• Sitemap
  • Advance Search
Social Welfare

అందరికీ అందుబాటులో, సరసమైన ఆరోగ్య సంరక్షణ

प्रविष्टि तिथि: 12 AUG 2026 17:16 PM

గత 12 ఏళ్లలో భారత ప్రభుత్వం దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేసింది. నాణ్యమైన ఆరోగ్య సేవలు గతంలో ఎన్నడూ లేనంతగా అందుబాటులోకి రావడంతో పాటు సరసమైన ధరల్లో, సమానత్వంతో లభిస్తున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణానికి ఉద్దేశించిన ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ సూత్రానికి ఇది అనుగుణంగా ఉంది.

ఆయుష్మాన్‌ భారత్‌
* ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(ఏబీ-పీఎంజేఏవై) సమాజంలోని అత్యంత పేదలైన‌ 40 శాతం కుటుంబాలతో పాటు 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ కుటుంబానికి ఏటా ₹5 లక్షల ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తుంది.
* 1,900కు పైగా చికిత్స ప్యాకేజీలకు సంబంధించి ప్రతిరోజూ 40 వేలకు పైగా క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేస్తున్నారు.

పథకం ప్రారంభమైన 2018 నుంచి 2026 ఆగస్టు 12 వరకు:
* 45.5 కోట్లకు పైగా ఆయుష్మాన్‌ కార్డులను జారీ చేశారు.
* 2026 జూన్‌ 30 నాటికి ₹1.92 లక్షల కోట్ల విలువైన 12.69 కోట్ల ఆసుపత్రి చికిత్సలను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.
* 38,466కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పథకంలో నమోదయ్యాయి.
* ఆయుష్మాన్‌ భారత్‌ వయ వందన పథకంలో 1.20 కోట్ల మంది వృద్ధులు నమోదయ్యారు. వీరు ₹3 వేల కోట్ల విలువైన 13.84 లక్షలకు పైగా చికిత్సలను పొందారు.
* ఏబీ పీఎం–జేఏవై కింద 2026 జూన్‌ 30 నాటికి ₹8,383.97 కోట్లకు పైగా విలువైన 29.05 లక్షల అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ ఆసుపత్రి చేరిక‌ల‌కు అనుమతులు ఇచ్చారు.
* ప్రతి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించేందుకు 2026 ఆగస్టు 12 నాటికి దేశవ్యాప్తంగా 1.86 లక్షలకు పైగా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు(ఏఏఎం) పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలు 12 ఉచిత సేవలను అందిస్తున్నాయి. ఇప్పటివరకు వీటిని సందర్శించిన వారి సంఖ్య 540 కోట్లు దాటింది.

ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌(పీఎం-అభిమ్‌) కింద:
* ప్రత్యేక దృష్టి కలిగిన 10 రాష్ట్రాల్లో 23,224 గ్రామీణ ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలకు మద్దతు
* అన్ని రాష్ట్రాల్లో 13,736 పట్టణ ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ఏర్పాటు
* ప్రత్యేక దృష్టి కలిగిన 11 రాష్ట్రాల్లో 3,389 బ్లాక్‌ ప్రజారోగ్య విభాగాల ఏర్పాటు
* అన్ని జిల్లాల్లో 744 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటు
* ఐదు లక్షలకు పైగా జనాభా కలిగిన అన్ని జిల్లాల్లో 631 అత్యవసర చికిత్స ఆసుపత్రి బ్లాకుల ఏర్పాటు

ఈ కార్యక్రమాలన్నింటికీ భారత్‌ డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎం) మద్దతు అందిస్తోంది. 2026 ఆగస్టు 12 నాటికి:
* 96.43 కోట్ల అభా ఆరోగ్య గుర్తింపు సంఖ్యలను రూపొందించారు.
* 110 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులను అభాతో అనుసంధానించారు.
* 5.47 లక్షలకు పైగా ఆరోగ్య కేంద్రాలను వేదికపై నమోదు చేశారు.
* 10.50 లక్షలకు పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు వేదికపై నమోదయ్యారు.

