐలు తమ జీవిత భాగస్వాములను వేధింపులకు గురిచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించడానికి ఉపకరిస్తుంది. ఎన్.ఆర్.ఐలను వివాహం చేసుకునే భారతీయ మహిళలకు ఈ బిల్లు వల్ల ప్రయోజనం కలుగుతుంది.
**
(Release ID: 1564529)