మంత్రిమండలి
కొత్త మెడికల్ కాలేజీ స్థాపనకోసం కార్మిక సంక్షేమ సంస్థ కింద ఉన్న జార్ఖండ్‌లోని కర్మలో గల సెంట్రల్ ఆస్పత్రిని జార్ఖండ్ ప్రభుత్వానికి బదిలీచేసే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Posted On:
09 AUG 2018 5:04PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, జార్ఖండ్‌లోని కర్మలో కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ కిందగల సెంట్రల్ ఆస్పత్రిని , దాని భూమి భవనాలతో సహా జార్ఖండ్ ప్రభుత్వానికి ఉచితంగా బదలాయించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈప్రాంతంలోని ప్రజల వైద్య ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రస్తుత జిల్లా, రెఫరల్ ఆస్పత్రులకు అనుబంధంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంనిర్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం(సిఎస్ఎస్) కింద కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమలు వ్యూహం, లక్ష్యాలు
మూడు నెలల కాలంలో సెంట్రల్ ఆస్పత్రిని దాని భూమి , భవనాలతో సహా జార్ఖండ్ ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇందుకు సంబంధించి కార్మిక, పాధి కల్పన మంత్రిత్వశాఖ, రాష్ట్రప్రభుత్వం మధ్య విధివిధానాలు, బదిలీ, సిబ్బంది విలీనం తదితరాలకు సంబంధించి ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటారు.
ప్రధాన ప్రభావంః
దీనితో దేశంలో శిక్షణ పొందే వైద్యుల సంఖ్య దేశంలో ప్రతి ఏటా పెరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఆరోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా సామాన్యుడికి మెరుగైన ఆరోగ్యసేవలు అందుతాయి.
లబ్ధిదారులుః
దీనివల్ల జార్ఖండ్‌లోని కర్మా ప్రాంతం చుట్టుపక్కల నివశించే వారందరికీ ప్రయోజనంకలుగుతుంది.వీరికి మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
నేపథ్యంః
కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ అసంఘటిత రంగంలోని కొన్ని వర్గాల కార్మికులు, వారిపై ఆధారపడిన వారికి తమ ఆస్పత్రులు, డిస్పెన్సరీల ద్వారా వైద్యసేవలు అందిస్తుంది. జార్ఖండ్‌లోని కర్మాలో మైకా మైన్, బీడీ కార్మికలు వైద్య అవసరాల నిమిత్తం కార్మిక , ఉపాధి కల్పనా శాఖ 150 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. (ఇందులో 50 పడకలు అదే ఆస్పత్రి ప్రాంగణంలోని టి.బి ఆస్పత్రికి చెందినవి). ఈ ప్రాంతంలో ఒక కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి ఈ ఆస్పత్రిని భూమి, భవనాలతో సహా ఉచితంగా తమకు బదలాయించాలని జార్ఖండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించింది.
(Release ID: 1542408)
Visitor Counter : 121