 


జాతీయ ఆరోగ్య మిషన్‌: లక్షిత ఆరోగ్య కార్యక్రమాలు
జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్ఎం) పరిధిలోని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ నిర్దిష్ట వ్యాధులు, జనాభా వర్గాలు, ఆరోగ్య సవాళ్ల పరిష్కారానికి లక్షిత కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. మాతా, శిశు ఆరోగ్యం, వ్యాధుల నిర్మూలన, టీకాల కార్యక్రమంలో ప్రజారోగ్య ఫలితాలను ఎన్‌హెచ్‌ఎం గణనీయంగా మెరుగుపరిచింది.

మాతా, శిశు ఆరోగ్యం: సురక్షిత ప్రసవాలే సాధారణ ప్రమాణంగా
* ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ ద్వారా 7.91 కోట్లకు పైగా ఉచిత ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
* 1.24 కోట్లకు పైగా అధిక ప్రమాదం కలిగిన గర్భధారణలను గుర్తించారు.
* గర్భధారణ తొలి త్రైమాసికంలో నమోదు చేసుకున్న మహిళల శాతం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 (2015–16)లో 58.6గా ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6 (2023–24)లో 76.2కు పెరిగింది.
* నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న తల్లుల శాతం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 (2015–16)లో 51.2 నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6 (2023–24)లో 65.2కు గణనీయంగా పెరిగింది.
* ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల శాతం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 (2015–16)లో 78.9 నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6 (2023–24)లో 90.6కు పెరిగింది.
* సార్వత్రిక టీకాల కార్యక్రమం ద్వారా ఏటా 2.67 కోట్ల నవజాత శిశువులు, 2.9 కోట్ల గర్భిణులకు 12 వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉచిత టీకాలను అందిస్తున్నారు.
* 2014లో ప్రారంభించిన మిషన్‌ ఇంద్రధనుష్‌ వివిధ దశల్లో టీకాలు మిగిలిపోయిన వారికి ప్రత్యేక కార్యక్రమంగా పనిచేసింది. దీని ద్వారా 5.46 కోట్ల మంది చిన్నారులు, 1.32 కోట్ల మంది గర్భిణులకు టీకాలు అందించారు.
* ఒక్క టీకా కూడా తీసుకోని జీరో–డోస్‌ చిన్నారుల శాతం 2023లో జనాభాలో 0.11 శాతం నుంచి 2024లో 0.06 శాతానికి తగ్గింది.
* సార్వత్రిక టీకాల కార్యక్రమం కింద కుటుంబాలు తమ టీకాల రికార్డులను కోల్పోకుండా చూసేందుకు ప్రభుత్వం యూ–విన్‌ వేదికను 2024 అక్టోబరులో ప్రారంభించింది. 2026 మార్చి నాటికి 11.87 కోట్ల మంది చిన్నారులు, 3.96 కోట్ల మంది గర్భిణులు ఇందులో నమోదయ్యారు.
* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు 14 ఏళ్ల వయసున్న 1.2 కోట్ల మంది బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకాలు అందించే మూడు నెలల కార్యక్రమాన్ని ప్రభుత్వం 2026 ఫిబ్రవరిలో ప్రారంభించింది.
* 2026 జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా 52,10,302 మంది బాలికలు హెచ్‌పీవీ టీకా తీసుకున్నారు.

ఈ కార్యక్రమాలతో పలు మరణాల రేట్లు మెరుగుపడ్డాయి:
* మాతృ మరణాల నిష్పత్తి 2014–16లో ప్రతి లక్ష సజీవ జననాలకు 130గా ఉండగా, 2022–24లో 87కు తగ్గింది.
* నవజాత శిశు మరణాల రేటు 2015లో ప్రతి వెయ్యి సజీవ జననాలకు 28గా ఉండగా, 2023లో 17కు తగ్గింది.
* ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు 2015లో ప్రతి వెయ్యి సజీవ జననాలకు 48గా ఉండగా, 2023లో 28కు తగ్గింది.

