మంత్రిమండలి

పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని నిర్మూలించేందుకు పొగాకు నియంత్రణ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఫ్రేమ్ వర్క్ కన్ వెన్శన్ లో రూపొందిన ప్రోటోకాల్ యొక్క స్వీకారానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 02 MAY 2018 3:30PM by PIB Hyderabad

పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని నిర్మూలించేందుకు పొగాకు నియంత్రణ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఫ్రేమ్ వర్క్ కన్ వెన్శన్ లో రూపొందిన ప్రోటోకాల్ యొక్క స్వీకారానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ ఆమోదం ధూమపానం లేదా పొగాకును నమలడం మరియు స్మోక్ లెస్ టుబాకో (ఎస్ ఎల్ టి) రెండింటికీ- పొగాకు నియంత్రణపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్ కన్ వెన్శన్ ఆన్ టుబాకో కంట్రోల్ (డబ్ల్యుహెచ్ఒ ఎఫ్ సిటిసి) లోని 15వ నిబంధన కింద చర్చించి, ఆమోదించిన మేరకు- వర్తిస్తుంది.  డబ్ల్యుహెచ్ఒ ఎఫ్ సిటిసి) లో భారతదేశం ఒక భాగస్వామిగా ఉంది.

 వివరాలు:

భాగస్వామ్య దేశాల బాధ్యతల క్రమాన్ని ఈ ప్రోటోకాల్ నిర్దేశిస్తుంది. ఆ మేరకు భాగస్వాములు చేపట్టాల్సిన సరఫరా శృంఖల నియంత్రణ చర్యలను వివరిస్తుంది.  దీని ప్రకారం పొగాకు ఉత్పత్తుల తయారీకి లైసెన్సుల విధానం, ఉత్పత్తుల తయారీ యంత్ర పరికరాలు, ఉత్పత్తి కార్యకలాపాలలో ఉన్న సంస్థల సముచిత విచక్షణ, వ్యవస్థ అనుసరణ, పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, భద్రత లతో పాటు ఆన్ లైన్ వాణిజ్యం, స్వేచ్ఛా వాణిజ్య మండళ్లలో ఉత్పత్తి, సుంకంరహిత అమ్మకాలు తదితరాలకు సంబంధించిన నిబంధనలను భాగస్వామ్య దేశాలు పాటించవలసివుంటుంది.

వివిధ నేరాలు, ఉత్పత్తుల జప్తు, జప్తు చేసిన ఉత్పత్తుల నిర్వహణ తదితరాలను కూడా ఈ నియమావళి నిర్దేశించింది.  ఆ మేరకు సమాచార ఆదాన ప్రదానం లో అంతర్జాతీయ సహకారం సహా గోప్యత నిర్వహణ, శిక్షణ, సాంకేతిక తోడ్పాటు, శాస్త్ర-సాంకేతిక, విజ్ఞాన ప్రదానాంశాలు వంటి వాటిలో సహకారాన్ని సూచిస్తోంది.

ప్రభావం:

నియమాలను పటిష్టపరచడం ద్వారా పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపార నిర్మూలన వల్ల పొగాకు నియంత్రణను బలోపేతం చేయడంలో తోడ్పాటు లభించగలదు. మరి ఈ కారణంగా పొగాకు వినియోగం తగ్గగలదు.  తత్ఫలితంగా వ్యాధుల వ్యాప్తి తగ్గడంతో పాటు పొగాకు వినియోగంతో ముడిపడిన మరణాల సంఖ్య కూడా  తగ్గగలదు. 

ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పొగాకు అక్రమ వ్యాపారాలపై ప్రత్యామ్నాయ చర్యలకు ఇటువంటి ఒప్పందానికి ఆమోదం తెలపడం వల్ల వీలు కలుగుతుంది.  భారతదేశం ప్రత్యేకించి పొగాకు నియంత్రణ లో ముందంజలో ఉంది.  అందువల్ల అక్రమ వ్యాపార నియంత్రణలో ప్రపంచ సుంకాల సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థ లను ఎంతగానో ప్రభావితం చేయగలుగుతుంది.

పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని నిర్మూలించేలా పొగాకు పై అంతర్జాతీయ కార్యాచరణ ను బలోపేతం చేసే ఈ నియమావళి అత్యంత వినూత్నమైనటువంటిది.  అలాగే ప్రజారోగ్య రక్షణకు ఇది ఒక చట్టబద్ధమైన ఉపకరణం కాగలదు.  పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపార నిర్మూలనతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య సహకారానికి సంబంధించిన చట్టబద్ధ కోణాల బలోపేతానికి ఇదొక సమగ్ర సాధనం అవుతుంది.

పూర్వరంగం:

పొగాకు నియంత్రణ, ఉత్పత్తుల అక్రమ వ్యాపార నిర్మూలన కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యాన రూపొందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రేమ్ వర్క్ కన్ వెన్శన్ లో రూపొందిన ప్రోటోకాల్ ను మొట్టమొదటి అంతర్జాతీయ ప్రజారోగ్య ఒప్పందంగా పరిగణించాలి.  అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో పొగాకు నియంత్రణ దిశగా ఆ ఉత్పత్తుల సరఫరాను, గిరాకీని తగ్గించే పటిష్ఠమైనటువంటి చర్యలను చేపట్టడమే ఈ ప్రోటోకాల్ ప్రధాన లక్ష్యం.  అన్ని రూపాలలోని పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం మరియు ఉత్పత్తుల విక్రయాల నిర్మూలన దిశగా పొగాకు సరఫరా తగ్గింపు వ్యూహాలు ఈ ప్రోటోకాల్ లోని 15వ  నిబంధన కింద పొందుపరచబడడం ఇందులోని కీలకాంశం.  దొంగరవాణా, ఉత్పత్తుల అక్రమ-నకిలీల తయారీ వంటి వాటిని ఇది సమర్థంగా నిరోధిస్తుంది.  తదనుగుణంగా ఎఫ్ సిటిసి ని నిర్దేశించే భాగస్వామ్య దేశాలు (సిఒపి) సదరు నియమావళి ని రూపొందించి, ఆమోదించాయి.  మొత్తం పది భాగాలుగా ఉన్న ఈ ప్రోటోకాల్ లో 47 నిబంధనలు ఉన్నాయి.


***
 



(Release ID: 1531171) Visitor Counter : 109