మంత్రిమండలి

భార‌త‌దేశాని కి మ‌రియు యూక్రేన్‌ కు మ‌ధ్య‌ వ్య‌వ‌సాయం మ‌రియు ఆహార ప‌రిశ్ర‌మ రంగాల లో స‌హ‌కారం కోసం ఒప్పందం పై సంత‌కాల‌ కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 06 FEB 2019 9:50PM by PIB Hyderabad

భార‌త‌దేశాని కి మ‌రియు యూక్రేన్ కు మ‌ధ్య‌ వ్య‌వ‌సాయం మ‌రియు ఆహార ప‌రిశ్ర‌మ రంగాల లో స‌హ‌కారం కోసం ఒప్పందం పై సంత‌కాల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌తిపాదిత ఒప్పందం వ్య‌వ‌సాయాని కి మ‌రియు ఆహార ప‌రిశ్ర‌మ కు చెందిన వివిధ రంగాల లో స‌హ‌కారాని కి మార్గాన్ని సుగ‌మం చేస్తుంది.  దీని కోసం రెండు దేశాల కు చెందిన ప్ర‌తినిధు ల‌తో ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.  గుర్తించిన రంగాల లో సహ‌కారాని కి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి, అలాగే, త‌గిన ప్ర‌ణాళిక‌ల ను సిద్ధం చేయ‌డాని కి, అంతేకాకుండా, ఉభ‌య ప‌క్షాలు ఖాయ ప‌ర‌చుకొన్న కార్య‌క్ర‌మాల అమ‌లు తీరు ను ప‌ర్య‌వేక్షించ‌డం ఈ బృందం బాధ్య‌త‌ లు గా ఉంటాయి.  కార్యాచ‌ర‌ణ బృందం క‌నీసం ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల కు ఒక‌ పర్యాయం భార‌త గ‌ణ‌తంత్రం లో, మరొక పర్యాయం యూక్రేన్ లో సమావేశమవుతుంది.   ఈ ఒప్పందం ఒప్పంద పత్రం పై సంత‌కాలు అయిన నాటి నుండి అమ‌లు లోకి రావలసివుంటుంది.   ఈ ఒప్పందం అయిదు (5) సంవ‌త్స‌రాల కాలం పాటు అమ‌లు లో ఉండాలి.  ఈ ఒప్పందాన్ని ఆ త‌రువాత అయిదు (5) సంవ‌త్స‌రాల కాలాల కు దానంత‌ట అదే పొడిగించుకొనేందుకు వీలు ఉంటుంది.  ఈ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవాల‌న్న త‌న అభిమ‌తాన్ని ఇరు ప‌క్షాల లో ఏదైనా ఒక ప‌క్షం  వెల్ల‌డి చేస్తూ నోటిఫికేశన్ ను ఇచ్చిన తేదీ నాటి నుండి ఆరు (6) నెలలు అయిన త‌రువాత, ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవ‌చ్చును.


**



(Release ID: 1563303) Visitor Counter : 111