మంత్రిమండలి
విజయ, దేనా, బ్యాంక్ ఆఫ్ బరోడా లను విలీనం చేస్తూ భారత బ్యాంకింగ్ రంగం లో ప్రథమ త్రిమార్గ విలీనాని కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
02 JAN 2019 5:55PM by PIB Hyderabad
విజయ, దేనా, బ్యాంక్ ఆఫ్ బరోడాలను విలీనం చేస్తూ భారత బ్యాంకింగ్ రంగంలో ప్రథమ త్రిమార్గ విలీనీకరణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా లో విజయ బ్యాంక్, దేనా బ్యాంకులు విలీనం అవుతాయి. దేశం లో ప్రభుత్వ రంగ బ్యాంకు లను సంఘటితం చేయడం లో భాగం గా ఈ త్రిమార్గ విలీన ప్రతిపాదన కు మంత్రిమండలి ఆమోదం తెలిపిన నేపథ్యం లో ఈ మూడు బ్యాంకులు కలగలసి దేశం లో రెండో అతిపెద్ద బ్యాంకు అవతరించనుంది. ఈ విలీనం అంతర్జాతీయ స్థాయి లో పోటీ ని ఇవ్వగల బ్యాంకు ఆవిర్భావాని కి దారి తీస్తుంది. తద్వారా భారీ ఆర్థిక నిల్వ లు ఏర్పడటం తో పాటు విస్తృత శ్రేణి సమన్వయం సాధ్యపడుతుంది. ఆయా బ్యాంకు ల నెట్ వర్క్ లు, వాటి అనుబంధ సంస్థ లు సామూహికం గా తక్కువ భారం గల డిపాజిట్ల సేకరణ కు వీలు కల్పిస్తాయి. అలాగే ఖాతాదారుల పునాది ని విస్తరించడం తో పాటు సమీకృత సంస్థ గా రూపుదాలుస్తుంది. దీంతో పాటు విపణి విస్తృతం కావడమే కాక నిర్వహణ సామర్థ్యం కూడా పెరిగి ఉత్పత్తుల, సేవల సంఖ్య పెంపొందుతుంది. తద్వారా ఖాతాదారుల కు బ్యాంకింగ్ రంగం మరింత గా అందుబాటు లోకి వస్తుంది.
విలీన పథకం లోని కీలకాంశాలు:
(a) విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ బదిలీ అయ్యే బ్యాంకులు కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా బదిలీ స్వీకరణ బ్యాంకు గా ఉంటుంది.
(b) ఈ పథకం 1.4.2019 నుండి అమలు లోకి వస్తుంది.
(c) ఈ పథకం ఆరంభమయ్యాక బదిలీ బ్యాంకు ల బాధ్యత లు బదిలీ స్వీకరణ బ్యాంకు కు బదిలీ అవుతాయి. ఈ రెండు బ్యాంకు ల వ్యాపారం, ఆస్తులు, హక్కులు, అధికారాలు, క్లెయిము లు, లైసెన్సు లు, అనుమతులు ఇతర హక్కు లు, ఆస్తులు, అన్ని రుణాలు, బాధ్యత లు, కర్తవ్యాలు ఇందులో భాగం గా ఉంటాయి.
(d) బదిలీ బ్యాంకుల లోని ప్రతి శాశ్వత ఉద్యోగి, అధికారి బదిలీ స్వీకరణ బ్యాంకు లో అధికారి లేదా ఉద్యోగి గా కొనసాగుతూ వారి వారి బాధ్యత లను నిర్వర్తిస్తారు లేదా సేవలను అందిస్తారు. వారి జీతనాతాలు, ఇతర భత్యాలు వారు ఇదివరకు పొందిన వాటి కన్నా తక్కువ కాబోవు.
(e) బదిలీ అయ్యే బ్యాంకు ల ఉద్యోగులు, అధికారుల ప్రయోజనాల పరిరక్షణ కు బదిలీ స్వీకరణ బ్యాంకు బోర్డు పూర్తి స్థాయి లో భరోసా ను ఇస్తుంది.
(f) బదిలీ అయ్యే బ్యాంకు ల వాటాదారుల కు బదిలీ స్వీకరణ బ్యాంకు మార్పిడి నిష్పత్తి కి అనుగుణం గా వాటా లను జారీ చేస్తుంది. దీనికి సంబంధించి మూడు బ్యాంకు ల వాటాదారుల కు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్య లను నిపుణుల సంఘాని కి నివేదించే వెసులుబాటు ఉంటుంది.
ప్రతిపాదిత విలీనం వల్ల ఒనగూడే ప్రయోజనాలు కింది విధంగా ఉంటాయి:
• పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాల కు అనుగుణం గా విలీన బ్యాంకు సకల పర్యావరణాన్ని మార్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. దీంతో పాటు ఆకస్మిక ఒడుదొడుకుల ను తట్టుకుంటూ వనరుల ను పెంచుకోగల సామర్థ్యం కూడా దీని కి సమకూరుతుంది. భారీ ఆర్థిక వనరులు, విస్తృత పరిధి ల కారణం గా లాభదాయకత మెరుగుపడుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తుల ను అందిస్తూ విలీన బ్యాంకు లలోని అత్యుత్యమ సాంకేతికత సహా ఉత్తమాచరణల ను అనుసరించగలదు. ఈ విస్తృత పునాది ద్వారా వ్యయం లో పొదుపు, ముప్పు నిర్వహణ మెరుగుదల, ఆర్థిక సార్వజనీనత లకు భరోసా లభిస్తుంది.
• అంతర్జాతీయ బ్యాంకు లతో పోలిస్తే ఒక భారీ బ్యాంకు గా అవతరించగలగడంతో పాటు భారత బ్యాంకింగ్ రంగం లో, ప్రపంచ బ్యాంకింగ్ రంగం లో గట్టి పోటీదారు గా నిలువగలుగుతుంది.
• దేనా బ్యాంకు కు సాపేక్షంగా గల తక్కువ భారం తో కూడిన సిఎఎస్ఎ డిపాజిట్ ల సేకరణ సామర్థ్యం, విజయా బ్యాంకు లాభదాయకత తో పాటు వృద్ధి కి వీలు కల్పించే మూలధనం లభ్యత, అంతర్జాతీయం గా విస్తృత నెట్ వర్క్ ను కలిగివున్న బ్యాంక్ ఆఫ్ బరోడా సామర్థ్యం తదితరాలన్నీ కలగలసి మార్కెట్ కు చేరువ కాగల ప్రయోజనాలు గా రూపొందుతాయి. అంతేకాకుండా నిర్వహణ సంబంధ సామర్థ్యాలు, విస్తృత శ్రేణి ఉత్పత్తులను, సేవలను అందించేందుకు తగిన మద్దతు లభించగలదు.
• విలీన బ్యాంకు లలోని విస్తృత సామర్థ్యం గల ప్రతిభావంతులైన సిబ్బంది బలం, భారీ సమాచార రాశి అందుబాటు లోకి రాగలవు. డిజిటల్ బ్యాంకింగ్ వేగం గా విస్తరిస్తున్న నేపథ్యం లో విశ్లేషణాత్మక చర్యల ద్వారా పోటీ ని ఇవ్వగలదిగా రూపొందుతుంది. ఇంతటి విస్తృత వ్యవస్థ, పంపిణీ నెట్ వర్క్ ఏర్పడుతున్న ఫలితం గా ఒనగూడే ప్రయోజనాలు కూడా దిగువ కు ప్రవహిస్తాయి. దీంతో పాటు అనుబంధ సంస్థ ల ద్వారా ఉత్పత్తులు, సేవల ప్రదాన వ్యయం కూడా తగ్గుతుంది.
• బలమైన నెట్ వర్క్ తో పాటు విస్తృతమైన ఉత్పత్తులు, సేవల శ్రేణి సహా రుణ లభ్యత మెరుగుపడటం ద్వారా పెద్ద సంఖ్య లో ప్రజానీకాని కి లబ్ధి సైతం చేకూరుతుంది.
**
(Release ID: 1558401)
Visitor Counter : 293