మంత్రిమండలి

ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసేందుకు భార‌త‌దేశానికి, కొరియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 01 NOV 2018 11:42AM by PIB Hyderabad

ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసేందుకు భార‌త‌దేశం మరియు కొరియా ల మ‌ధ్య అవగాహన పూర్వక ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) పై సంత‌కాల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  
 
అవగాహన పూర్వక ఒప్పంద ప‌త్రం ప్ర‌ధానోద్దేశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

•  ప‌ర్య‌ట‌న రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని విస్త‌రింపచేయ‌డం
•  ప‌ర్య‌ట‌న కు సంబంధించిన స‌మాచారాన్ని మ‌రియు సమాచార రాశి ని పెంపొందింపచేయ‌డం
•  హోట‌ళ్ళు మ‌రియు టూర్ ఆప‌రేట‌ర్ లు స‌హా ప‌ర్య‌ట‌న రంగం తో సంబంధం ఉన్న వ‌ర్గాల న‌డుమ స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డం
•  మాన‌వ వ‌న‌రుల వికాసం లో స‌హ‌కారానికి గాను ఆదాన ప్ర‌దాన కార్య‌క్ర‌మాల‌ కు రూప క‌ల్ప‌న చేయ‌డం
•  ప‌ర్య‌ట‌న మ‌రియు ఆతిథ్య రంగాల లో పెట్టుబ‌డిని ప్రోత్స‌హించ‌డం
•  ఉభ‌య దేశాల లో ప‌ర్య‌ట‌న ను పోత్స‌హించ‌డం కోసం ప్ర‌సార మాధ్య‌మాలు/అభిప్రాయ రూప‌క‌ర్త‌లు/ టూర్ ఆప‌రేట‌ర్ల బృందాల ను అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పంపించ‌డం
•  ప్ర‌చారం, ద‌ర్శ‌నీయ స్థ‌లాల అభివృద్ధి, ఇంకా నిర్వ‌హ‌ణ రంగాల లో అనుభ‌వాన్ని ఇరు ప‌క్షాలు ఒక‌దానికి మ‌రొక‌టి అందించుకోవ‌డం
•  ఉభ‌య దేశాల లో ప్ర‌యాణ సంబంధ మేళాలు/ప్ర‌ద‌ర్శ‌న ల‌లో పాలుపంచుకోవ‌డాన్ని ప్రోత్స‌హించ‌డం.  ఇంకా, 
•  భ‌ద్ర‌మైన‌, గౌర‌వ ప్ర‌ద‌మైన మ‌రియు స్థిర ప్రాతిప‌దిక తో కూడిన‌ ప‌ర్య‌ట‌న‌ల‌ ను ప్రోత్స‌హించ‌డం.

పూర్వ‌రంగం:

భార‌త‌దేశం మరియు కొరియా ఒక బ‌ల‌మైనటువంటి దౌత్య సంబంధాన్ని, సుదీర్ఘ కాలిక ఆర్థిక సంబంధాన్ని పెంచి పోషించుకొంటున్నాయి.  ఈ ఇరు ప‌క్షాలు ప్ర‌స్తుతం ప‌ర్య‌ట‌న రంగం లో ఇప్ప‌టికే సువ్య‌వ‌స్థిత‌మై ఉన్న సంబంధాన్ని మ‌రింత‌గా అభివృద్ధి ప‌ర‌చుకోవాల‌ని, స‌హ‌కారాన్ని ప‌టిష్ట ప‌ర‌చుకోవాల‌ని అభిల‌షిస్తున్నాయి.

భార‌త‌దేశానికి పెద్ద సంఖ్య లో యాత్రికుల ను పంపుతూ ఉన్న ఆసియా తూర్పు ప్రాంత దేశాల లో కొరియా ఒక‌ దేశం గా ఉంది.  ఇటువంటి దేశం నుండి ప‌ర్యాట‌కుల రాక‌ ను పెంచుకోవ‌డం లో  కొరియా తో ఎంఒయు దాని వంతు పాత్ర ను పోషించగ‌లుగుతుంది.


**



(Release ID: 1551626) Visitor Counter : 167