మంత్రిమండలి

భోపాల్‌లో మెట్రోరైలు అనుసంధాన‌త‌కు ఊతం

భోపాల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి 1) క‌రోండ్ స‌ర్కిల్ నుంచి ఎయిమ్స్ వ‌ర‌కు, 2) బ‌హ‌ద్‌బ‌డా స్క్వేర్ నుంచి ర‌త్న‌గిరి తిర‌హా వ‌ర‌కు రెండు కారిడార్ల‌కు కేంద్ర‌కేబినెట్ ఆమోదం

Posted On: 03 OCT 2018 6:56PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన  కేంద్ర కేబినెట్‌,  భోపాల్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి 1)క‌రోండ్ స‌ర్కిల్ నుంచి ఎయిమ్స్ వ‌ర‌కు (14.99 కిలోమీట‌ర్లు) ,2) బ‌హ‌ద్‌బ‌డా స్క్వేర్ నుంచి ర‌త్న‌గిరి తిర‌హా వ‌ర‌కు(12.88 కిలోమీట‌ర్లు)   మొత్తం రెండు కారిడార్ల‌లో 27.87 కిలోమీట‌ర్ల మేర‌కు మెట్రో ప్రాజెక్టు అమ‌లుకు ఆమోదం తెలిపింది.

వివ‌రాలుః

క‌రోండ్ నుంచి ఎయిమ్స్ కారిడార్ పొడ‌వు14.99 కిలోమీట‌ర్లు. ఇందులో ఎక్కువ భాగం ఎలివేటెడ్ మార్గం కాగా మ‌రికొంత భూగ‌ర్భ మార్గం (భోపాల్ రైల్వేస్టేష‌న్‌, బ‌స్ స్టేష‌న్‌వ‌ద్ద‌) ఉంది. ఈ మార్గంలో మెత్తం 16 స్టేష‌న్లు ఉండ‌గా అందులో 14 ఎలివేటెడ్‌, 2 భూ గ‌ర్బ స్టేష‌న్లు.

1. భ‌డ్ భ‌డా నుంచి ర‌త్న‌గిరి తిరాహా వ‌ర‌కు గ‌ల కారిడార్ 12.88 కిలోమీట‌ర్లు ఇందులో 14 స్టేష‌న్లు ఎలివేటెడ్ స్టేష‌న్లు.

2. ఈ ప్రాజెక్టు భోపాల్ న‌గ‌రంలో  చౌకైన‌, న‌మ్మ‌క‌మైన సుర‌క్షిత‌మైన భ‌ద్ర‌మైన‌, నిరంత‌రాయమైన ప్ర‌యాణ స‌దుపాయాన్ని క‌ల్పిస్తుంది. దీనివ‌ల్ల ప్ర‌మాదాలు త‌గ్గుతాయి . కాలుష్యం త‌గ్గుతుంది. ప్ర‌యాణ స‌మ‌యం, ఇంధ‌న వినియోగం త‌గ్గుతుంది. సంఘ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు త‌గ్గుతాయి. న‌గ‌ర విస్త‌ర‌ణ‌ను నియంత్రించ‌డానికి , భూమి వినియోగాన్ని సుస్థిరాభివృద్ధికి వాడ‌డానికి ఉప‌క‌రిస్తుంది.

3. ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం 6941.40 కోట్ల రూపాయ‌లు. ఈ ప్రాజెక్టును నాలుగు సంవ‌త్స‌రాల‌లో పూర్తి అవుతుంది.

ప్ర‌యోజ‌నాలుః

భోపాల్ మెట్రో రైలు ప్రాజెక్టు వ‌ల్ల భోపాల్‌లోని 23 ల‌క్ష‌ల మంది న‌గ‌ర ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా , ప‌రోక్షంగా ప్ర‌యోజ‌నం పొంద‌నున్నారు. ఈ కారిడార్లు రైల్వేస్టేష‌న్లు, బిఆర్‌టి స్టేష‌న్లు, బ‌స్‌, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్టు(ఐపిటి), మోటారుర‌హిత ప్ర‌యాణ సాద‌నాల‌తో (ఎన్‌.ఎం.టి) అనుసంధాన‌మౌతాయి.

