ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సమృద్ధిని పరిరక్షించుకునేందుకు అవసరమైన గుణాలను వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 2:44PM by PIB Hyderabad
సమృద్ధిని పరిరక్షించుకోవడానికి ఏయే గుణాలు అవసరమో చాటిచెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇలా ప్రస్తావించారు:
‘ధృతిర్దాక్ష్యం సంయమో బుద్ధిరగ్రయా ధైర్యం శౌర్యం దేశకాలోఅప్రమాదః
స్వల్పస్య వా మహతో వాపి వృద్ధౌ ధనస్యైతాన్యష్ట సమిన్ధనాని’ అని ఆయన పేర్కొన్నారు.
పైన ప్రస్తావించిన శ్లోకానికి.. దృఢత్వం, కార్యకుశలత, ఆత్మనిగ్రహం, వివేకం, ధైర్యం, దేశ, కాల పరిస్థితులను అవగాహన చేసుకోవడం, అప్రమత్తంగా ఉండటం అన్న  ఎనిమిది గుణాల్ని మనిషి అలవరుచుకుంటే ధనం అది చిన్న మొత్తాల్లో కావచ్చు లేదా పెద్ద మొత్తంలో అయినా కావచ్చు, నిరంతరంగా వృద్ధి చెందుతూ ఉంటుందని అర్థం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘ధృతిర్దాక్ష్యం సంయమో బుద్ధిరగ్రయా ధైర్యం శౌర్యం దేశకాలోఅప్రమాదః
స్వల్పస్య వా మహతో వాపి వృద్ధౌ ధనస్యైతాన్యష్ట సమిన్ధనాని’ అని పేర్కొన్నారు.
 
***

(రిలీజ్ ఐడి: 2340373) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam