Economy
చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధి నిధి
प्रविष्टि तिथि:
06 OCT 2026 19:04 PM
భారత భవిష్యత్ విజేతలకు మూలధన సహాయం
ఎస్ఎంఈల వృద్ధి కోసం మూలధనంతో కొత్త ప్రోత్సాహం
ఎస్ఎంఈల వర్గీకరణ
ప్లాంటు, యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి, వార్షిక టర్నోవర్ ఆధారంగా సంస్థలను సూక్ష్మ, చిన్న లేదా మధ్య తరహా సంస్థలుగా వర్గీకరిస్తారు. 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన తాజా ప్రమాణాల ప్రకారం ₹25 కోట్ల వరకు పెట్టుబడి, ₹100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సంస్థను చిన్న సంస్థగా పరిగణిస్తారు. ₹125 కోట్ల వరకు పెట్టుబడి, ₹500 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సంస్థను మధ్య తరహా సంస్థగా పరిగణిస్తారు.
ఉపాధి, ఎగుమతులు, ఉత్పత్తి, ఆవిష్కరణలకు తోడ్పడే చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. వాటి వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ఎస్ఎంఈ వృద్ధి నిధి (ఎస్జీఎఫ్) ఏర్పాటుకు ₹10 వేల కోట్ల పెట్టుబడి హామీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
వ్యాపారపరమైన స్థిరత్వం, విస్తరణ సామర్థ్యాన్ని నిరూపించుకున్న అధిక అవకాశాలు కలిగిన ఎస్ఎంఈలకు ఈ నిధి దీర్ఘకాలిక ఈక్విటీ మూలధనాన్ని అందిస్తుంది. తయారీ, సేవలు, సాంకేతికత, ఆవిష్కరణ ఆధారిత రంగాలు, వ్యూహాత్మక విలువ గొలుసుల్లో అగ్రగామి సంస్థలు ఎదిగేందుకు మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం.
2026–27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన సమగ్ర చర్యల్లో భాగంగా ఎంఎస్ఎంఈ వ్యవస్థకు ఈక్విటీ, నగదు లభ్యత, వృత్తిపరమైన సహాయం అందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది.
భారత్ ఎంఎస్ఎంఈ వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థకు సహకారం: ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 31.1 శాతం, తయారీ ఉత్పత్తిలో 35.4 శాతం, ఎగుమతుల్లో 48.58 శాతం.
విస్తరిస్తున్న వ్యవస్థీకృత ఎంఎస్ఎంఈ పునాది: 2026 అక్టోబర్ 6 నాటికి ఉద్యం, ఉద్యం అసిస్ట్ వేదిక (యూఏపీ) కింద మొత్తం ఎంఎస్ఎంఈ నమోదులు దాదాపు 9.78 కోట్లకు చేరాయి. నమోదిత ఎంఎస్ఎంఈలు దాదాపు 43.28 కోట్ల ఉపాధి అవకాశాలను నివేదించాయి.
ఎంఎస్ఎంఈల్లో మహిళల భాగస్వామ్యం: మొత్తం నమోదుల్లో మహిళల యాజమాన్యంలోని సంస్థల వాటా 37.6 శాతం.
ప్రధాన ఆర్థిక కార్యకలాపాల్లో ఎంఎస్ఎంఈలు: నమోదిత సంస్థలు వాణిజ్యం, సేవలు, తయారీ రంగాల్లో విస్తరించి ఉన్నాయి. దాదాపు 4.08 కోట్ల నమోదులతో వాణిజ్య రంగం ముందుంది. ఆ తర్వాత 3.77 కోట్లతో సేవలు, 1.93 కోట్లతో తయారీ రంగం ఉన్నాయి.

ఎస్ఎంఈ వృద్ధి నిధి కార్యాచరణ చట్రం
ఏఐఎఫ్లు అంటే ఏమిటి?
భారత్లో ఏర్పాటై, పెట్టుబడిదారుల నుంచి నిధులను సమీకరించి, నిర్దేశిత విధానం ప్రకారం పెట్టుబడులు పెట్టే ప్రైవేటు సమీకృత నిధిని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్) అంటారు.
పెట్టుబడి నిర్మాణం, ఎంపిక
ఎస్ఎంఈ వృద్ధి నిధిని ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడి నిధిగా రూపొందించారు. ఎస్జీఎఫ్ చట్రం కింద ఏర్పాటయ్యే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్) రూపంలో ఇది పనిచేస్తుంది.
ఎస్ఎంఈ వృద్ధి నిధి వ్యూహాత్మక ప్రాధాన్యాలు
1. తయారీ రంగానికే ప్రధాన ప్రాధాన్యం: ఎస్ఎంఈ వృద్ధి నిధిలో అధిక భాగాన్ని తయారీపై దృష్టి సారించే చిన్న, మధ్య తరహా సంస్థలకు కేటాయిస్తారు.
తయారీ సామర్థ్యాన్ని విస్తరించడం, అధునాతన సాంకేతికతలను స్వీకరించడం, ఉత్పాదకతను పెంచడం, ఎగుమతి పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోరుకునే సంస్థలకు ఈ నిధి మద్దతు ఇస్తుంది.
2. పారిశ్రామిక క్లస్టర్లకు వృద్ధి విస్తరణ: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో పనిచేసే ఎస్ఎంఈలను కూడా నిధి పరిధిలో పరిగణిస్తారు.
తద్వారా సమతుల ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక సరఫరా గొలుసుల బలోపేతం, నాణ్యమైన ఉపాధి అవకాశాల సృష్టికి మద్దతు లభిస్తుందని అంచనా.
ఎస్ఎంఈలకు ప్రత్యేక వృద్ధి నిధి ఎందుకు అవసరం?
ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు విస్తృతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈక్విటీ నిధులు ప్రధానంగా ప్రారంభ దశలోని సూక్ష్మ సంస్థలపైనే దృష్టి సారిస్తున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థలకు వృద్ధి ఈక్విటీ మూలధనాన్ని మరింత విస్తృతంగా అందించాల్సిన అవకాశం ఉందని ఇది సూచిస్తోంది.
ఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని భావించే దశలో ఇటువంటి మూలధనం కీలకంగా మారుతుంది. వృద్ధి ప్రయాణంలో కీలక మలుపులను అధిగమించి, భారీ స్థాయి కార్యకలాపాలు, మెరుగైన పోటీ సామర్థ్యం వైపు వెళ్లేందుకు సంస్థలకు ఇది తోడ్పడుతుంది. ఆశాజనకమైన ఎస్ఎంఈలు పరిశ్రమల్లో అగ్రగాములుగా ఎదిగేందుకు ఈ పెట్టుబడులు సహాయపడతాయి.
దీర్ఘకాలిక వృద్ధి మూలధనం ఎస్ఎంఈల విస్తరణకు ఎలా తోడ్పడుతుంది?
- కార్యకలాపాలను విస్తరించడం
- ఇతర సంస్థలను కొనుగోలు చేయడం
- ఆవిష్కరణలను ప్రోత్సహించడం
- ప్రపంచ విలువ గొలుసుల్లో భాగం కావడం
- అధునాతన సాంకేతికతను స్వీకరించడం
- వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం
- తయారీ సామర్థ్యంలో పెట్టుబడులు పెట్టడం
- అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించడం

ఆవిష్కరణలు, వృద్ధి, ఉపాధిపై ప్రభావం
కీలక రంగాల్లో అధిక వృద్ధి అవకాశాలు కలిగిన ఎస్ఎంఈల పురోగతిని ఈ నిధి బలోపేతం చేస్తుందని అంచనా. సంస్థల విస్తరణ, పోటీ సామర్థ్యం, ఉపాధి కల్పన వరకు దీని ప్రభావం ఉండాలని లక్ష్యంగా నిర్ణయించారు.
- జాతీయ ప్రాధాన్యం కలిగిన రంగాల్లో పనిచేసే సంస్థలకు ఈ నిధి మద్దతు ఇస్తుందని అంచనా.
- ఎస్ఎంఈలు సామర్థ్యాన్ని పెంచుకుని కార్యకలాపాలను విస్తరించేందుకు తోడ్పడి, ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తుంది.
- రంగాలవారీ అగ్రగాములుగా ఎదిగేందుకు అవసరమైన స్థాయి, తయారీ సామర్థ్యం, పోటీ శక్తి కలిగిన భారత కంపెనీల బలమైన శ్రేణిని నిర్మించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఎంఎస్ఎంఈలకు విస్తృత సహాయక వ్యవస్థ
ఆర్థిక సహాయం, ఉపాధి కల్పన, నైపుణ్యాలు, సాంకేతికత, సమగ్ర సహాయం, ప్రభుత్వ కొనుగోళ్లు వంటి పలు రంగాల్లో ఎంఎస్ఎంఈలకు మద్దతు లభిస్తోంది.
|
ప్రధాన రంగం
|
అమలు చేస్తున్న కీలక పథకాలు
|
|
రుణాలు, ఆర్థిక సహాయం
|
సూక్ష్మ, చిన్న సంస్థల రుణ హామీ నిధి ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ)
|
|
ఉపాధి కల్పన
|
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)
|
|
సమగ్ర సహాయం
|
పీఎం విశ్వకర్మ
|
|
శిక్షణ, ఔత్సాహికత అభివృద్ధి
|
ఎంఎస్ఎంఈ నైపుణ్య శిక్షణ, ఔత్సాహికత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (ఈఎస్డీపీ), ఆస్పైర్
|
|
సాంకేతిక మౌలిక సదుపాయాలు, సాధికారత
|
రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్), జీరో డిఫెక్ట్–జెడ్ పథకం, టూల్ రూమ్, టెక్నాలజీ సెంటర్
|
|
ప్రభుత్వ కొనుగోళ్లు
|
ఎంఎస్ఎంఈ సంబంధ్, ఎస్సీ–ఎస్టీ హబ్
|
ముగింపు
సంస్కరణలు, డిజిటలీకరణ, రుణ సహాయం, వ్యాపార నిర్వహణ సౌలభ్య చర్యల ద్వారా ఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు ఎస్ఎంఈ వృద్ధి నిధి తోడ్పడుతుంది. పెట్టుబడులకు ఊతమివ్వడం ద్వారా ఆవిష్కరణ ఆధారిత పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తూ ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్@2047 దార్శనికతను ముందుకు తీసుకెళ్తుంది.
చిన్న సంస్థలకు అందించే ఈ మద్దతు దేశవ్యాప్తంగా అవకాశాలను విస్తరించి, వృద్ధిని మరింత సమ్మిళితం చేయాలన్న భారత్ విస్తృత ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోంది.
References
Cabinet:
https://www.pib.gov.in/PressReleasepage.aspx?PRID=2319532®=48&lang=1
Ministry of Micro, Small & Medium Enterprises (MSME):
https://www.msme.gov.in/ministry/about-us/details/Title%3DWhat%27s-MSME-IzMzITMtQWa
https://dashboard.msme.gov.in/
Securities and Exchange Board of India:
https://www.sebi.gov.in/sebi_data/faqfiles/jan-2017/1485861425527.pdf
PIB Archives:
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?ModuleId=16&NoteId=150826&id=150826&lang=2®=48
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 151102)
आगंतुक पटल : 1
Provide suggestions / comments