మంత్రిమండలి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కు మ‌రియు బహ్రెయిన్ కు చెందిన బహ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కు మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 18 JUL 2018 5:31PM by PIB Hyderabad

బహ్రెయిన్ లో అకౌంటింగ్, ఫైనాన్శియల్ అండ్ ఆడిట్ నాలెడ్జ్ బేస్ ను పటిష్టపరచేందుకుగాను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) మ‌రియు బహ్రెయిన్ కు చెందిన బహ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (బిఐబిఎఫ్)లు కలసి పని చేసేందుకు ఈ రెండు సంస్థల మధ్య ఓ అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఓయూ) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ముఖ్యాంశాలు:

అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ లకు సంబంధించినటువంటి బిఐబిఎఫ్ ప్రస్తుత పాఠ్యప్రణాళికను సమీక్షించి బిఐబిఎఫ్ కు ఐసిఎఐ సాంకేతిక సహాయాన్ని సమకూర్చుతుంది;
బిఐబిఎఫ్ విద్యార్థులు ఐసిఎఐ యొక్క పరీక్షను రాసి, ఐసిఎఐ లో సభ్యత్వాన్ని పొందేందుకు అనువుగా ఐసిఎఐ తన యొక్క సిఎ కోర్సు పాఠ్యప్రణాళిక ను పరిచయం చేయాలని సిఫారసు చేస్తుంది;
అర్హులైన బిఐబిఎఫ్ విద్యార్థులకు ఐసిఎఐ ప్రొఫెశనల్ ఎగ్జామినేశన్ నిర్వహణలో ఐసిఎఐ సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది;

ఐసిఎఐ సభ్యులు వారి వృత్తి రీత్యా అద‌న‌పు అవ‌కాశాలను పొందేందుకు ఒక మార్గాన్ని ఈ ఎంఓయూ తెరుస్తుంది.  మరి అదే సమయంలో స్థానిక సామర్థ్యాలను పెంపొందింపచేసుకోవడంలో ఐసిఎఐ తన వంతు సహకారాన్ని అందిస్తుంది. 

సభ్యులు, విద్యార్థులు మరియు వారి యొక్క సంస్థల హితం కోసం పరస్పరం లాభదాయకమైనటువంటి సంబంధాన్ని అభివృద్ధిపరచడానికి కలసి కృషి చేయాలన్నది దీని ధ్యేయంగా ఉంది.

లబ్ధిదారులు:

బహ్రెయిన్ లో స్థానికంగా వృత్తిపరమైనటువంటి అకౌంటెన్సీ ఇన్ స్టిట్యూట్ అనేది లేనందువల్ల బిఐబిఎఫ్ తో సమన్వయాన్ని ఐసిఎఐ ఏర్పరచుకొంటోంది కాబట్టి తత్ఫలితంగా ప్రస్తుతం బహ్రెయిన్ లో పని చేస్తున్న భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ లు ఈ ఏర్పాటు నుండి సానుకూల ప్రభావాన్ని చూపగలుగుతారు.  అలాగే, బహ్రెయిన్ కు వెళ్లి పనిచేయాలనే ఉద్దేశం ఉన్న వారికి కూడా మార్గం సుగమం కాగలదు.  ఐసిఎఐ సామర్థ్యం పట్ల, విశ్వసనీయత పట్ల నమ్మకం కలిగిన బహ్రెయిన్ అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ రంగంలో తమ దేశస్తులను తీర్చిదిద్దుకోవడంలో ఐసిఎఐ యొక్క తోడ్పాటును పొందాలని అభిలషిస్తోంది. తద్వారా, అకౌంటెన్సీ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధిపరచుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవడం కోసం సమర్థులైన అకౌంటింగ్ వృత్తిప్రవీణుల రాశిని సమకూర్చుకొని, ఈ సమస్యను పరిష్కరించుకోగోరుతోంది.


**
 



(Release ID: 1539167) Visitor Counter : 115