నాడు పోస్టు చేయడమైనది:
06 NOV 2026 10:08AM by PIB Hyderabad
ధన్‌తేరస్ సందర్బంగా పౌరులందరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భగవాన్ ధన్వంతరి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ శాంతులతో పాటు మంచి ఆరోగ్యం కూడా కలగాలని దైవాన్ని ప్రధానమంత్రి వేడుకున్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఉత్సాహం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
దివ్య వైద్యుడు భగవాన్ ధన్వంతరి ఆశీర్వాదాలతో అందరికీ మంచి జరగాలని భగవాన్ ధన్వంతరిని శ్రీ మోదీ అర్చించి, ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ, ఓ సంస్కృత సుభాషితాన్ని కూడా ఆ సందేశంలో ప్రస్తావించారు..:
‘‘ధన్‌తేరస్‌ను పురస్కరించుకొని దేశప్రజలకు చాలా చాలా శుభకామనలు.
భగవాన్ ధన్వంతరి దివ్య కృపతో, అందరి జీవితాలలో ఎల్ల వేళలా సుఖం, శాంతి, ఉత్తమ స్వస్థత సిద్ధించాలి.
ప్రతి కుటుంబంలో ఆనందోత్సాహాల అఖండ దీపం వెలుగులీనుతూ ఉండాలని, ఈ మంగళప్రద సందర్భంలో నేను అభిలషిస్తున్నాను.
నమామి ధన్వన్తరిమాదిదేవం సురాసురైర్వన్దితపాదపద్మమ్
లోకే జరారుగ్భయమృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనామ్.’’