నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2026 3:07PM by PIB Hyderabad
ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ గణనీయమైన పురోగతి సాధించింది. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, రికార్డుల సమర్థవంతమైన నిర్వహణ, కార్యాలయాల్లో పరిశుభ్రతకు ఈ ప్రచారంలో అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
ఈ ప్రచారంలో భాగంగా మంత్రిత్వ శాఖ 368 ప్రజా ఫిర్యాదులు, 64 ప్రజా ఫిర్యాదులకు సంబంధించిన అప్పీళ్లను పరిష్కరించింది. బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, పౌరుల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే పాలన పట్ల తన నిబద్ధతను చాటుకుంది. అలాగే పార్లమెంటు సభ్యుల నుంచి వచ్చిన 7 సూచనలు, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి వచ్చిన 4 సూచనలను కూడా పరిష్కరించింది. ఫిర్యాదులను సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించడంపై మంత్రిత్వ శాఖ చూపుతున్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోంది.
ఈ ప్రచారంలో భాగంగా కార్యాలయాల పరిశుభ్రతను మెరుగుపరచడం, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించడం, కార్యాలయ స్థలాన్ని మెరుగ్గా వినియోగించుకోవడం లక్ష్యంగా 285 పారిశుద్ధ్య కార్యక్రమాలను మంత్రిత్వశాఖ నిర్వహించింది.
రికార్డుల నిర్వహణలో భాగంగా 1,610 ఫైళ్లను సమీక్షించి, అవసరం లేని వాటిని తొలగించి, మూసివేశారు. పనికిరాని వస్తువులు, పాత రికార్డులను తొలగించడం ద్వారా మొత్తం 8,741 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేశారు. ఈ స్థలాన్ని ఇతర అవసరాలకు మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం కల్పించారు. పాత వస్తువుల విక్రయం ద్వారా రూ.1,94,161 ఆదాయాన్ని ఆర్జించారు. వనరుల మెరుగైన నిర్వహణ, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తోంది.
పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, అప్పీళ్లను సకాలంలో పరిష్కరించడం, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించడం, పరిశుభ్రతను మెరుగుపరచడం, ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించడంపై దృష్టి సారిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం 6.0ను కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా పరిశుభ్రమైన, క్రమబద్ధమైన, పౌరులకు మరింత మెరుగైన సేవలందించే పని వాతావరణాన్ని నిర్మించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
***