మంత్రిమండలి
ఒడిశా లోని ఝార్‌సుగుడా విమానాశ్రయం పేరు ను మార్చి “వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయం, ఝార్‌సుగుడా” అనే పేరు ను పెట్టడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2018 12:13PM by PIB Hyderabad
ఒడిశా లోని ఝార్‌సుగుడా విమానాశ్రయం పేరు ను మార్చివేసి “వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయం, ఝార్‌సుగుడా” అనే పేరు ను పెట్టడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
వీర్ సురేంద్ర సాయి గారు ఒడిశా లో చిర పరిచిత స్వాతంత్య్ర సమర యోధుల్లో ఒకరు. ఝార్‌సుగుడా విమానాశ్రయానికి ఆయన పేరు ను పెట్టడం ఒడిశా ప్రభుత్వ దీర్ఘ కాలిక డిమాండు ను నెరవేర్చడమే అవుతుంది. ఇది ఆ ప్రాంత ప్రజల భావోద్వేగాల ను ప్రతిబింబిస్తుంది కూడాను. అంతేకాదు, రాష్ట్రం తో ముడివడి వున్న ఆరాధ్య వ్యక్తి చేసిన సేవ కు సముచిత నివాళి గా కూడా ఇది ఉంటుంది.
**
(రిలీజ్ ఐడి: 1551631)
సందర్శకుల సూచీ సంఖ్య : : 253