మంత్రిమండలి
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం 2009కి సవరణలు ఆమోదించిన కేంద్ర కేబినెట్
प्रविष्टि तिथि:
08 NOV 2018 8:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014(నెం 6 ఆఫ్ 2014) పదమూడవ షెడ్యూలులో సూచించినట్టుగా విజయనగరం జిల్లా రెల్లి గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటుచేయనున్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి తొలిదశ వ్యయం కింద 420 కోట్ల రూపాయలను కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
(रिलीज़ आईडी: 1552205)
आगंतुक पटल : 335