మంత్రిమండలి

జాతీయ మాన‌సిక ఆరోగ్య పున‌రావాస సంస్థ‌( నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ రిహాబిలిటేష‌న్‌-ఎన్‌.ఐ.ఎం.హెచ్‌.ఆర్‌)ను భోపాల్‌కు బ‌దులుగా సిహోర్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Posted On: 03 OCT 2018 6:55PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన కేంద్ర కేబినెట్‌,  జాతీయ మాన‌సిక ఆరోగ్య పున‌రావాస సంస్థ‌( నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ రిహాబిలిటేష‌న్‌)ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో ఏర్పాటు చేయాల‌ని 16-5-2018న తీసుకున్న నిర్ణ‌యాన్ని పాక్షికంగా మార్పుచేసి, దానిని సిహోర్ జిల్లా( భోపాల్‌-సిహోర్ జాతీయ‌ర‌హ‌దారి)లో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.
ప్ర‌యోజ‌నాలుః 
మాన‌సిక ఆరోగ్య పున‌రావాసంలో ఎన్‌.ఐ.ఎం.హెచ్‌.ఆర్ ఈ త‌ర‌హా సంస్థ‌ల‌లో తొలి సంస్థ‌గా ఉంటుంది. మాన‌సిక ఆరోగ్య పున‌రావాస రంగంలో ప‌రిశోద‌న‌, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధికి ఉన్న‌త ప్ర‌మాణాలుగ‌ల‌ సంస్థ‌గా సేవ‌లు అందించ‌నుంది. అలాగే ఈ సంస్థ మాన‌సిక అనారోగ్యం క‌లిగిన వారి మెరుగైన పున‌రావాసానికి సంబంధించిన న‌మూనాలు, నియ‌మాల‌ను సూచించే , సిఫార్సు చేసే సంస్థ‌గా ఉండ‌నుంది.



(Release ID: 1548497) Visitor Counter : 202