మంత్రిమండలి

అప్ల‌యిడ్‌ సైన్స్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీ రంగాలలో స‌హ‌కారాన్ని పెంపొందించుకోవ‌డం కోసం భార‌త‌దేశానికి, ద‌క్షిణ కొరియా కు మ‌ధ్య ఎంఒయు ప‌రిశీల‌న‌ కై మంత్రివ‌ర్గానికి నివేద‌న‌

Posted On: 26 SEP 2018 4:09PM by PIB Hyderabad

అప్ల‌యిడ్‌ సైన్స్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీ రంగాలలో స‌హ‌కారానికి గాను భార‌త‌దేశానికి, ద‌క్షిణ కొరియా కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎంఒయు) కుదిరిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం దృష్టి కి తీసుకురావ‌డ‌మైంది.  ఈ ఎంఒయు పై ద‌క్షిణ కొరియా అధ్య‌క్షులు భార‌త‌దేశాన్ని 2018వ సంవ‌త్స‌రం జులై 9వ తేదీ నాడు సంద‌ర్శించిన సంద‌ర్భంగా సంత‌కాల‌య్యాయి.

సుస్థిరాభివృద్ధి ని ప్రోత్స‌హించ‌డం తో పాటు జీవ‌న నాణ్య‌త‌ ను మెరుగుపరచే ఉద్దేశ్యాల తో అప్ల‌యిడ్ సైన్స్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీస్ రంగాలలో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డం ఈ ఎంఒయు యొక్క ల‌క్ష్యం గాను, ధ్యేయంగాను ఉంది.
 

**



(Release ID: 1547434) Visitor Counter : 70