అంటువ్యాధుల నిర్మూలన: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో వాస్తవ పురోగతి
* గత 12 ఏళ్లలో అంటువ్యాధుల వ్యాప్తిని ప్రభుత్వం తగ్గించింది.
* భారత్‌లో ఏటా నమోదయ్యే కొత్త క్షయ కేసులు 2015–2024 మధ్య 21 శాతం తగ్గాయి. ఇదే కాలంలో క్షయ కారణ మరణాలు 28 శాతం తగ్గాయి.
* క్షయ చికిత్స విజయవంతమైన కేసుల శాతం 2021లో 83 నుంచి 2025లో 90కు పెరిగింది. చికిత్స పరిధి 2015లో 53 శాతం నుంచి 2024లో 92 శాతానికి చేరింది.
* 2024 డిసెంబర్‌ నుంచి చేపట్టిన ముమ్మర కార్యక్రమాల కింద ఇప్పటివరకు 28.1 కోట్లకు పైగా ప్రజలకు పరీక్షలు, 20 లక్షల మందికి నివారణ చికిత్స అందించారు. కొత్తగా 5.7 లక్షల మంది నిక్షయ్‌ మిత్రలను చేర్చారు.
* 2015–2023 మధ్య మలేరియా కేసులు 80.5 శాతం, మరణాలు 78.38 శాతం తగ్గాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియాకు సంబంధించి రూపొందించిన ‘అధిక భారం నుంచి అధిక ప్రభావం’ (హెచ్‌బీహెచ్ఐ) దేశాల జాబితా నుంచి భారత్‌ 2024లో బయటకు వచ్చింది.

అసాంక్రమిక వ్యాధులు: సమస్యలను ముందుగానే గుర్తించడం
అసాంక్రమిక వ్యాధుల నివారణ–నియంత్రణ జాతీయ కార్యక్రమం(ఎన్‌పీ-ఎన్‌సీడీ) కింద మౌలిక సదుపాయాల బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, పరీక్షలు, ముందస్తు నిర్ధారణ, సిఫార్సు, చికిత్స, ఆరోగ్య ప్రోత్సాహంపై దృష్టి సారిస్తున్నారు. దేశవ్యాప్త పరీక్షల కార్యక్రమాల ద్వారా:
* 41.5 కోట్ల మందికి అధిక రక్తపోటు పరీక్షలు
* 41.3 కోట్ల మందికి మధుమేహ పరీక్షలు
* 35.3 కోట్ల మందికి నోటి క్యాన్సర్‌ పరీక్షలు
* 16.5 కోట్ల మందికి రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించారు.

* 2016లో ప్రారంభించిన ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం కింద 2026 జూన్‌ నాటికి 1,856 కేంద్రాల్లో 32.44 లక్షల మంది రోగులకు ఉచిత డయాలసిస్‌ సేవలు అందించారు.
* తృతీయ స్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల సదుపాయాల బలోపేత పథకం కింద 19 రాష్ట్ర క్యాన్సర్‌ సంస్థలు, 20 తృతీయ స్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలకు ఆమోదం ఇచ్చారు.
* అసాంక్రమిక వ్యాధుల నివారణ–నియంత్రణ జాతీయ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 770 జిల్లా ఎన్‌సీడీ క్లినిక్‌లు, 524 డే కేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 6,410 ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు.
* ప్రపంచ వయోజన పొగాకు సర్వే రెండో విడత నివేదిక ప్రకారం 2009–10 నుంచి 2016–17 మధ్య దేశంలో మొత్తం పొగాకు వినియోగం 17.3 శాతం తగ్గింది.
* పొగాకు రహిత తరాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం 2023లో పొగాకు రహిత యువత ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇది మూడో విడతలో కొనసాగుతోంది. పొగాకు నియంత్రణలో ఈ కృషికి భారత్‌కు 2025 బ్లూమ్‌బర్గ్‌ ఫిలాంత్రపీస్‌ అవార్డు లభించింది.

