మంత్రిమండలి

గ‌నులు, టెస్టింగ్ అండ్ రిస‌ర్చ్ స్టేష‌న్ ల‌కు సంబంధించిన భ‌ద్ర‌త అంశం పై భార‌త‌దేశాని కి, ఆస్ట్రేలియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 16 JAN 2019 4:10PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ కార్మిక మ‌రియు ఉపాధి మంత్రిత్వ శాఖ లోని డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎంఎస్‌) కు మ‌రియు ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌లాండ్ ప్ర‌భుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచుర‌ల్ రిసోర్స్ మైన్స్ అండ్ ఎన‌ర్జీ కి మ‌ధ్య సేఫ్టీ ఇన్ మైన్స్, టెస్టింగ్ అండ్ రిస‌ర్చ్ స్టేష‌న్ (ఎస్ఐఎమ్‌టిఎఆర్ఎస్‌) ద్వారా ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు)పై సంత‌కాల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించిన  కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌భావం:

డిజిఎమ్ఎస్ కు మ‌రియు సేఫ్టీ ఇన్ మైన్స్, టెస్టింగ్ అండ్ రిస‌ర్చ్ స్టేష‌న్ కు మ‌ధ్య దిగువన పేర్కొన్న అంశాల లో ఒక భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌ర‌చ‌డం లో ఈ ఎంఒయు స‌హ‌క‌రించ‌నుంది:

- రిస్క్ ఆధారిత‌మైన‌టువంటి భ‌ద్ర‌త నిర్వహణ వ్య‌వ‌స్థ ను అమ‌లు చేయ‌డం, శిక్ష‌ణ ను ఇవ్వ‌డం, స‌మావేశాలు, చ‌ర్చా స‌భ‌లు, ఇత‌ర సాంకేతిక స‌మావేశాల‌ ను నిర్వ‌హించ‌డం, వృత్తిప‌ర‌మైన‌టువంటి భ‌ద్ర‌త‌, ఇంకా ఆరోగ్య అకాడెమీ ని మరియు నేశ‌న‌ల్ మైన్ డిజాస్ట‌ర్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌డం, ఇంకా డిజిఎమ్ఎస్ కోసం ప‌ని చేస్తున్న ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి (ఆర్ & డి) ప్ర‌యోగ శాల‌ ను ఆధునికీక‌రించ‌డం. 

అమలు సంబంధిత వ్యూహం:

సంతకాలు జ‌రిగిన తేదీ నాటి నుండి ఈ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం అమ‌లు లోకి వ‌చ్చి, మూడు సంవ‌త్స‌రాల కాలం పాటు వర్తిస్తుంది.

పూర్వ‌రంగం:

ఆస్ట్రేలియా లో గ‌నుల త‌వ్వ‌కం సంబంధిత ప్ర‌మాదాల స్థాయిలు ప్ర‌పంచం లో కెల్లా అతి త‌క్కువ‌ గా ఉన్నాయి.  గ‌నుల త‌వ్వ‌కం రంగం లో ముప్పు ను ప‌సిగ‌ట్టేట‌టు వంటి మ‌రియు న‌ష్ట భ‌యాన్ని అంచ‌నా వేసేట‌టువంటి సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తూ, గ‌నుల రంగం కోసం రిస్క్ ఆధారిత‌మైన భ‌ద్ర‌త నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక‌ల‌ ను రూపొందించ‌డం లో, వాటిని అమ‌లు చేయ‌డం లో ఆస్ట్రేలియా మార్గ‌ద‌ర్శి గా ఉంది.  గ‌నుల సంబంధిత భ‌ద్ర‌త నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ ల లో ఎస్ఐఎమ్‌టిఎఆర్ఎస్ పేరు తెచ్చుకొంది.
 

**



(Release ID: 1560293) Visitor Counter : 337