ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ నెల 13-14 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్‌.. కర్ణాటక పర్యటన

బెంగళూరు నగరంలో ₹15,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన
ఇవన్నీ పట్టణ రవాణా.. విద్యుత్ ప్రసారం.. పునరుత్పాదక ఇంధనం.. పెట్రో మౌలిక సదుపాయాలు.. వ్యర్థాల నిర్వహణ.. రైల్వే వంటి రంగాల ప్రాజెక్టులు
కాలెన అగ్రహారం-తావరకెరె మధ్య బెంగళూరు మెట్రో పింక్ లైన్‌కు శ్రీకారం
మంగళూరులో దేశంలోనే అతిపెద్ద భూగర్భ ఎల్‌పీజీ నిల్వ కేంద్రం దేశానికి అంకితం
‘అమృత భారత్ స్టేషన్’ కింద 4 పునర్నవీకృత రైల్వే స్టేషన్లు- చామరాజ నగర్.. చిక్కమగళూరు.. సకలేష్‌పూర్.. సుబ్రహ్మణ్య రోడ్‌ ప్రారంభోత్సవం
బెంగళూరు-మంగళూరు-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా
బెంగళూరులోని ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి హాజరు
దేశంలో తొలి ఎల్ఈడీ డోమ్ ‘కాస్మోస్-మైసూరు’ ప్లానెటేరియం ప్రారంభం
గుజరాత్‌లోని బనస్కాంతలో గల అంబాజీ ఆలయంలో దర్శనం-పూజలు

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 5:14PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 13-14 తేదీలలో కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా బెంగళూరు నగరంలో ఉదయం 10:45 గంటల ప్రాంతంలో ‘ప్రశాంతి కుటీరం’ స్వర్ణోత్సవాలకు హాజరై, సభికులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:45 గంటలకు మెట్రో రైలుకు పచ్చజెండా ఊపడంతోపాటు తావరకెరె నుంచి ఐఐఎం-బెంగళూరు మెట్రో స్టేషన్ వరకూ అందులో ప్రయాణిస్తారు. ఆ తర్వాత 1:15 గంటలకు బెంగళూరు నగరంలోనే ₹15,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన.. దేశానికి అంకితం.. ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

 

అక్కడి నుంచి మైసూరు వెళ్లి, మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ‘భారత వనం’లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మైసూరులోని ‘కాస్మోస్-మైసూరు’ ప్లానెటోరియంను ప్రారంభించిన తర్వాత సభికులనుద్దేశించి ప్రసంగిస్తారు.

 

ఇక నవంబరు 14వ తేదీన ప్రధానమంత్రి గుజరాత్‌ వెళ్తారు. అక్కడి బనస్కాంతలో దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటైన అంబాజీ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

బెంగళూరులో ప్రధానమంత్రి కార్యక్రమాలు

 

ప్రధానమంత్రి తొలుత బెంగళూరు నగరంలోని ‘స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థాన’ (ఎస్‌-వివైఏఎస్‌ఏ) ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని ‘ప్రశాంతి కుటీరం’లో నిర్వహించే స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ పరిపాలన భవనానికి శంకుస్థాపన సహా కేరళలోని తిరువనంతపురంలో ‘ఎస్‌-వివైఏఎస్‌ఏ’ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

 

ఈ స్వర్ణోత్సవాలను ‘వికసిత భారత్-2047’ ఇతివృత్తంతో నవంబరు 13 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. సంస్థ ఏర్పాటుతోపాటు సేవా రంగంలో దాని ఐదు దశాబ్దాల ప్రస్థానానికి ప్రతీకగా ఈ వేడుకలకు శ్రీకారం చుడుతున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానంతో అనుసంధానించే లక్ష్యంతో 1975లో ‘ప్రశాంతి కుటీరం’ ఏర్పాటైంది. ఇక్కడి ‘ఎస్‌-వివైఏఎస్‌ఏ’కి 2002లో విశ్వవిద్యాలయ హోదా లభించింది. ఈ సంస్థలో యోగ విద్య-పరిశోధనలు కొనసాగుతూంటాయి.

 

ఈ నేపథ్యంలోనే కాకుండా బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రబోధకుడు, రచయిత, నిర్వాహకుడైన శ్రీ హొంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రి (1926) శతాబ్ది జయంతిని కూడా పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆయన 1946లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరి, 1987 నుంచి 2000 వరకు దాని ‘సర్‌ కార్యవాహ్‌’ (అధిపతి)గా పనిచేశారు. ‘ఎస్‌-వివైఏఎస్‌ఏ’ ఏర్పాటుకు కృషి చేసిన దార్శనికులలో ఆయన కూడా ఒకరు. ప్రశాంతి కుటీరాన్ని తీర్చిదిద్దడంలో, దశాబ్దాలుగా సంస్థ లక్ష్యాన్ని కొనసాగించడంలో శేషాద్రి స్ఫూర్తి, మార్గదర్శకత్వం, కీలక పాత్ర పోషించాయి.

ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి బెంగళూరులో ₹15,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, దేశానికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ పట్టణ రవాణా, విద్యుత్ ప్రసారం, పునరుత్పాదక ఇంధనం, పెట్రో మౌలిక సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ, రైల్వేలు సహా కీలక రంగాలకు సంబంధించినవే.

