మంత్రిమండలి
విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల రంగం లో సహకారం అంశం పై భారతదేశానికి మరియు ఉజ్‌బెకిస్తాన్ కు మధ్య ఒప్పందం గురించి మంత్రివర్గం దృష్టికి తీసుకు రావడమైంది
Posted On:
22 NOV 2018 1:34PM by PIB Hyderabad
భారతదేశానికి మరియు ఉజ్‌బెకిస్తాన్ కు మధ్య విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూతన ఆవిష్కరణల రంగం లో సహకారం అంశం పై కుదిరిన ఒప్పందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ ఒప్పందం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షుడు శౌకత్ మిర్జియోయెవ్ ల సమక్షం లో భారతదేశం పక్షాన విజ్ఞాన శాస్త్రం & సాంకేతిక విజ్ఞానం, పృథ్వీ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్, ఉజ్‌బెక్ పక్షాన మినిస్టర్ ఆఫ్ ఇనవేటివ్ డివెలప్‌మెంట్ శ్రీ ఇబ్రహిమ్ అబ్దురఖ్ మనోవ్ లు 2018 వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నాడు సంతకాలు చేశారు.
ప్రయోజనాలు:
ఈ ఒప్పందం కుదరడం వల్ల ద్వైపాక్షిక సంబంధాల లో ఒక నూతన అధ్యాయం ఆరంభం కానుంది. ఈ ఒప్పందం ద్వారా ఉభయ పక్షాలు విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం రంగం లో పరస్పర ప్రయోజనాల ను చెప్పుకోదగిన స్థాయి లో మేళవించుకొని, తద్వారా లభించే బలాలను ఉపయోగించుకో గలుగుతాయి. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల రంగం లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ ఒప్పందం యొక్క ధ్యేయం గా ఉంది. ఈ ఒప్పందం తో సంబంధాన్ని కలిగి ఉండే వర్గాల లో భారతదేశం, ఇంకా ఉజ్‌బెకిస్తాన్ లకు చెందిన శాస్త్రీయ సంస్థల పరిశోధకులు, విద్యావేత్తలు, ఆర్ & డి ప్రయోగశాలలు, ఇంకా పరిశ్రమలు ఉంటాయి. తక్షణ సమన్వయం కోసం వ్యవసాయం, ఆహార విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం; ఇంజినీరింగ్ సైన్సెస్; ఇన్ ఫర్మేశన్ అండ్ కమ్యూనికేశన్ టెక్నాలజీ, అప్లయిడ్ మేథమేటిక్స్ అండ్ డేటా సైన్స్ & టెక్నాలజీ; ఆరోగ్యం మరియు వైద్య సాంకేతిక విజ్ఞానం; పదార్థాల సంబంధిత విజ్ఞాన శాస్త్రాలు; లైఫ్‌సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ; భౌతికశాస్త్రాలు మరియు ఆస్ట్రో ఫిజిక్స్ & ఎనర్జీ, జల వాయు మరియు ప్రాకృతిక వనరుల వంటి రంగాల ను ఎంపిక చేయడం జరిగింది.
**
(Release ID: 1553509)
Visitor Counter : 230