Economy

పీఎం ఈ-డ్రైవ్ పథకం

प्रविष्टि तिथि: 01 OCT 2026 19:33 PM

సుస్థిర భవిష్యత్తు వైపు ముంద‌డుగు
లక్ష్యిత విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, సహాయక చర్యలతో విద్యుత్ వాహనాల వినియోగం వేగం పుంజుకుంటోంది. ఈ మార్పులో 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమైన పీఎం ఈ-డ్రైవ్ పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, దేశీయ విద్యుత్ వాహనాల తయారీ వ్యవస్థను బలోపేతం చేయడం దీని లక్ష్యాలు. ₹11,900 కోట్ల వ్యయ కేటాయింపుతో, 2028 మార్చి వరకు అమలు కాలాన్ని పొడిగించిన ఈ పథకం వివిధ రకాల విద్యుత్ వాహనాలకు, మౌలిక సదుపాయాలకు మద్దతు అందిస్తుంది. సుమారు 28.30 లక్షల విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ పథకం మద్దతు ఇస్తోంది. 2026 జూన్ నాటికి 26.59 లక్షల వాహనాల విక్రయాలకు తోడ్పడింది. ఈ-బస్సులు, ఛార్జింగ్ కేంద్రాలు, పరీక్షా సదుపాయాలకు కూడా మద్దతు అందిస్తూ దేశవ్యాప్తంగా మరింత పరిశుభ్రమైన, సుస్థిర రవాణాను ప్రోత్సహిస్తోంది.

విద్యుత్ వాహనాల వినియోగం వైపు భారత్ అడుగులు
దేశం వేగంగా విద్యుత్ వాహనాల వినియోగం వైపు పయనిస్తోంది. విద్యుత్ వాహనాల (ఈవీ) స్వీకరణ గణనీయంగా పెరుగుతోంది. లక్ష్యిత విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, నిర్దిష్ట లక్ష్యాలతో చేపట్టిన కార్యక్రమాలు ఈ మార్పును మరింత బలోపేతం చేస్తున్నాయి.

ఈ కృషిలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీమ్ (పీఎం ఈ-డ్రైవ్ పథకం) ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2024 అక్టోబర్ నుంచి అమలవుతున్న ఈ పథకం కొనుగోలు సమయంలోనే ప్రోత్సాహకాలు అందించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా విద్యుత్ వాహనాల స్వీకరణను వేగవంతం చేస్తోంది. సుస్థిరతను ప్రోత్సహించడంతోపాటు రవాణా వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం కూడా ఈ పథకం లక్ష్యాలు.
 
పీఎం ఈ-డ్రైవ్ పథకం వివరాలు
పీఎం ఈ-డ్రైవ్ పథకం దేశవ్యాప్తంగా అమలవుతోంది. మొదట రెండేళ్ల కాలానికి నోటిఫై చేసిన ఈ పథకం అమలు కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించారు.
- పథకం మొత్తం వ్యయ కేటాయింపు ₹11,900 కోట్లు.
- వివిధ వాహన విభాగాలకు, సంబంధిత అంశాలకు కొనుగోలును ప్రోత్సహించే రాయితీలు, మౌలిక సదుపాయాల మద్దతు అందిస్తుంది.
  - ఇందులో విద్యుత్ ద్విచక్ర వాహనాలు (ఈ-2డబ్ల్యూలు), రిజిస్ట్రేషన్ చేసిన ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, ఎల్5 సహా విద్యుత్ త్రిచక్ర వాహనాలు (ఈ-3డబ్ల్యూలు), ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఈ-బస్సులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, పరీక్షా సంస్థల ఆధునీకరణ ఉన్నాయి.
  - రిజిస్ట్రేషన్ చేసిన ఈ-2డబ్ల్యూలకు కిలోవాట్-గంటకు ₹2,500 ప్రోత్సాహకం లభిస్తుంది. ఒక్కో వాహనానికి గరిష్ఠ పరిమితి ₹5,000. ఫ్యాక్టరీ వద్ద ధర ₹1.5 లక్షల వరకు ఉన్న వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఈ విభాగానికి మొత్తం ₹2,767 కోట్ల నిధులు కేటాయించారు. రిజిస్ట్రేషన్ చేసిన 45.79 లక్షలకు పైగా ఈ-2డబ్ల్యూలకు మద్దతు అందించడం పథకం లక్ష్యం.
  - రిజిస్ట్రేషన్ చేసిన ఈ-3డబ్ల్యూ (ఎల్5) ఉపవిభాగంలో నిర్దేశిత విక్రయ లక్ష్యాలను సాధించారు. దీంతో 2025 డిసెంబర్ 26న ఈ విభాగాన్ని ముగించారు.
  - ఈ-3డబ్ల్యూలకు (ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు) మద్దతు 2028 మార్చి వరకు కొనసాగుతుంది.

