మంత్రిమండలి

ఎన్ హెచ్ పిసి, నార్త్ ఈస్ట్ ఎలక్ర్టిక్ పవర్ కార్పొరేషన్, టిహెచ్ డిసి ఇండియా లిమిటెడ్, ఎస్ జెవిఎన్ లిమిటెడ్ కంపెనీల్లో 1.197 నుంచి అమలులోకి వచ్చే విధంగా బోర్డు స్థాయి కన్నా దిగువన పని చేసే ఎగ్జిక్యూటివ్ ల వేతన స్కేళ్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు కేబినెట్ ఆమోదం

Posted On: 16 JAN 2019 4:07PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో స‌మావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ జల విద్య‌త్ కార్ప‌రేష‌న్ లిమిటెడ్ (ఎన్ హెచ్ పిసి), ఈశాన్య ప్రాంతాల విద్యుత్ కార్పొరేష‌న్ (నీప్ కో), టిహెచ్ డిసి లిమిటెడ్ (గ‌తంలో తెహ్రీ హైడ్రో డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్), స‌ట్లెజ్ జల విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్ (ఎస్ విజెఎన్) కంపెనీల్లో బోర్డు స్థాయి ఎగ్జిక్యూటివ్ ల క‌న్నా దిగువ స్థాయిలో ప‌ని చేస్తున్నెఎగ్జిక్యూటివ్ ల వేత‌నం స్కేళ్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు అనుమ‌తించింది. 2006 సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా 1997 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి ఈ క్ర‌మ‌బ‌ద్ధీకరణ అమ‌లులోకి వ‌స్తుంది. 

అమ‌లు వ్యూహం : 

2006 ఏప్రిల్ 4, 2006 సెప్టెంబ‌ర్ 1 తేదీల్లో విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా జల విద్యుత్ రంగంలోని ఈ సిపిఎస్ఇలు అమ‌లు జ‌రుపుతున్న పే స్కేళ్లు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంత‌రం క్ర‌మ‌బ‌ద్ధం అవుతాయి.

ప్ర‌భావం : 

ఈ అనుమ‌తితో 2007 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ క‌న్నా ముందు నియ‌మితులైన 5254 మంది ఎగ్జిక్యూటివ్ లు ఈ నిర్ణ‌యం వ‌ల్ల లాభం పొందుతారు. జ‌ల‌విద్యుత్ రంగంలోని సిపిఎస్ ఇల ఎగ్జిక్యూటివ్ ల నైతిక స్థైర్యం మెరుగుప‌డేందుకు ఈ నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డుతుంది. 

వ్య‌యం : 

పే స్కేళ్ల క్ర‌మ‌బ‌ద్ధీకరణ నిర్ణ‌యం వ‌ల్ల రూ.323 కోట్ల మేర‌కు భారం ప‌డుతుంది. 
నేప‌థ్యం : గ‌తంలో ఎన్ టిపిసి/ ఆయిల్ రంగంలోని కంపెనీల్లో కార్మికులు/  నాన్ ఎగ్జిక్యూటివ్ ల పే స్కేళ్లు స‌వ‌రించిన ప్ర‌భావం వ‌ల్ల 1997 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి ఎన్ హెచ్ పిసి, నీప్ కో, టిహెచ్ డిసిఐఎల్, ఎస్ జెవిఎన్ఎల్ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్  స్థాయి వేత‌నాల్లో వ్య‌త్యాసం కొన‌సాగుతోంది. ఇ-1 గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ల వేత‌నం స్కేళ్ల క‌న్నా వ‌ర్క్ మెన్, సూప‌ర్ వైజ‌ర్ల పేస్కేళ్లు ఎక్కువ‌గా ఉన్నాయి. 

ఈ ప్ర‌తిపాద‌న‌ను కార్య‌ద‌ర్శుల స్థాయి క‌మిటీ, కేబినెట్ ప‌లు సంద‌ర్భాల్లో ప‌రిశీల‌న‌కు తీసుకున్నాయి. 2013 డిసెంబ‌ర్ లో కేబినెట్ ఈ దిగువ నిర్ణ‌యం తీసుకుంది.  
1997 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి వ‌చ్చిన డీవియెంట్ పేస్కేళ్ల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌కూడ‌దు. 

అయితే ఆ తేదీ నుంచి సిబ్బందికి చెల్లించిన అద‌న‌పు వేత‌నాలు రిక‌వ‌రీ చేయ‌డం వ‌ల్ల వారి నైతిక స్థైర్యం దెబ్బ తినే ప్ర‌మాదం ఉండ‌డంతో పాటు రిక‌వ‌రీ వ‌ల్ల వారిపై ప‌డే ప్ర‌భావాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వారి నుంచి ఆ సొమ్ము రిక‌వ‌రీ చేయ‌కూడ‌దు. 
1997 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి వచ్చేలా నిర్ణ‌యించిన పే స్కేళ్ల‌లో వ్య‌త్యాసాలు దిద్దుబాటు చేసి 2007 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి పే స్కేళ్లు అమ‌లుజ‌ర‌పాలి. 

ఈ ఉత్త‌ర్వుల‌పై ఆగ్ర‌హించిన ఉద్యోగుల సంఘాలు వివిధ హైకోర్టుల్లో రిట్ పిటిష‌న్లు దాఖ‌లు చేశాయి. ఆ పిటిష‌న్ల‌ను ప‌రిశీలించిన ఉత్త‌రాఖండ్, మేఘాలయ హైకోర్టులు పై నిర్ణ‌యాన్ని కొట్టివేశాయి. కాగా ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఆ నిర్ణ‌యాన్ని కొట్టివేయ‌డాన్ని స‌వాలు చేస్తూ 2017 ఏప్రిల్ 12వ తేదీన సుప్రీంకోర్టులో ఎస్ ఎల్ పి దాఖ‌లు చేయ‌గా 2017 మే 8వ తేదీన ఆ పిటిష‌న్ ను కొట్టివేసింది. మేఘాలయ, ఉత్త‌రాఖండ్ హైకోర్టుల్లో కోర్టు ఉత్త‌ర్వుల ఉల్లంఘన పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్ హెచ్ పిసి, నీప్ కో, టిహెచ్ డిసిఐఎల్, ఎస్ జెవిఎన్ఎల్ కంపెనీల్లో వేత‌నం స్కేళ్ల క్ర‌మ‌బ‌ద్ధీకరణ అంశాన్ని కేబినెట్ ముందుంచ‌డం త‌ప్ప విద్యుత్ మంత్రిత్వ శాఖ‌కు మార్గాంత‌రం లేక‌పోయింది.

***


 



(Release ID: 1560295) Visitor Counter : 156