ఈ ప్రాజెక్టుకు అద్దెలు, వ్యాపార‌ప్ర‌క‌ట‌న‌లనుంచి ప్ర‌యాణ చార్జీ కాక ఇత‌ర‌ మార్గంలో రాబ‌డి ఆర్జించ‌డానికి అలాగే వాల్యూకాప్చ‌ర్ ఫైనాన్సింగ్ (విసిఎఫ్‌)కు అవ‌కాశం ఉంది. ప్ర‌యాణ సౌక‌ర్యాల ఆధారిత అబివృద్ధి (టిఒడి), అభివృద్ధి హ‌క్కుల బ‌దిలీ (టిడిఆర్‌) ద్వారా దీనికి వీలుంది.
 మెట్రోరైలు కారిడార్ వెంబ‌డి గ‌ల రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలు ఈ ప్రాజెక్టువ‌ల్ల ఎంతో ల‌బ్ధి పొందుతాయి.ఈ ప్రాంతాల ప్ర‌జ‌లు రైలులో న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల‌కు సుల‌భంగా వెళ్లిరావ‌డానికి వీలు క‌లుగుతుంది.

 క‌రోండ్ నుంచి ఎయిమ్స్ వ‌ర‌కు గ‌ల కారిడార్ న‌గ‌రం న‌డిబొడ్డునుంచి వెళుతుంది. ఇది బ‌స్ స్టేష‌న్‌, రైల్వే స్టేష‌న్‌, ఎయిమ్స్‌, వంటి ర‌ద్దీ ప్రాంతాల గుండా వెళుతుంది. భ‌డ్‌భ‌డా నుంచి ర‌త్న‌గిరి కారిడార్ త్వ‌ర‌లో రూపుదిద్దుకోనున్న స్మార్ట్‌సిటీకి చెందిన‌ ఏరియా ఆధారిత అభివృద్ధి(ఎబిడి), బిఎఫ్ఐఇఎల్‌తో, పొరుగున ఉన్న పారిశ్రామిక ప్రాంతాల‌తో అనుసంధాన‌మౌతుంది. ఈ మెట్రో ప‌ర్యావ‌ర‌ణ హిత‌,సుస్థిర ప్ర‌జా ర‌వాణాను ప్ర‌జ‌ల‌కు అందిస్తుంది. ఇది స్థానికులు, ప్ర‌యాణికులు, శ్రామికులు, అతిథులు, ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

ప్ర‌గ‌తి:

ఈ ప్రాజెక్టు అమ‌లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ మెట్రో రైల్ కంపెనీ లిమిటెడ్ (ఎం.పి.ఎం.ఆర్‌.సి.ఎల్‌) పేరుతో ఒక ఎస్‌.పి.వైని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

 - భోపాల్ మెట్రో రైలు ప్రాజెక్టు నిధులు పాక్షికంగా భార‌త ప్ర‌భుత్వం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి స‌మాన ఈక్విటీ ప్రాతిప‌దిక‌న‌, పాక్షికంగా యూరోపియ‌న్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఇఐబి) నుంచి రుణం రూపంలో స‌మ‌కూరుతాయి.

- మెస్స‌ర్స్ లూయిస్ బెర్జ‌ర్ ఎస్‌.ఎ.ఎస్‌, మెస‌ర్స్‌జియో డాటా ఇంజనీరింగ్ ఎస్‌.పి.ఎ క‌న్సార్టియంతో క‌లిపి భోపాల్ మెట్రోరైలు ప్రాజెక్టుకు జ‌న‌ర‌ల్ క‌న్స‌ల్టెంట్‌లుగా మెస్స‌ర్స్ డి.బి.ఇంజ‌నీరింగ్‌, క‌న్స‌ల్టింగ్ జిఎంబిహచ్ ను నియ‌మించారు.

-తొలి సివిల్ వ‌ర్క్ పాకేజ్‌ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ప‌నులు త్వ‌ర‌లోనే ప్రారంభ‌మౌతాయి.

***



(Release ID: 1548501) Visitor Counter : 112