 

అలాగే, కాలెన అగ్రహారం-తావరకెరె మార్గంలో సుమారు ₹3,470 కోట్లతో నిర్మించిన బెంగళూరు మెట్రో పింక్ లైన్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ కొత్త మార్గంతో పట్టణ రవాణా అనుసంధానం మెరుగుపడుతుంది. తద్వారా ప్రజలకు రోజువారీ ప్రయాణ సౌలభ్యంతోపాటు సమయం ఆదా కావడమేగాక బెంగళూరు నగరంలో ప్రజా రవాణా సౌకర్యం మరింత బలోపేతం అవుతుంది.

 

కొప్పల్-II, గడగ్-II లలో పునరుత్పాదక ఇంధన జోన్ల ఏకీకరణ (ఫేజ్‌-II) కింద ₹4,450 కోట్లతో నిర్మించిన విద్యుత్‌ ప్రసార వ్యవస్థను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కర్ణాటకలోని కొప్పల్, గడగ్ ప్రాంతాల నుంచి సుమారు 2 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని గ్రిడ్ పరిధిలోని లబ్ధిదారులకు ప్రసార-పంపిణీ చేసేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. దీంతోపాటు ₹1,370 కోట్లతో బీదర్‌లోని సౌరశక్తి జోన్ కోసం ఏర్పాటు చేసిన ప్రసార వ్యవస్థను కూడా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటయ్యే బీదర్ పూలింగ్ స్టేషన్‌ ద్వారా ఆ ప్రాంతం నుంచి 2.5 గిగావాట్ల సౌర విద్యుత్తును తరలిస్తారు.

 

దావణగేరే/చిత్రదుర్గ, బళ్లారి పునరుత్పాదక ఇంధన జోన్ల ఏకీకరణ కోసం ₹3,450 కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసే ప్రసార వ్యవస్థ పథకానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా అదనపు పునరుత్పాదక ఇంధన సామర్థ్య అనుసంధానం కోసం ₹1,100 కోట్లకు పైగా వ్యయంతో దావణగేరె, బళ్లారిలో నిర్మించే ప్రసార వ్యవస్థ బలోపేత ప్రాజెక్టుకూ ఆయన శంకుస్థాపన చేస్తారు.

 

మంగళూరులో ₹850 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద ఎల్‌పీజీ భూగర్భ నిల్వ కేంద్రాన్ని ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మొత్తం 80,000 టన్నుల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ సదుపాయంతో దేశీయ ఎల్‌పీజీ నిల్వ మౌలిక సదుపాయాలు గణనీయంగా బలోపేతమవుతాయి. ఈ ప్రాజెక్టులో న్యూ మంగళూరు పోర్టును ప్రధాన టెర్మినల్‌తో అనుసంధానించే 9.4 కిలోమీటర్ల ఎల్‌పీజి పైప్‌లైన్ కూడా అంతర్భాగంగా ఉంది. దీనితో ఎల్‌పీజీ సమర్థ రవాణా-నిల్వకు వీలు కలుగుతుంది. బెంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌) సంస్థ ₹330 కోట్లతో నిర్మించిన దేవనగొంతి మార్కెటింగ్ టెర్మినల్‌ను కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. ఈ అత్యాధునిక కేంద్రం వల్ల కర్ణాటకలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ-పంపిణీ మౌలిక సదుపాయాలు బలోపేతమవుతాయి.

 

బెంగళూరులోని హరలకుంటెలో గెయిల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ నిత్యం 300 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను శుద్ధి చేసి, 12.6 టన్నుల కాలుష్య రహిత కంప్రెస్డ్ బయోగ్యాస్‌నున ఉత్పత్తి చేస్తారు. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించే ఈ ప్రాజెక్టు- సంప్రదాయ ఇంధనాల పరాధీనత తగ్గడమే కాకుండా పరిశుభ్ర, సుస్థిర పర్యావరణానికి దోహదపడుతుంది.

నియంత్రించవచ్చు. ఇది మమేకం కాగల దృశ్యానుభూతిని కలిగించడంతో పాటు ఖగోళశాస్త్ర విద్యలో కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

 

స్కై థియేటర్, వృత్తిగత నైపుణ్యంతో రూపొందించిన ఖగోళశాస్త్ర కార్యక్రమాలను, మైసూరు చరిత్రతో ఖగోళశాస్త్రానికి గల సంబంధాన్ని అన్వేషించే ఒక అంతర్గత ముఖచిత్రాన్ని ఇది చూపుతుంది. ఇక్కడ ప్రదర్శనలు కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషలలో అందుబాటులో ఉంటాయి. ప్రదర్శనశాలలు, ఖగోళశాస్త్ర నమూనాలు, కళాఖండాలను ప్రదర్శించే మ్యూజియం, ఒక ఉపన్యాస మందిరం, ఒక శిక్షణ కేంద్రం, పరస్పర చర్యాత్మక బహిరంగ ప్రదర్శనలు కూడా ఉంటాయి.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధన, దేశవ్యాప్తంగానే కాకుండా అంతరిక్షంలో బహుళ-తరంగదైర్ఘ్య టెలిస్కోప్ సౌకర్యాల నిర్వహణ, భవిష్యత్ ఖగోళ సదుపాయాల కల్పన, జాతీయ స్థాయి ప్రచార కార్యక్రమాలకు ఈ కేంద్రం కార్యకలాపాలు తోడ్పాటునిస్తాయి.

 

*****


(రిలీజ్ ఐడి: 2335277) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam