మంత్రిమండలి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకై సవరించిన వ్యయ అంచనా కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
దేశవ్యాప్తంగా తపాలా కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలకు ఊతం
Posted On:
29 AUG 2018 1:02PM by PIB Hyderabad
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి)ని ఏర్పాటు చేయడం కోసం ప్రాజెక్టు వ్యయాన్ని 800 కోట్ల రూపాయల నుండి 1,435 కోట్ల రూపాయలకు సవరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 635 కోట్ల రూపాయల సవరించిన అదనపు వ్యయ అంచనాలలో 400 కోట్ల రూపాయలు సాంకేతిక విజ్ఞాన సంబంధమైనవి కాగా, 235 కోట్లు రూపాయలు మానవ వికాస వ్యయాలకు సంబంధించిన వ్యయాలు.
వివరాలు:
* ఐపిపిబి సేవలు 650 ఐపిపిబి శాఖల లో, 3250 యాక్సెస్ పాయింట్ల లో 2018 సెప్టెంబరు 1వ తేదీ నుండి, 2018 డిసెంబరు కల్లా మొత్తం 1.55 లక్షల తపాలా కార్యాలయాల (యాక్సెస్ పాయింట్ల)లో అందుబాటు లోకి వస్తాయి.
* ఈ పథకం బ్యాంకింగ్ ప్రవీణులతో పాటు దేశం లో ఆర్థిక అక్షరాస్యత ను పెంపొందించడం లో నిమగ్నమైన ఇతర సంస్థలను కలుపుకొని దాదాపు 3500 నూతన ఉద్యోగావకాశాలను కల్పించనుంది.
* సామాన్య మానవుడికి అత్యంత సమీపం లో, తక్కువ ఖర్చు లో, విశ్వసనీయమైన బ్యాంకు ను అందించడం; ఇంతవరకు బ్యాంకింగ్ సేవలకు నోచుకోని వారికి అవరోధాలను తొలగించి బ్యాంకింగ్ సదుపాయాన్ని వారి ఇంటి ముంగిటకు తీసుకు పోవడం ద్వారా అందరికీ ఆర్థిక సేవల కల్పన అనే ఆశయ సాధన కు తోడ్పాటు ను అందించడం ఈ పథకం ధ్యేయాలుగా ఉన్నాయి.
* ‘‘తక్కువ నగదు’’ తో కూడిన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలనే ప్రభుత్వ దార్శనికత కు ఈ పథకం అండగా నిలబడనుంది. అంతే కాకుండా ఇటు ఆర్థిక వృద్ధి ని, అటు అన్ని వర్గాలను ఆర్థిక సేవల పరిధి లోకి తీసుకు రావడాన్ని కూడా ఇది ప్రోత్సహించనుంది.
* ఐపిపిబి కై పటిష్టమైన ఐటి వ్యవస్థ ను నిర్మించడమైంది.
ఐపిపిబి సేవలు:
తపాలా విభాగం (డిఒపి ఉద్యోగులు)/ ఆఖరు వరుస లోని ప్రతినిధుల ద్వారా చెల్లింపులు/బహుళ విధ ఆర్థిక సేవలను ఐపిపిబి తన సాంకేతిక ఆధారిత సౌకర్యాల ద్వారా అందజేయనుంది. ఇది ఇంతవరకు తపాలా ను అందజేసే వారుగా మిగిలిన ఉద్యోగులను ఇక పై ఆర్థిక సేవల సరఫరాదారుల్లో అగ్రగాములుగా నిలపనుంది.
ఐపిపిబి సేవలను అందజేసినందుకు గాను ఆఖరు వరుస లోని ప్రతినిధుల (తపాలా సిబ్బంది మరియు గ్రామీణ డాక్ సేవక్ ల)కు ప్రోత్సాహకాన్ని/కమిషన్ ను ఐపిపిబి నేరు గా వారి ఖాతాల లోకి పంపించనుంది. తద్వారా ఐపిపిబి డిజిటల్ సర్వీసులను వినియోగదారులకు అందించేటట్లుగా వారికి ప్రేరేపణను అందించనుంది.
తపాలా విభాగానికి ఐపిపిబి చెల్లించిన కమిషన్ లో కొంత భాగాన్ని తపాలా కార్యాలయం లో సదుపాయాల ఉన్నతీకరణ కు వినియోగించనున్నారు.
**
(Release ID: 1544607)
Visitor Counter : 138