నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 9:01AM by PIB Hyderabad
గనుల తవ్వకం శాఖ మంత్రుల 4వ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం 2026 నవంబర్ 5వ, 6వ తేదీల్లో గోవాలో నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల గనుల తవ్వకం శాఖ మంత్రులతో పాటు, కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొంటున్నారు.
రెండు రోజుల ఈ సమావేశంలో గనుల తవ్వకాల రంగానికి చెందిన వివిధ విషయాలపై రాష్ట్రాల గని తవ్వకం శాఖ మంత్రులతో పాటు సీనియర్ అధికారులు చర్చించడమే కాకుండా, తమ తమ ఆలోచనలను పరస్పరం తెలియజేసుకుంటున్నారు.
ఈ రంగం పురోగతి, ఈ రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లపై సమావేశంలో చర్చిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రాలకు వాటి అనుభవాలను, అవి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను, అత్యుత్తమ పద్ధతులను తెలియజేయవలసిందిగా కూడా ప్రోత్సహిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాలుపంచుకొంటున్న నేపథ్యంలో, వివిధ రాష్ట్రాలు పరస్పర సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి, భారతదేశ గని తవ్వకాల రంగంలో ముందు ముందు అభివృద్ది, పరిణామక్రమంపై చర్చోపచర్చలను చేపట్టడానికి వీలు కలుగుతోంది.
దేశంలో గని తవ్వకాల రంగాన్ని ఉమ్మడి ప్రాతిపదికన అభివృద్ధి పథంలో పయనించేటట్లుగా ప్రోత్సహించడంలోను, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు నడుం బిగించడంలో ఈ రంగం తోడ్పాటును నిర్ధరించడంలోను రాష్ట్ర ప్రభుత్వాలతో గనుల మంత్రిత్వ శాఖ కలసికట్టుగా నిరంతర అనుబంధాన్ని ఏర్పరుచుకొని, తన వంతు తోడ్పాటును తప్పక అందిస్తుండటాన్ని ఈ సమావేశం సూచిస్తున్నది.