57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ఇఫీలో గౌరవప్రద దేశంగా స్పెయిన్: సమకాలీన స్పానిష్ సినిమా, కథనాల వేడుక


57వ ఇఫీ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా స్పెయిన్ సినిమా: నాలుగు సమకాలీన స్పానిష్ చిత్రాల ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 15 NOV 2026 2:24PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2336596Views: 20

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (ఇఫీ) హాజరయ్యే సినీ ప్రియులకు ఒక ప్రత్యేక విందు సిద్ధంగా ఉంది. స్పానిష్ సినిమా వైభవాన్ని, వైవిధ్యాన్ని ఈ వేడుక ఘనంగా చాటనుంది. స్పెయిన్‌ను 'కంట్రీ ఆఫ్ ఆనర్'గా ఎంపిక చేయడంతో... ప్రపంచ, ఆసియా, భారత ప్రీమియర్లతో కూడిన నాలుగు సమకాలీన స్పానిష్ చిత్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ఇఫీలో ప్రదర్శించనున్నారు. సమకాలీన స్పానిష్ చిత్రసీమలోని ఉత్సాహాన్ని, సృజనాత్మకతను, మారుతున్న కథన శైలిని ప్రేక్షకులకు ఆకట్టుకునే రీతిలో ఈ ప్రదర్శన పరిచయం చేస్తుంది.

 

ఈ ఏడాది ఇఫీలో ప్రదర్శించే ఉత్సాహభరితమైన స్పానిష్ చిత్రాలు:

 
బిట్టర్ క్రిస్మస్ (అమర్గా నావిదాద్)

రెండుసార్లు ఆస్కార్ పురస్కారం అందుకున్న ఫిలిం మేకర్ పెడ్రో అల్మోడోవర్ 2026లో రూపొందించిన తాజా చిత్రం ఇది. సినిమా నిర్మాణంలో వ్యక్తిగత అనుభవాలను, వాస్తవ ఘటనలను ఉపయోగించడం వల్ల ఎదురయ్యే సవాళ్లను విశ్లేషిస్తుంది. ఒక నిజాయితీతో కూడిన కథను ఆవిష్కరించే క్రమంలో ఒకరి జీవితాన్ని దర్శకుడు ఎంత వరకు తెరకెక్కించవచ్చనే ప్రశ్నను ఈ సినిమా లేవనెత్తుతుంది. తన తదుపరి చిత్రానికి కొత్త కథాంశం దొరక్క సతమతమవుతున్న రౌల్ అనే ఒక విలక్షణ దర్శకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ తాను ఎదుర్కొన్న విషాదాన్నే తన కొత్త కథకు స్ఫూర్తిగా అతడు మలచుకుంటాడు.

ఈ ఏడాది కేన్స్, టొరంటో, సాన్ సెబాస్టియన్ లాంటి ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రం ఇఫీలో ఇండియా ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది.

లుకింగ్ ఫర్ మైఖేల్ (పెర్సిగియెండో అ మైఖేల్)

హువానా మాసియాస్ దర్శకత్వంలో 2026లో తెరకెక్కిన ఈ చిత్రం... పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడిన ఒక యువతి కథను చెబుతుంది. తనకు ఎదరవుతున్న కష్టాలకు తలొగ్గకుండా భిన్నంగా, ఉత్సాహంగా జీవించాలని ఆమె ధైర్యంగా నిర్ణయించుకుంటుంది. ఇదే వ్యాధితో బాధపడుతున్న తన మ్యూజిక్ థెరపీ బృందం సభ్యులు అందించిన తోడ్పాటుతో పార్కిన్సన్స్‌తో పోరాడుతున్న ప్రముఖ నటుడు మైఖేల్ జె. ఫాక్స్‌ను కలిసేందుకు ఆమె ప్రయాణమవుతుంది. కామెడీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇఫీ-2026 వేదికగా వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

         

ది బ్యాడ్ సన్ (ఎల్ మాల్ ఈహో)        

స్పానిష్ నటుడు, దర్శకుడు హైమే లోరెంటే దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ఎల్ మాల్ ఈహో. ఈ చిత్రం ఇఫీ-2026 వేదికగా ఆసియా ప్రీమియర్‌కు సిద్ధమైంది. తరతరాలుగా వెంటాడే మానసిక వేదన, కుటుంబ సంబంధాలను ఈ చిత్రం హృద్యంగా ఆవిష్కరిస్తుంది. గతంలో శాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ కథ 11 ఏళ్ల వయసులోనే తండ్రి వదిలేయడంతో తనకు పెద్దగా పరిచయం లేని బామ్మ వద్దకు చేరిన ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. తనను వేధించే చేదు జ్ఞాపకాలను ఎదుర్కొంటూ, కుటుంబంలోని కల్లోల గతాన్ని ఛేదించే క్రమంలో, తరతరాలుగా కొనసాగుతున్న మానసిక గాయాల పరంపరకు ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తాడు.

 

ట్రినిడాడ్

లారా అల్వేయా, హోసే ఒర్టునో దర్శకత్వంలో 2025లో ట్రినిడాడ్ చిత్రం తెరకెక్కింది. 19వ శతాబ్దం చివరి కాలంలో వైల్డ్ వెస్ట్ ప్రాంతానికి పారిపోయిన ఓ స్పానిష్ యువతి సాహసాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. చేయని నేరాన్ని తనపై మోపడంతో మహిళా బందిపోట్ల బృందంతో ఆ యువతి చేతులు కలుపుతుంది. పోరాటాలు, ప్రమాదాలు, ప్రతీకారంతో నిండిన సాహసయాత్రను ఆమె కొనసాగిస్తుంది. ఈ యాక్షన్ చిత్రం ఇఫీ-2026 వేదికగా వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2336596
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026