మందులు, పరీక్షలను ప్రజలకు అందుబాటు ధరల్లోకి తీసుకురావడం
* ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) ద్వారా జనరిక్‌ మందులు తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు లభించే జన ఔషధి కేంద్రాల సంఖ్య 2014–15లో కొన్నింటికే పరిమితం కాగా, 2026 ఫిబ్రవరి నాటికి 18,646కు పైగా పెరిగింది.
* 2 వేలకు పైగా మందులు, 300 శస్త్రచికిత్స పరికరాలతో కూడిన ఉత్పత్తుల జాబితాలోని మందులను బ్రాండెడ్‌ ఉత్పత్తుల ధరల కంటే 50–80 శాతం తక్కువకు విక్రయిస్తున్నారు.
* 2015లో ప్రారంభించిన అమృత్‌ (చికిత్సకు సరసమైన మందులు, విశ్వసనీయ ఇంప్లాంట్లు) ఫార్మసీలు ప్రాణరక్షక మందులను 50–90 శాతం రాయితీతో అందిస్తున్నాయి. చికిత్స ఖర్చును భరించలేని అల్పాదాయ రోగులకు ఇవి తోడ్పడుతున్నాయి.
* ఈ పథకం ద్వారా 6.85 కోట్లకు పైగా రోగులు ప్రయోజనం పొందారు. ఇప్పటివరకు గరిష్ఠ చిల్లర ధరల ప్రకారం ₹17 వేల కోట్లకు పైగా విలువైన మందులను పంపిణీ చేశారు. దీంతో రోగులకు దాదాపు ₹8,400 కోట్ల సంచిత ఆదా లభించింది.
* జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఉచిత రోగ నిర్ధారణ సేవల కార్యక్రమం ద్వారా ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్ని స్థాయుల్లో రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, హెమటాలజీ, రేడియాలజీ, బయోకెమిస్ట్రీతో సహా పలు పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు.

ప్రజారోగ్య కేంద్రాల్లో వివిధ స్థాయుల్లో ఉచితంగా అందించే పరీక్షలు:
* ఉప ఆరోగ్య కేంద్రాల్లో 14 పరీక్షలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 63 పరీక్షలు
* సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 97 పరీక్షలు
* ఉప జిల్లా ఆసుపత్రుల్లో 111 పరీక్షలు
* జిల్లా ఆసుపత్రుల్లో 134 పరీక్షలు

ప్రజల వ‌ద్ద‌కే సేవలు: డిజిటల్‌ ఆరోగ్యం, టెలిమెడిసిన్‌
* భారత్‌ జాతీయ టెలిమెడిసిన్‌ వేదిక ఈ–సంజీవని 2019లో ప్రారంభమైనప్పటి నుంచి 2026 ఆగస్టు 11 వరకు 49 కోట్లకు పైగా వైద్య సంప్రదింపులను అందించింది. ప్రస్తుతం 2.4 లక్షలకు పైగా ఆరోగ్య సేవా ప్రదాతలు ఈ వేదికలో ఉన్నారు.
* దేశవ్యాప్తంగా విస్తృత మానసిక ఆరోగ్య సేవలను అందించే ఉచిత హెల్ప్‌లైన్ టెలి–మానస్‌ (14416)ను 2022 అక్టోబరులో ప్రారంభించారు.
* అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 20 భాషల్లో ఈ సేవ పనిచేస్తోంది. 53 టెలి–మానస్‌ కేంద్రాలు, 23 మార్గదర్శక సంస్థల ద్వారా సేవ ప్రారంభమైనప్పటి నుంచి 2026 ఆగస్టు 11 వరకు 43.64 లక్షల కాల్స్‌ను స్వీకరించింది.
* 2021లో ప్రారంభించిన ఐ–డ్రోన్‌ సేవ ద్వారా మందులు, టీకాలను డ్రోన్లతో చేరవేస్తున్నారు. 65 ఆరోగ్య కేంద్రాల ద్వారా 7,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 22 వేల మందుల ప్యాకేజీలను అందించారు.
* ఆరోగ్య సేవల అందజేతలో కృత్రిమ మేధను కూడా అనుసంధానించారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2025 నవంబర్‌ మధ్య 28.2 కోట్ల ఈ–సంజీవని సంప్రదింపులకు కృత్రిమ మేధ ఆధారిత వైద్య నిర్ణయ సహాయక వ్యవస్థలు మద్దతు ఇచ్చాయి. వైద్యులకు ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన హెచ్చరికలను ఇవి అందించాయి.

