ఆర్థిక మంత్రిత్వ శాఖ

భార‌త‌దేశం మ‌రియు జ‌పాన్ ల మ‌ధ్య ద్వైపాక్షిక ఆదాన ప్రదాన స‌ర్దుబాటు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 10 JAN 2019 8:46PM by PIB Hyderabad

భార‌త‌దేశాని కి, జ‌పాన్ కు మ‌ధ్య ద్వైపాక్షిక ఆదాన ప్ర‌దాన స‌ర్దుబాటు (బిఎస్ఎ)కై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌ కు మ‌రియు భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్‌బిఐ)కి, బ్యాంక్ ఆఫ్ జపాన్ కు మధ్య గ‌రిష్ఠం గా 75 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ ల గరిష్ఠ మొత్తం తో కూడిన ఒక ద్వైపాక్షిక ఆదాన ప్ర‌దాన స‌ర్దుబాటు ఒప్పందం పై సంత‌కాలు చేసే అధికారాన్ని ఆర్‌బిఐ కి ఇస్తూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన  కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదముద్ర వేసింది.

ప్ర‌ధానాంశాలు:

విదేశీ మార‌క ద్ర‌వ్యం లో స్వ‌ల్ప‌కాలిక కొర‌త ను తీర్చ‌డం కోసం చెల్లింపు ల శేషం స్థాయి ని స‌ముచిత‌మైన రీతి లో నిర్వ‌హించే ఉద్దేశం తో, దేశీయ క‌రెన్సీ కి బ‌దులు గా గ‌రిష్ఠ మొత్తం లో 75 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ ల ఆదాన ప్ర‌దానానికి మరియు రీ-ఎక్స చేంజ్ కు భార‌త‌దేశం మ‌రియు జ‌పాన్ ల మ‌ధ్య ఒప్పంద‌మే ఈ ఆదాన ప్ర‌దాన స‌ర్దుబాటు గా ఉంది.

ప్ర‌యోజ‌నాలు:

సంకట ప‌రిస్థితుల‌ లో ఒక‌రికి మ‌రొక‌రు స‌హాయాన్ని అందించుకోవ‌డం తో పాటు, అంత‌ర్జాతీయ విశ్వాసాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసం భార‌త‌దేశాని కి, జ‌పాన్ కు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాని కి ఒక చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణే బిఎస్ఎ.  ఈ స‌దుపాయం భార‌త‌దేశాని కి అవ‌స‌ర‌ప‌డిన‌ప్పుడల్లా వినియోగించుకోవ‌డానికిగాను అంగీకారం కుదిరిన మొత్తం లో మూల‌ధ‌న లభ్యత ను కల్పిస్తుంది.  అంతే కాదు, ఈ స‌ర్దుబాటు కార్య‌రూపం దాల్చిందంటే గనక దేశ మార‌కం రేటు స్థిర‌త్వ విష‌యం లో మ‌రింత విశ్వాసం ఏర్పడి భారతీయ కంపెనీలకు విదేశీ మూలధన వినియోగం లో అవ‌కాశాలు మెరుగుపడతాయి.  చెల్లింపుల శేషం (బిఒపి)లో త‌లెత్తే ఇబ్బందుల‌ ను అధిగ‌మించ‌డాని కి ఈ త‌ర‌హా ఆదాన ప్ర‌దాన మార్గం అందుబాటు లో ఉండ‌టం దేశీయ క‌రెన్సీ పై ఊహాకల్పిత దాడుల‌ ను నిరోధించ‌ గ‌లగడంతో పాటు మార‌కం రేటు లో అనిశ్చితి ని సంబాళించడం లో ఆర్‌బిఐ యొక్క సామ‌ర్ధ్యాన్ని ఎంత‌గానో పెంపొందించ‌ గ‌లుగుతుంది కూడాను.

భార‌త‌దేశాని కి మ‌రియు జ‌పాన్ కు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర ఆర్థిక స‌హ‌కారం లో, ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క‌ మ‌రియు ప్ర‌పంచ భాగ‌స్వామ్యం లో ఈ స‌ర్దుబాటు మ‌రొక మైలురాయి అని చెప్పాలి.


**


(Release ID: 1559531)