 

 

 


 
పీఎం ఈ-డ్రైవ్ పథకం ప్రధాన విజయాలు
- సుమారు 28.30 లక్షల విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించేందుకు పీఎం ఈ-డ్రైవ్ మద్దతు ఇస్తోంది.
- 2026 జూన్ నాటికి 26.59 లక్షల విద్యుత్ వాహనాల విక్రయాలు జరిగాయి.
- పీఎం ఈ-డ్రైవ్ కింద 14,028 ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ₹4,391 కోట్లు కేటాయించారు. వీటిలో 2026 ఆగస్టు నాటికి 14,000 ఈ-బస్సుల కేటాయింపు పూర్తయింది.
  - దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, అహ్మదాబాద్, పుణె, సూరత్ నగరాలకు 13,800 ఈ-బస్సులను కేటాయించారు.
- విద్యుత్ వాహనాల ప్రజా ఛార్జింగ్ కేంద్రాల (ఈవీ పీసీఎస్) ఏర్పాటు, పరీక్షా సంస్థల ఆధునీకరణకు కూడా గ్రాంట్ల రూపంలో మద్దతు అందుబాటులో ఉంది.
  - దేశవ్యాప్తంగా ఈవీ పీసీఎస్ ఏర్పాటు కోసం ₹2,000 కోట్లు కేటాయించారు.
  - 2026 సెప్టెంబర్ 28 నాటికి 3 చమురు మార్కెటింగ్ కంపెనీలు, 10 రాష్ట్రాల్లో 8,147 ఛార్జర్ల ఏర్పాటు కోసం ₹851 కోట్లకు ఆమోదం తెలిపారు.
  - వాహన పరీక్షా సంస్థల ఆధునీకరణ, సామర్థ్యాల మెరుగుదలకు ₹780 కోట్లు కేటాయించారు.

 


 
విద్యుత్ వాహనాల వ్యవస్థపై ప్రభావం
పీఎం ఈ-డ్రైవ్ కింద ప్రభుత్వ మద్దతు విద్యుత్ వాహనాల విస్తృత వినియోగం, పరిశుభ్రమైన రవాణా, భారత విద్యుత్ వాహనాల తయారీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతోంది.
కొనుగోలుదారులకు
- కొనుగోలు సమయంలోనే అందించే ప్రోత్సాహకాలు అర్హత కలిగిన విద్యుత్ వాహనాల కొనుగోలు ధరను తగ్గిస్తాయి. దీంతో విద్యుత్ వాహనాల వినియోగానికి అవసరమైన ప్రారంభ వ్యయం తగ్గుతుంది.
- ఈ-వౌచర్ల ద్వారా అర్హులైన కొనుగోలుదారులకు కొనుగోలు ప్రోత్సాహకం వాహనం కొనే సమయంలోనే ధర తగ్గింపు రూపంలో లభిస్తుంది. అనంతరం ఆ మొత్తాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్‌కు (ఓఈఎం) తిరిగి చెల్లిస్తుంది.
నగరాలకు
- విద్యుత్ బస్సులు, ఇతర విద్యుత్ వాహన విభాగాల ద్వారా మరింత పరిశుభ్రమైన, సుస్థిర రవాణా వైపు మార్పుకు ఈ పథకం మద్దతు ఇస్తుంది.
పరిశ్రమలకు
- పీఎం ఈ-డ్రైవ్ భారత దేశీయ విద్యుత్ వాహనాల తయారీ వ్యవస్థ అభివృద్ధికి మద్దతు ఇస్తూ, ఈవీ మోడళ్ల స్థానికీకరణను ప్రోత్సహిస్తుంది.
- పథకం కింద నమోదైన ఓఈఎంలు తమ ఈవీ మోడళ్లను స్థానికీకరించి, ఎంహెచ్‌ఐ పరీక్షా సంస్థల నుంచి ఫేజ్డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ) నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువపత్రాలు పొందాయి.
- వాహన పరీక్షా సంస్థల ఆధునీకరణ, సామర్థ్యాల మెరుగుదలకు ₹780 కోట్లు ఈ పథకం అందిస్తుంది. తద్వారా వాటికి కొత్తగా అందుబాటులోకి వస్తున్న, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సమకూరుస్తుంది.

పరిశుభ్రమైన రవాణా భవిష్యత్తు వైపు
సుస్థిర రవాణాను వేగవంతం చేస్తూనే పర్యావరణం, ఇంధన భద్రతకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు పీఎం ఈ-డ్రైవ్ తోడ్పడుతోంది. విద్యుత్ వాహనాల స్వీకరణ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు అందించడం ద్వారా మరింత పరిశుభ్రమైన, సుస్థిర రవాణా వైపు భారత ప్రయాణాన్ని ఈ పథకం బలోపేతం చేస్తోంది.

 

References

Ministry of Heavy Industries

https://pmedrive.heavyindustries.gov.in/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290696&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2053959&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2053889&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2298052&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287125&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260368&reg=3&lang=1

https://pmedrive.heavyindustries.gov.in/docs/policy_document/Gazette%20Notification%2010%2008%202026%20on%20enhancement%20of%20Outlay%2011900%20cr.pdf 

https://heavyindustries.gov.in/sites/default/files/2025-07/psm_approved_sops.pdf

Cabinet

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2053889&reg=48&lang=2

PIB Archives

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294688&reg=48&lang=1

 

Please See PDF

***

(तथ्य सामग्री आईडी: 151074) आगंतुक पटल : 35


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Bengali , Malayalam , Assamese , Kannada