ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భక్తి సంగీత కార్యక్రమంలో యువత ఉత్సాహాన్ని అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2026 11:00PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నమో ఘాట్‌లో నిర్వహించిన భక్తి సంగీత విభావరి (భజన్‌ క్లబ్బింగ్‌) కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొనడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ కార్యక్రమం అక్కడికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేసింది.

“నా యువ మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. వారి ఉత్సాహం, ఉల్లాసం చూడముచ్చటగా ఉన్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

“బాబా విశ్వనాథుని పుణ్యక్షేత్రమైన కాశీలో నిర్వహించిన భక్తి భజనల సంగీత వేడుక అందరినీ మంత్రముగ్ధులను చేసింది. నమో ఘాట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నా యువ మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి ఉత్సాహం, ఆనందం చూడముచ్చటగా ఉన్నాయి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

****


(రిలీజ్ ఐడి: 2339558) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam