మంత్రిమండలి
ఆరోగ్య సంరక్షణ రంగం లో సహకారం అంశంపై భారతదేశానికి, బహ్రెయిన్ కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
27 JUN 2018 3:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆరోగ్య సంరక్షణ రంగం లో సహకారం అంశంపై భారతదేశం మరియు బహ్రెయిన్ ల మధ్య సంతకాలు అయిన ఒక అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు) ఆమోదం తెలిపింది.
పరిశోధన ఫలితాలు మరియు ప్రచురణలు సహా సమాచార ఆదాన ప్రదానం;
ప్రభుత్వ అధికారులు, విద్యారంగ సిబ్బంది, పండితులు, ఉపాధ్యాయులు, నిపుణులు మరియు విద్యార్థుల రాకపోకలు;
కార్యశాలలు మరియు శిక్షణ కోర్సులలో పాలుపంచుకోవడం;
ప్రైవేటు రంగంలోను, విద్యా రంగంలోను, ఆరోగ్యం ఇంకా వైద్య పరిశోధక కార్యకలాపాలకు ప్రోత్సహం అందించడంతో పాటు
ఇరు పక్షాలు పరస్పరం నిర్ణయించుకొన్న మేరకు మరే రూపాలలో అయినా సహకారం.. వంటి రంగాలలో సహకారం ఈ ఎమ్ఒయు పరిధి లో ఉంటుంది.
ఈ ఎమ్ ఒయు అమలు ను పర్యవేక్షించేందుకు సహకారం తాలూకు స్వరూపాన్ని మరింత విస్తృత పరచేందుకు ఒక కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
***
(Release ID: 1536848)
Visitor Counter : 107