నాడు పోస్టు చేయడమైనది:
08 NOV 2026 10:20AM by PIB Hyderabad
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ నాగ్‌పూర్‌లోని నర్ఖేడ్లో గల లోహారీ సవాంగా గ్రామంలో రైతులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడంతో పాటు అరుణాబాయి, రామ్భావు బాల్పాండే ఇంట్లో బస చేసి సహృదయతను చాటుకున్నందుకు శ్రీ ఫడణవీస్‌ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల మేలు కోరి పనిచేస్తోందని, వారి సంక్షేమానికి పూచీపడుతోందని ఈ ఆప్యాయతాభరితమైన చొరవ స్పష్టం చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ నాగ్‌పూర్‌లోని నర్ఖేడ్లో గల లోహారీ సవాంగా గ్రామంలో రైతులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడంతో పాటు అరుణాబాయి, రామ్భావు బాల్పాండే ఇంట్లో బస చేయడం ఎంతో సౌహార్దభరితమైన చర్య. రైతులకు ఉపాధికల్పనతో పాటు వారి సంక్షేమానికి పూచీ పడటానికి మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వం కరుణపూర్వక భావనతో కృషి చేస్తోందని ఈ ఘటనలు స్పష్టంగా చాటి చెబుతున్నాయి.
महाराष्ट्राचे मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस जी यांनी लोहारी सावंगा गावात (नरखेड, नागपूर) शेतकऱ्यांसोबत दिवाळी साजरी केली आणि त्यांनी अरुणाबाई आणि रामभाऊ बालपांडे यांच्या घरी मुक्काम ही केला, ही त्यांची कृती मनाला स्पर्श करणारी आहे. महाराष्ट्रातील एनडीए सरकार शेतकऱ्यांसाठी संवेदनशीलतेने कार्य करत आहे आणि त्यांच्या कल्याणासाठी प्रयत्नशील आहे, हे या कृतीतून अधोरेखित होते.’’ అని పేర్కొన్నారు.