మంత్రిమండలి

పెట్రోలియ‌మ్ & సేఫ్టీ ఆర్గ‌నైజేష‌న్ (పిఇఎస్ఒ) లో కాడ‌ర్ రివ్యూ కు మ‌రియు ఇండియ‌న్ పెట్రోలియ‌మ్ & ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ స‌ర్వీస్ (ఐపిఇఎస్ఎస్‌) పేరిట టెక్నిక‌ల్ కేడ‌ర్ యొక్క గ్రూప్ ‘ఎ’ స‌ర్వీసు ను ఏర్పాటు చేయ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 02 MAY 2018 3:35PM by PIB Hyderabad

పెట్రోలియ‌మ్ & సేఫ్టీ ఆర్గ‌నైజేష‌న్ (పిఇఎస్ఒ) లో కాడ‌ర్ రివ్యూ కు మ‌రియు ఇండియ‌న్ పెట్రోలియ‌మ్ & ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ స‌ర్వీస్ (ఐపిఇఎస్ఎస్‌) పేరిట టెక్నిక‌ల్ కేడ‌ర్ యొక్క గ్రూప్ ‘ఎ’ స‌ర్వీసు ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణ‌యం సంస్థ‌ లో సిబ్బంది సంఖ్య‌ను మ‌రియు ద‌క్ష‌త ను పెంచ‌నుంది;  అలాగే, సంస్థ లో గ్రూప్ ‘ఎ’ అధికారుల వృత్తి జీవ‌నం పురోగమించేందుకు కూడా బాట వేయ‌నుంది.

పూర్వ‌రంగం:

పిఇఎస్ఒ అనేది పారిశ్రామిక విధానం మ‌రియు ప్రోత్సాహాల విభాగం (డిఐపిపి) ప‌రిధిలో ప‌నిచేసే ఒక కింది స్థాయి కార్యాల‌యం.  ఈ సంస్థ పేలుడు ప‌దార్థాలు, కంప్రెస్‌డ్ గ్యాసెస్ ఇంకా పెట్రోలియ‌మ్ ల వంటి ప‌దార్థాల తాలూకు భ‌ద్ర‌త‌ను నియంత్రించేందుకు ఒక నోడ‌ల్ ఏజెన్సీ గా ఏర్పాటై, 1898 నుండి దేశ ప్ర‌జ‌ల‌కు సేవలు అందిస్తూ వ‌స్తోంది.  కాల‌క్ర‌మంలో పిఇఎస్ఒ యొక్క బాధ్య‌తలు మ‌రియు పాత్ర బ‌హుముఖాలుగా విస్తరించి వివిధ రంగాల‌లోకి వ్యాపించాయి.  ప్ర‌స్తుతం ఈ సంస్థ పేలుడు ప‌దార్థాలు, పెట్రోలియ‌మ్‌, కంప్రెస్‌డ్ గ్యాసెస్‌, ప్రెష‌ర్ వెసల్స్‌, గ్యాస్ సిలిండ‌ర్ లు, దేశాంత‌ర గొట్ట‌పు మార్గాలు, ద్ర‌వీకృత స‌హ‌జ వాయువు (ఎల్ఎన్‌జి), కంప్రెస్‌డ్ నేచుర‌ల్ గ్యాస్ (సిఎన్‌జి), ఆటో లిక్విఫైడ్ పెట్రోలియ‌మ్ గ్యాస్ (ఆటో ఎల్‌పిజి) తదితర విస్తృత శ్రేణి అంశాల‌ను పరిష్కరిస్తోంది.  అనేక రెట్ల మేరకు హెచ్చిన పని భారం లైసెన్స్ డ్ ప్రెమిసిజ్ ల మరియు ఇత‌ర కార్య‌క‌లాపాల‌ సంఖ్య అమాంతం పెరగడంలో ద్యోతకమవుతోంది.

పిఇఎస్ఒ లో ప్ర‌స్తుతం మంజూరు అయినటువంటి టెక్నిక‌ల్ గ్రూప్ ‘ఎ’ కాడ‌ర్  పోస్టులు 137 గా ఉన్నాయి. ఇందులో జూనియ‌ర్ టైమ్ స్కేల్ (జెటిఎస్‌) స్థాయి అధికారుల పోస్టులు 60, సీనియ‌ర్ టైమ్ స్కేల్ (ఎస్‌టిఎస్‌) స్థాయి అధికారుల పోస్టులు 46, జూనియ‌ర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (జెఎజి) స్థాయి అధికారుల (లెవెల్ 12) పోస్టులు 23, జెఎజి లెవ‌ల్ ఆఫీస‌ర్స్ (లెవెల్ 13) పోస్టులు 7 తో పాటు, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్ అనే పేరు కలిగిన సీనియ‌ర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ఎజి) లెవెల్ పోస్టు ఒక‌టి ఉన్నాయి.  

అన్ని గ్రేడుల‌లోనూ తీవ్ర‌ స్తబ్ధతను తొల‌గించేందుకు మరియు వర్క్ ఫోర్స్ లో ధైర్యాన్ని పెంపొందించేందుకు పిఇఎస్ఒ లో గ్రూప్ ‘ఎ’ స‌ర్వీసుకు చెందిన టెక్నిక‌ల్ కాడ‌ర్ ను ఐపిఇఎస్ఎస్ పేరిట నెల‌కొల్పాల‌ని,  కొత్త‌గా ఏర్పాటు చేసిన స‌ర్వీసును పున‌: వ్య‌వ‌స్థీక‌రించాల‌ని నిర్ణ‌యించ‌డ‌మైంది.  ఇందులో భాగంగా లెవెల్- 13 లో 5 పోస్టుల‌ను, లెవెల్-12 లో 3 పోస్టుల‌ను పెంచుతారు; తత్సమానంగా లెవెల్-11 లో 8 పోస్టుల‌ను త‌గ్గిస్తారు కూడా.


***



(Release ID: 1531046) Visitor Counter : 110