మంత్రిమండలి

జ‌లంధ‌ర్ కంటోన్మెంట్ లో గ‌ల స‌ర్వే నంబ‌ర్ 408 లో కేంద్రీయ విద్యాల‌య యొక్క నిర్మాణం కోసం కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ కు 7.5 ఎక‌రాల డిఫెన్స్ లాండ్ ను బ‌దిలీ చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 04 JUL 2018 2:43PM by PIB Hyderabad

జ‌లంధ‌ర్ కంటోన్మెంట్ లో గ‌ల స‌ర్వే నంబర్ 408 లో కేంద్రీయ విద్యాల‌య నంబర్ 4 యొక్క నిర్మాణం కోసం కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ (కెవిఎస్‌) కు ఒక్కొక్క సంవ‌త్స‌రానికి ఒక రూపాయి నామ‌మాత్ర‌పు అద్దె వంతున 7.5 ఎకరాల ఎ-1 డిఫెన్స్ లాండ్ ను శాశ్వ‌త ప్రాతిప‌దిక పై బ‌ద‌లాయించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.   

పూర్వ‌రంగం:

ప్ర‌స్తుతం జ‌లంధ‌ర్ కంటోన్మెంట్ లోని కేంద్రీయ విద్యాల‌య నంబర్ 4 యొక్క నిర్వహణను సర్వే నంబర్ 4 లో కుల్ వంత్ హాల్ ఎదుట ఉన్న ఎమ్ఇఎస్ భ‌వ‌నంలో తాత్కాలిక ఆవశ్యకత పేరు చెప్పి 1987 నుండి చేపట్టడం జరిగింది.  ఇది ఎ-1 డిఫెన్స్ లాండ్ కు చెందిన 26కు పైగా ఎక‌రాల లో విస్త‌రించివుంది.  జ‌లంధ‌ర్ కంటోన్మెంట్ కేంద్రీయ విద్యాల‌యనంబర్ 4 లో ప్ర‌స్తుతం 1346 మంది పిల్ల‌లు విద్యను అభ్యసిస్తున్నారు.  కెవిఎస్ సొంత శాశ్వ‌త పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మిస్తే విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న సిబ్బంది యొక్క పిల్ల‌ల విద్యావ‌స‌రాల‌ను తీర్చేందుకు, త‌గిన మౌలిక స‌దుపాయాల‌ను నిర్మించేందుకు పాఠ‌శాల అధికారుల‌కు వీలు చిక్కుతుంది.  మిగిలిన 18.5 ఎక‌రాల భూమిని పాఠ‌శాల భ‌వ‌నం నిర్మాణం ముగిసిన అనంత‌రం సైన్యానికి అప్ప‌గిస్తారు.


***


 



(Release ID: 1537852) Visitor Counter : 100