57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫీ గాలా ప్రీమియర్‌లో సూపర్ నాచురల్ అంశాలను మానవ భావోద్వేగాలతో మేళవించిన ప్రతిష్ఠాత్మక మలయాళ చిత్రం ‘హాఫ్’ ప్రదర్శన


యాక్షన్, భావోద్వేగం, విభిన్నమైన కథనంతో ఒక విలక్షణమైన వ్యాంపైర్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన ‘హాఫ్’

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 7:27PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2341045Views: 16

సూపర్ నాచురల్ అంశాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, లోతైన మానవ భావోద్వేగాల కలయికతో రూపొందిన మలయాళ చిత్రం ‘హాఫ్’.. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫీ) తన గాలా ప్రీమియర్‌ను ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినీ ప్రపంచాన్ని పరిచయం చేసింది.

ఈ రోజు పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటి అమలా పాల్ మాట్లాడారు. వ్యాంపైర్లు, సూపర్ నాచురల్ పాత్రలతో కూడిన అవకాశాలు నటులకు చాలా అరుదుగా వస్తాయన్న ఆమె.. అందువల్ల ‘హాఫ్’ తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రాజెక్ట్ అని అన్నారు. తాను ఎన్నడూ పోషిస్తానని ఊహించని పాత్రలో అడుగుపెట్టే అవకాశాన్ని ఈ చిత్రం కల్పించిందని.. ఒక నటిగా తాను ఎప్పటినుంచో చేయాలని కోరుకున్న విభిన్న పాత్ర ఇదని ఆమె వివరించారు.

ఈ చిత్రంలో తన పాత్ర గత ప్రాజెక్టులకు పూర్తి భిన్నమైనదని నటుడు అబ్బాస్ పేర్కొన్నారు. జైసల్మేర్‌లోని తీవ్రమైన ఎండలో చిత్రీకరణ చేసినప్పుడు ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకుంటూ.. ఆ అనుభవం తన పరిధులను దాటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా ప్రోత్సహించిందని ఆయన అన్నారు. ఈ చిత్రాన్ని ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజీగా అభివర్ణించిన ఆయన.. ప్రేక్షకులకు వినోదాత్మక సినీ అనుభూతిని అందించడంలో కృషి చేసిన చిత్ర బృందం మొత్తాన్ని ఆయన ప్రశంసించారు.

నటుడు రంజిత్ సజీవ్‌ మాట్లాడుతూ.. నటన పట్ల తనకున్న మక్కువ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. ‘హాఫ్’ చిత్రాన్ని విభిన్నమైన దృక్పథంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా అభివర్ణించిన ఆయన.. కఠినమైన యాక్షన్ సన్నివేశాలకు సన్నద్ధమయ్యేందుకు ప్రధాన నటులైన తాను, ఐశ్వర్య రాజ్ ఇద్దరూ ఒక వర్క్‌షాప్‌లో శిక్షణ పొందినట్లు ఆయన వెల్లడించారు. తన పాత్ర గురించి వివరిస్తూ.. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం అయినప్పటికీ ‘హాఫ్’ సినిమాలో ఒక్క స్లో-మోషన్ షాట్ కూడా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఒక విలక్షణమైన థియేట్రికల్ అనుభూతిని అందించాలన్న చిత్ర బృందం ఉద్దేశాన్ని ఇది తెలియజేస్తోందని తెలిపారు.

ఈ చిత్రంలో తన మనసుకు హత్తుకున్న అంశాల్లో తోబుట్టువుల అనుబంధం ఒకటని నటి ఐశ్వర్య రాజ్ పేర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాలను నేర్చుకోవడం, ప్రదర్శించడం చాలా సవాలుతో కూడుకున్నదని.. తాను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఇది ఉందని ఆమె అంగీకరించారు. ‘హాఫ్’ చిత్రాన్ని వ్యాంపైర్ల అత్యంత ఆకర్షణీయమైన చిత్రీకరణలలో ఒకటిగా అభివర్ణిస్తూ.. సంప్రదాయ సూపర్ నాచురల్ జీవులుగా కాకుండా వారిని స్నేహపూర్వకమైన, మనకు దగ్గరగా ఉండే, దాదాపు మన పక్కింటి వ్యక్తుల తరహా పాత్రలుగా ఈ సినిమా చూపిస్తుందని ఆమె వివరించారు.

ఈ చిత్రంలోని సాహసోపేతమైన కథాంశం, విలక్షణమైన ఇతివృత్తం గురించి చిత్ర నిర్మాత ఆన్ సంజీవ్ మాట్లాడుతూ.. మలయాళ సినిమాను భౌగోళిక సరిహద్దులు దాటి తీసుకెళ్లాలన్న తమ బృందం ఆకాంక్షను తెలియజేశారు. ఈ విభిన్నమైన కథను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి తమ బృందం ఎంతో ఆసక్తిగా ఉందని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రేక్షకులకు మరింత వినూత్నమైన, ఆకట్టుకునే కంటెంట్‌ను అందించాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2341045
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026