భారత్‌ అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు
* గత 12 ఏళ్లలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపునకు పైగా పెరిగింది. 387 నుంచి 2025–26 నాటికి 818 అల్లోపతి వైద్య కళాశాలలకు చేరింది.
* 2014 నుంచి 12 కొత్త ఎయిమ్స్‌ సంస్థలను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం దేశంలో 23 ఎయిమ్స్‌ సంస్థలు ఉన్నాయి.
* 2025–26 నాటికి ఎంబీబీఎస్‌ సీట్లు 1,28,976కు, పీజీ వైద్య సీట్లు 85,822కు పెరిగాయి.
* నర్సింగ్‌ విద్యకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 157 కొత్త నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఏటా దాదాపు 15,700 మంది నర్సింగ్‌ పట్టభద్రులు అందుబాటులోకి వస్తారు.
* 2025 జూన్‌ నాటికి బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు 53 శాతం పెరిగి 1,27,290కు, ఎంఎస్సీ నర్సింగ్‌ సీట్లు 39 శాతం పెరిగి 14,986కు చేరాయి.

ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ
ఆధునిక వైద్యంతో పాటు సంప్రదాయ ఆరోగ్య విధానాలను ప్రభుత్వం అధికారికంగా ప్రజారోగ్య వ్యవస్థలో సమీకరించింది. 2014 నవంబరులో ఏర్పాటు చేసిన ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ, సోవా రిగ్పా, హోమియోపతి విధానాలను భారత ఆరోగ్య వ్యవస్థలో చురుకైన భాగంగా నిలిపింది.

* 2025 మే నాటికి దేశంలో 942 ఆయుష్‌ సంస్థలు ఉన్నాయి.

* సంప్రదాయ వైద్యం, ఆధునిక ఆరోగ్య సేవల మధ్య డిజిటల్‌ అనుసంధానంగా ఆయుష్‌ గ్రిడ్‌ పనిచేస్తుంది. ఆయుష్‌ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చి, సమీకృతంగా, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా తీర్చిదిద్దుతుంది. దేశవ్యాప్తంగా అన్ని ఆయుష్‌ ఆసుపత్రులు, ప్రయోగశాలలను ఈ గ్రిడ్‌ డిజిటల్‌గా అనుసంధానిస్తుంది.

References:

 

Ministry of Health and Family Welfare

https://aam.mohfw.gov.in/

https://abdm.gov.in/

https://dashboard.nha.gov.in/public/

https://esanjeevani.mohfw.gov.in/#/

https://nhm.gov.in/index1.php?lang=1&level=2&sublinkid=824&lid=220

https://nhm.gov.in/index1.php?lang=1&level=2&sublinkid=1218&lid=192

https://pmndp.mohfw.gov.in/en

https://telemanas.mohfw.gov.in/telemanas-dashboard/#/

https://idrone.icmr.org.in/about/

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1945739&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258300&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294278&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290627&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2292344&reg=5&lang=1

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=147093&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286947&reg=48&lang=2

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/jan/doc202611749801.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2275402&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2243768&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2254227&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286948&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2176322&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246069&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190300&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292343&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2224522&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1919985&reg=3&lang=2

 

Ministry of AYUSH

https://www.ayush.gov.in/

 

United Nations

https://www.unicef.org/india/press-releases/un-report-highlights-great-strides-india-under-five-child-survival

 

PIB Backgrounder

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158798&ModuleId=3&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241066&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244661&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2124334&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2227410&reg=3&lang=1

Affordable and Accessible Healthcare for All

 

***

 

(तथ्य सामग्री आईडी: 150904) आगंतुक पटल : 8


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Bengali , Kannada , Malayalam , Assamese