నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2026 3:09PM by PIB Hyderabad


నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా ఈ–సిగరెట్లు ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక దిగుమతి కన్‌సైన్‌మెంట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అడ్డుకున్నారు. దీనిలో తరలిస్తున్న సరకును ‘‘మాప్ రాడ్’’గా ప్రకటించారు. ఈ కంటెయినర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ప్రకటించిన మాప్ రాడ్ (హ్యాండిల్స్) మధ్యలో, కంటెయినర్ చివరి భాగంలో దాచిన యువోటో థానోస్ బ్రాండ్ ఈ–సిగరెట్లు 6,000, యువోటో లెన్స్ బ్రాండెడ్ ఈ–సిగరెట్లు 7,000 బయటపడ్డాయి.
కస్టమ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కవర్ కార్గోతో సహా మొత్తం రూ. 4 కోట్లకు పైగా విలువైన 13,000 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజారోగ్య ప్రయోజనాలు, ప్రమాదం నుంచి ప్రజలను కాపాడే దృష్ట్యా ఎలక్ట్రానిక్ సిగరెట్ల (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, విక్రయం, పంపిణీ, నిల్వ, ప్రకటన) నిషేధ చట్టం–2019 ప్రకారం ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అన్ని ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ (ఈఎన్‌డీఎస్)ను భారతదేశంలో నిషేధించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లోని వివిధ ఓడరేవులు, విమానాశ్రయాలు, ఐసీడీల్లో రూ.135 కోట్లకు పైగా విలువైన సుమారు 3,55,000 ఈ–సిగరెట్లను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది.
సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణాను అరికట్టడంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్య ప్రయోజనాలను కాపాడటంలోనూ డీఆర్ఐ చేస్తున్న నిరంతర కృషిని ఈ స్వాధీనాలు తెలియజేస్తున్నాయి.
***