నాడు పోస్టు చేయడమైనది:
22 NOV 2026 12:43PM by PIB Hyderabad
రాజ్యసభ సభ్యుడు శ్రీ రామ్‌రావ్ వాడ్కుటే మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం తెలిపారు. సమాజానికి, పేదలకు, అణగారిన వర్గాలకు సేవపై ఆయన అంకిత భావం చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రాజ్యసభ సభ్యులు శ్రీ రామ్‌రావ్ వాడ్కుటే కన్నుమూతపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సమాజ సేవతోపాటు పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి దిశగా ఆయన అంకిత భావం చిరస్మరణీయం మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కృషి కూడా అంతే ప్రశంసనీయం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను… ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***