మంత్రిమండలి

ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ సి ఎ ఐ) మరియు కెన్యాకు చెందినా సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఆఫ్ కెన్యా (ఐ సి పి ఎ కె) మధ్య అవగాహన ఒప్పందానికి (ఎం ఓ యు) కాబినెట్ ఆమోదం

Posted On: 26 SEP 2018 4:14PM by PIB Hyderabad

మన దేశానికి చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ సి ఎ ఐ) మరియు కెన్యాకు చెందినా సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఆఫ్ కెన్యా (ఐ సి పి ఎ కె) మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.  ఉమ్మడి పరిశోధన, నాణ్యతా ప్రమాణాల మద్దతు, సమర్ధత, సామర్ధ్య వృద్ధి, శిక్షణలో ఉన్న అకౌంటెంట్ల మార్పిడి కార్యక్రమాలు మరియు అకౌంటెంట్ల వృత్తిపరమైన సామర్ధ్యాన్ని (సిపిడి) పెంపొందించడానికి కోర్సులు, అధ్యయన గోష్ఠులు, సదస్సులు నిర్వహించడం ద్వారా జ్ఞాన మార్పిడికి  రెండు దేశాల మధ్య ఉమ్మడి సహకారం మరియు సమన్వయం పెంపొందించడానికి ఈ ఒప్పందం  తోడ్పడుతుంది. 
వివరాలు: 
•    ఐ సి ఎ ఐ మరియు ఐ సి పి ఎ కె పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఒప్పంద భాగస్వామ్య సంస్థకు చెందిన సభ్యులకు, సిబ్బందికి తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచడం, ఉభయులు అంగీకరించిన పని క్రమం ప్రకారం పనిని అప్పగించి నియుక్తులను చేయడం
•    ఐ సి ఎ ఐ / ఐ సి పి ఎ కె మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో (ఎం ఓ యు) పొందుపరచిన విధంగా   వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు సమన్వయము బహిర్గతం అయ్యేలా  జాగృతం చేయడానికి కార్యక్రమాలను ఉమ్మడిగా ప్రోత్సహించడం 
•    ఐ సి ఎ ఐ మరియు ఐ సి పి ఎ కె సంస్థలు సమన్వయము ద్వారా శిక్షణా ప్రమాణాలను నిర్దేశించడం, శిక్షణలో ఉన్న అకౌంటెంట్ల మార్పిడి కార్యక్రమాలు నిర్వహించడం 
ఒప్పందం వల్ల ప్రభావం: 
    కెన్యాతో భారతేశానికి చాలాకాలం నుంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కెన్యాకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారు. ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. స్థూల జాతీయోత్పత్తి వృద్దిని చూసినప్పుడు కెన్యా ఆర్ధిక వ్యవస్థ  2017లో ఆఫ్రికాలో పై వరుసలో ఉందని ఆఫ్రికా దేశాలకు చెందిన ఒక నివేదికలో తెలిపారు. కెన్యా ఆర్ధిక పునాదులు వైవిధ్యభరితం.  తమ వస్తువులను భారతీయ మార్కెట్లలోకి ఎక్కువగా పంపాలని కెన్యా భావిస్తోంది. మరోవైపు కెన్యాతో విదేశీ వాణిజ్యంలో అగ్రగామి కావాలని భారత్ అభిలషిస్తోంది. 
    ఆఫ్రికాలోని అగ్రగామి ఆర్ధిక వ్యవస్థలలో కెన్యా ఒకటి కావడం వల్ల ఇటీవల కాలంలో ఉభయ దేశాల మధ్య పరస్పరం పెట్టుబడులు పెరగడం, విశ్వాసం పాదుకొనడం జరిగింది. అంతేకాక కెన్యా ఆర్ధిక ప్రగతిలో భారత  ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఇదివరకే ప్రముఖ భూమికను నిర్వహిస్తున్నారు.  అందువల్ల కెన్యాలో మున్ముందు భారతీయ ఛార్టర్డ్ అకౌంటెంట్లకు వృత్తిపరమైన అవకాశాలు ఉండే ఆస్కారం ఉంది. 
    
    
 
 



(Release ID: 1547592) Visitor Counter : 118