రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

క్వాసీ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో

నాడు పోస్టు చేయడమైనది: 05 NOV 2026 7:47PM by PIB Hyderabad

ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ‘ప్రళయ్’ క్వాసీ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా నిర్వహించింది. 2026 నవంబర్ 5న ఉదయం దాదాపు 11:10 గంటలకు ఈ ప్రయోగం చేపట్టారు. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల పరికరాలు నమోదు చేసిన వివరాల ఆధారంగా, ప్రయోగానికి సంబంధించిన అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి సాధించినట్లు నిర్ధారణ అయింది.

image.png

 

ఇతర డీఆర్‌డీఓ ప్రయోగశాలలతో కలిసి హైదరాబాద్‌లోని ఇమారత్ పరిశోధనా కేంద్రం ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేసింది. అభివృద్ధి-ఉత్పత్తి భాగస్వాములలో ఒకటైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ వ్యవస్థను తయారు చేసింది. వినియోగదారు మూల్యాంకన పరీక్షల్లో భాగంగా డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు, పరిశ్రమ, రక్షణ దళాల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో త్వరలోనే ఈ క్షిపణిని భద్రతాదళాల్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ప్రయోగం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో డీఆర్‌డీవో, రక్షణ దళాలు, పరిశ్రమ భాగస్వాములకు రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ముప్పులను ఎదుర్కొనేలా భద్రత దళాల సాంకేతిక సామర్థ్యాలను, కార్యాచరణ సన్నద్ధతను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన ఈ క్షిపణి బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.

ఈ ప్రయోగం విజయానికి కృషి చేసిన సిబ్బందిని రక్షణ కార్యదర్శి, రక్షణ ఆర్ అండ్ డీ విభాగం కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్ శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ప్రశంసించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2333594) సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Odia , Tamil , Malayalam