ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్త‌రాఖండ్ లోని హ‌ర్షిల్ లో జ‌వాను ల‌తో క‌ల‌సి దీపావ‌ళి పండుగ‌ ను జ‌రుపుకున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 07 NOV 2018 10:05AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ఉత్త‌రాఖండ్ లోని హ‌ర్షిల్ లో భార‌తీయ సైన్యానికి చెందిన జ‌వానుల‌ తోన, అలాగే ఐటిబిపి కి చెందిన జ‌వానుల తో క‌ల‌సి దీపావ‌ళి పండుగ ను జ‌రుపుకొన్నారు.  

ఈ సంద‌ర్భంగా జ‌వానుల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తూ, మారుమూల మంచు కొండ‌ల్లో విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల వారు క‌న‌బ‌రుస్తున్న అంకిత భావం దేశ ప్ర‌జ‌ల‌ కు శ‌క్తి ని అందిస్తోంద‌ని, 125 కోట్ల మంది భార‌తీయుల భ‌విష్య‌త్తు ను, క‌ల‌ లను భ‌ద్రంగా ఉంచుతోంద‌న్నారు.  దీపావ‌ళి పండుగ వెలుగుల పండుగ; ఈ పండుగ మంచిత‌నం అనే కాంతి ని ప్ర‌సరిస్తుంది, భ‌యాన్ని పార‌దోలుతుంద‌ని ఆయ‌న అన్నారు.  జ‌వానులు వారి నిబ‌ద్ధ‌త తో, క్ర‌మ‌శిక్ష‌ణ తో ప్ర‌జ‌ల లో భ‌ద్ర‌త భావ‌న‌ ను వ్యాప్తి చేయ‌డానికి, నిర్భ‌య‌త్వాన్ని పెంపొందించ‌డానికి తోడ్పడుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.
 
గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా తాను ఉన్న‌ప్ప‌టి నుండి కూడాను దీపావ‌ళి నాడు సైనికుల తో భేటీ అవుతూ వ‌స్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.  కొన్నేళ్ళ క్రితం తాను కైలాస్ మాన‌స స‌రోవ‌ర యాత్ర లో పాలుపంచుకొన్న సంద‌ర్భం లో ఐటిబిపి కి చెందిన జ‌వాను ల‌తో భేటీ అయినట్లు ఆయ‌న ప్ర‌స్తావించారు.
 
భార‌త‌దేశం ర‌క్ష‌ణ రంగం లో గొప్ప గొప్ప అడుగులు వేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  మాజీ సైనికోద్యోగుల సంక్షేమార్థం ఒఆర్ఒపి (ఒక ర్యాంకు, ఒక పెన్ష‌న్‌) స‌హా వివిధ చ‌ర్య‌ ల‌ను తీసుకొన్నట్లు ఆయ‌న వివ‌రించారు.
 
ఐక్య రాజ్య స‌మితి శాంతి ప‌రిర‌క్ష‌క కార్య‌క‌లాపాల‌ లో పోషించిన పాత్ర‌ కు గాను భార‌తీయ సైనిక ద‌ళాలు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా గౌర‌వాభినందనల‌కు పాత్రమయ్యాయని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
 
సైనికుల‌ కు ప్ర‌ధాన మంత్రి మిఠాయిలను తినిపించారు.  దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని త‌న‌కు అభినందనలు తెలియజేయడం కోసం స‌మీప ప్రాంతాల నుండి  త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ తో కూడా ఆయ‌న మ‌మేక‌మ‌య్యారు.


**



(Release ID: 1552131) Visitor Counter : 159