మంత్రిమండలి

జ‌ల నిర్వ‌హ‌ణ, స్పేషల్ ప్లానింగ్ మ‌రియు మొబిలిటి మేనేజ్‌మెంట్ రంగంలో సాంకేతిక సంబంధ స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశానికి మ‌రియు నెద‌ర్లాండ్స్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎంఓయూ) పొడిగింపున‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 06 JUN 2018 3:29PM by PIB Hyderabad

జ‌ల నిర్వ‌హ‌ణ, స్పేషల్ ప్లానింగ్ మ‌రియు మొబిలిటి మేనేజ్‌మెంట్ రంగంలో సాంకేతిక సంబంధ స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశానికి మ‌రియు నెద‌ర్లాండ్స్ కు మ‌ధ్య 2018 ఏప్రిల్ నెల‌ లో సంత‌కాలైన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎమ్ఒయు) ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన  కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం దృష్టి కి తీసుకురావ‌డ‌మైంది.  

వివరాలు  

జ‌ల నిర్వ‌హ‌ణ, స్పేషల్ ప్లానింగ్ మ‌రియు మొబిలిటి మేనేజ్‌మెంట్ రంగాల‌లో సంతకందారు సంస్థల నడుమ సహకారాన్ని స‌మ ప్రాతిప‌దిక‌న ప్రోత్సహించడం మరియు పటిష్టపరచడం ఈ ఎమ్ఒయు యొక్క ధ్యేయం.  త‌క్కువ ఖ‌ర్చుతో పూర్తి అయ్యే గృహ నిర్మాణం, స్మార్ట్ సిటీ డివెల‌ప్‌మెంట్‌, నీటి సరఫరా మరియు ముగురు నీటి పారుదల వ్యవస్థ ల కొరకు జియోగ్ర‌ఫిక‌ల్ ఇన్‌ఫ‌ర్ మేశన్ సిస్ట‌మ్ (జిఐఎస్‌), ఇంకా వ్య‌ర్థ జ‌లాల పున‌ర్ వినియోగం, కృత్రిమ పద్ధతులలో జలాశయాల నీటి మట్టాన్ని పెంచడం ద్వారా తాజా నీటిని సంరక్షించుకోవడం, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లతో పాటు వారసత్వ సంరక్షణ త‌దిత‌ర అంశాల‌లో ఉభ‌య దేశాల ఆచ‌ర‌ణాత్మ‌క అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొంటూ ఇరు పక్షాలకు లాభం చేకూరేటట్లు చూడడం కూడా ఈ ఎంఒయూ ధ్యేయాలలో భాగంగా ఉంది.   

అమ‌లు సంబంధిత వ్యూహం  

ఈ ఎమ్ఒయు లో భాగంగా కార్య‌క్ర‌మాల అమ‌లుకు ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందం (జెడ‌బ్ల్యుజి) ని ఏర్పాటు చేయ‌నున్నారు.  ఈ సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందం ఒక సంవ‌త్స‌రం నెద‌ర్లాండ్స్ లో, ఆ త‌రువాతి సంవ‌త్స‌రం భార‌త‌దేశం లో స‌మావేశ‌మ‌వుతుంది.


లబ్ధిని అందుకొనే వర్గాలు

ఈ ఎంఓయూ జ‌ల నిర్వ‌హ‌ణ స్పేషల్ ప్లానింగ్ మ‌రియు మొబిలిటి మేనేజ్‌మెంట్, స్మార్ట్  సిటీ స్ డివెల‌ప్‌మెంట్‌, త‌క్కువ ఖ‌ర్చుతో పూర్తి అయ్యే గృహ నిర్మాణం, వ్యర్ధాల నిర్వహణ, అర్బన్ ఎన్ వైరన్ మెంట్ మరియు వారసత్వ పరిరక్షణ రంగాల‌లో ఉపాధి అవకాశాలను సృష్టించగలదని ఆశిస్తున్నారు.


***



(Release ID: 1534600) Visitor Counter : 78