ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. చీకటిపై పోరాట సంకల్పానికి ప్రతీక ఈ పండుగ!

నాడు పోస్టు చేయడమైనది: 07 NOV 2026 5:31PM by PIB Hyderabad

దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దీపాల పండుగ దేశమంతటినీ వెలుగులతో నింపుతుందని, చీకటిని అధిగమించాలనే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగతో పాటు రాబోయే రోజులు కూడా ప్రతి ఒక్కరికీ ఆనందం, శాంతి, సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

తాను ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటానని శ్రీ మోదీ తెలిపారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశంలోని ధైర్యసాహసాలు కలిగిన సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

దీపావళి శుభాకాంక్షలకు సంబంధించిన వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి పంచుకున్నారు.

“అందరికీ దీపావళి శుభాకాంక్షలు!” అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2334219) సందర్శకుల సూచీ సంఖ్య : : 23