మంత్రిమండలి

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో సహకారంపై భారత, రష్యా దేశాల మధ్య అవగాహనా ఒప్పందానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.

Posted On: 03 OCT 2018 6:59PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎం ఎస్ ఎం ఈ) మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ  జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్ సంస్థ (ఎమ్ ఎస్ ఐ సి) - రష్యాకు చెందిన - జె ఎస్ సి - రష్యా చిన్న, మధ్యతరహా వాణిజ్య కార్పొరేషన్ (ఆర్ ఎస్ ఎమ్ బి) ల మధ్య -  సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో సహకారం కోసం- అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.  రష్యా అధ్యక్షుడు త్వరలో జరుపనున్న భారత పర్యటన సమయంలో ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలుచేస్తారు. 

ఇరుదేశాలకు చెందిన  మధ్య చిన్న, మధ్య తరహా పరిశ్రమలు -  ఎస్ ఎమ్ ఈ - ల మధ్య  సహకారాన్ని పెంపొందించాలన్నదే - ఈ అవగాహనా ఒప్పందం లక్ష్యం.    రెండు దేశాలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ ఎస్ ఎమ్ ఈ) రంగంలో పరస్పరం బలాలు, మార్కెట్లు, సాంకేతికతలు, విధానాలు మొదలైన విషయాలలో నిర్మాణాత్మకమైన ఫ్రేమ్ వర్క్, అనువైన వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది.   రెండు దేశాలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ ఎస్ ఎమ్ ఈ) రంగంలోని  ప్రతి సంస్థకు సంస్థకు మధ్య సహకారాన్ని పెంపొందించడం, సాంకేతికత బదిలీ పరంగా సుస్థిర వ్యాపార భాగస్వామ్యంలో సహాయ పడటం,  ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో ఈ ఒప్పందాన్ని ఉద్దేశించారు.   సామర్ధ్య నిర్మాణ రంగంలో సహకారం, వేగవంతమైన వ్యవస్థాపక అభివృద్ధి, ప్రదర్శనల్లో పాల్గొనడం ద్వారా ఒకరి మార్కెట్ పై మరొకరికి అవగాహన వంటి వాటిని కూడా  ఈ ఒప్పందంలో ప్రతిపాదించారు. 

ఈ సహకారం - భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ ఎస్ ఎమ్ ఈ) రంగానికి కొత్త మార్కెట్లు, ఉమ్మడి వ్యాపారాలు, ఉత్తమమైన విధానాలు, సాంకేతిక సహకారం మొదలైనవి ఇచ్చి పుచ్చుకోవడం వంటి వాటి ద్వారా కొత్త ద్వారాలను తీరుస్తుందని ఆశిస్తున్నారు.   సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ ఎస్ ఎమ్ ఈ)  మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఎన్ ఎస్ ఐ సి కి ఈ సహకారాన్ని పెంపొందించడానికి తగిన అనుభవం ఉంది.  అందువల్ల ఈ అవగాహనా ఒప్పందం అమలు చేయడానికి ఇదే సరియన సంస్థగా గుర్తించడం జరిగింది.   

                                                                                        ******



(Release ID: 1548499) Visitor Counter : 278