నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 1:04PM by PIB Hyderabad
దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సౌర ఇంధనం పోషిస్తున్న పాత్ర అంతకంతకు విస్తరిస్తుండటంతో, స్వచ్ఛ ఇంధనం దిశగా భారత్ వేగంగా పురోగమిస్తోందని కేంద్ర మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషీ, శ్రీ మైక్ బ్లూంబర్గ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు. పునరుత్పాదక ఇంధన రంగ వృద్ధి, ఇంటి పైకప్పులపై సౌర యూనిట్ల విస్తరణ, నిల్వ, పంపిణీ ప్రక్రియలలో పెట్టుబడులు పెరుగుతుండటం వంటి అంశాలను ఈ వ్యాసంలో పేర్కొన్నారని శ్రీ మోదీ అన్నారు. ఈ మార్పు విద్యుత్తు బిల్లులను తగ్గించడం, ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఏ విధంగా తోడ్పడుతోందో వ్యాసంలో తెలియజేశారని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘భారతదేశంలో ఇంధన అవసరాలను తీర్చడంలో సౌర ఇంధనం పాత్ర అంతకంతకు విస్తరిస్తోంది. దీంతో స్వచ్ఛ ఇంధనం దిశగా భారత్ పరివర్తన వేగాన్ని పుంజుకుంది.
పునరుత్పాదక ఇంధన రంగ వృద్ధిని గురించి, ఇంటి పైకప్పులపైన సౌర యూనిట్ల విస్తరణ, నిల్వ, పంపిణీ ప్రక్రియలలో పెట్టుబడులు పెరగడం గురించి కేంద్ర మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషీ, శ్రీ మైక్ బ్లూంబర్గ్ తమ వ్యాసంలో వివరించారు.
ఈ మార్పు.. విద్యుత్తు బిల్లులను తగ్గించడానికి, ఉద్యోగ కల్పనకు, ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవడానికి ఎలా తోడ్పడుతున్నదీ కూడా వారు ప్రస్తావించారు’’ అని పేర్కొన్నారు.
***